2017 కవాసకి జడ్900 ఇండియాలో విడుదల: ధర కేవలం రూ. 9 లక్షలు మాత్రమే

Written By:

కవాసకి మోటార్ ఇండియా విపణిలోకి జడ్800 మోటార్ సైకిల్ స్థానాన్ని భర్తీ చేస్తూ, జడ్900 బైకును విడుదల చేసింది. దీని ధర రూ. 9 లక్షలు ఎక్స్ షోరూమ్ డిల్లీగా ఉంది. జడ్800తో పోల్చుకుంటే దీని ధర సుమారుగా లక్షా ఇరవైవేల కన్నా ఎక్కువగా ఉంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
2017 కవాసకి జడ్900 విడుదల

ఈ ఇకానిక్ సూపర్ నేక్డ్‌ వెర్షన్ జడ్900 బైకు కవాసకి యొక్క జడ్1 మరియు జిపిజడ్900ఆర్ బైకుల స్వభావాన్ని కలిగి ఉంటుంది. సాంకేతింకగా ఇందులో నాలుగు సిలిండర్ల ఇంజన్ కలదు. ఇది అన్ని పరిస్థితుల్లో అత్యుత్తమ పవర్ ఉత్పత్తి చేస్తుంది.

ఇంజన్ వివరాలు...

ఇంజన్ వివరాలు...

సాంకేతికంగా 2017 కవాసకి జడ్900 బైకులో 948సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 124బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు, ఇది జడ్800 కన్నా 12బిహెచ్‌పి పవర్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది.

2017 కవాసకి జడ్900 విడుదల

మునుపటి కవాసకి జడ్800 కన్నా దీని బరువు 20.5 కిలోలుగా తక్కువగా ఉంది. జడ్900 తోబుట్టువుగా చెప్పుకునే జడ్800 బరువు సుమారు 210.5 కిలోలుగా ఉంది.

ఫీచర్లు

ఫీచర్లు

కవాసకి జడ్900 బైకులో గేర్లను అత్యుత్తమంగా క్రిందకు వేయడానికి కవాసకి ప్రత్యేకంగా అభివృద్ది చేసిన స్లిప్పర్ క్లచ్ ఫీచర్ కలదు, మరియు స్టాండర్డ్ ఫీచర్‌గా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టిమ్ అందివ్వడం జరిగింది.

2017 కవాసకి జడ్900 విడుదల

కవాసకి జడ్900లో సస్పెన్షన్ భాద్యతల కోసం ముందువైపున 41ఎమ్ఎమ్ అప్ సైడ్ డౌన్(యుఎస్‌డి) ఫ్రంట్ ఫోర్క్స్ అదే విధంగా వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ కలదు. మోనో షాక్‌లో ప్రిలోడ్ ఫంక్షన్స్‌కు అనుగుణంగా అడ్జెస్ట్ చేసుకునే అవకాశం కలదు.

2017 కవాసకి జడ్900 విడుదల

బ్రేకింగ్ కోసం కవాసకి తమ జడ్900లో ముందు వైపున నాలుగు పిస్టన్ కాలిపర్లు ఉన్న 300ఎమ్ఎమ్ చుట్టుకొలత గల రెండు డిస్క్ బ్రేకులు కలవు, మరియు వెనుక వైపున సింగల్ పిస్టన్ కాలిపర్ గల 250ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు.

2017 కవాసకి జడ్900 విడుదల

లైట్ వెయిట్ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ బరువున్న ట్యుబ్ తరహా ట్రెల్లిస్ ఫ్రేమ్ మరియు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ మేళవింపుతో దీనిని నిర్మించడం జరిగింది.

2017 కవాసకి జడ్900 విడుదల

స్టైలిష్ విషయానికి వస్తే, తమ మునుపటి డిజైన్ ఫీచర్లనే పాటిస్తోంది కవాసకి, ఇందులో తక్కువ ఎత్తులో ఉన్న సీటు మరియు విశాలమైన హ్యాండిల్ బార్ కలదు. తద్వారా సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన రైడింగ్ సాధ్యమవుతుంది.

2017 కవాసకి జడ్900 విడుదల

ధరల విషయానికి వస్తే, కవాసకి కాస్త కఠినంగా నిర్ణయిస్తుంది. అందుకే జడ్800 కన్నా రూ 1.20 లక్షల ఎక్కువ ధరతో జడ్900 బైకును విడుదల చేసింది. నాలుగు సిలిండర్ల ఇంజన్‍‌లతో సరసమైన బైకును కోరుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.

2017 కవాసకి జడ్900 విడుదల

దిగ్గజ "రోల్స్ రాయిస్" కార్ల తయారీ కంపెనీ చేత క్షమాపణ చెప్పించుకునేట్లు చేసిన ఓ భారతీయ రాజు కథ ఇది.... మరింత చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...

 

English summary
Also Read In Telugu: 2017 Kawasaki Z900 Launched In India; Priced At Rs 9 Lakh. Read about Kawasaki z900 engine, mileage, price, features, specifications and more in Telugu.
Story first published: Saturday, March 25, 2017, 16:53 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark