Just In
- 38 min ago కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 4 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- 6 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 14 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
Don't Miss
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ రికార్డ్ స్పీడ్ వీడియో: గుండెజారి చేతిలోకి
పైక్స్ పీక్ ఇంటర్నేషనల్ హిల్ క్లైంబ్ రేసులో కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. హెవీవెయిట్ మోటార్ సైకిల్ శ్రేణిలో సూపర్ డ్యూక్ ఆర్ బైకును క్రిస్ ఫిల్మోర్ రైడ్ చేశాడు.
తాజాగా ముగిసిన పైక్స్ పీక్ ఇంటర్నేషనల్ హిల్ క్లైంబ్ రేసులో కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. హెవీవెయిట్ మోటార్ సైకిల్ శ్రేణిలో సూపర్ డ్యూక్ ఆర్ బైకును క్రిస్ ఫిల్మోర్ రైడ్ చేసి రికార్డ్ సృష్టించాడు.
కెటిఎమ్ వద్ద సిద్దంగా లభించే పవర్పార్ట్స్తో కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ ఆర్ ను కస్టమైజ్ చేశారు. కొలరాడో స్ప్రింగ్స్ క్లోజ్ రోడ్ హిల్ క్లైబ్ సర్క్యూట్ లోని 19.99కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫినిష్ లైన్‌ను కేవలం 9 నిమిషాల 49.626 సెకండ్ల కాలవ్యవధిలోనే చేధించాడు.
క్రిస్ ఫిల్మోర్ ఏఎమ్ఏ సూపర్ బైక్ ఛాంపియన్షిప్ రేసర్ మరియు పైక్స్ పీక్ ఇంటర్నేషనల్ హిల్ క్లైంబ్ రేసులో తొలిసారిగా పాల్గొన్నాడు. పైక్స్ పీక్ రేసింగ్‌లో తొలిసారిగానే పాల్గొన్నప్పటికీ, ఈ రేసింగ్‌లో ఇప్పటి వరకు ఉన్న హై స్పీడ్ రికార్డ్ ఇతగాడు బ్రేక్ చేసాడు.
ఆస్ట్రియన్‌కు చెందిన కెటిఎమ్ వద్ద అత్యంత శక్తివంతమైన సూపర్ రేసింగ్ బైకు కెటిఎమ్ 12090 సూపర్ డ్యూక్ ఆర్. 2017 వెర్షన్లో వచ్చిన ఈ బైకు అనేక అప్డేట్స్కు గురయ్యింది. సాంకేతికంగా ఇందులో 1,301సీసీ ఇంజన్ గరిష్టంగా 177బిహెచ్పి పవర్ మరియు 141ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.
పైక్స్ పీక్ ఇంటర్నేషనల్ హిల్ క్లైంబ్ రేసులో పాల్గొన్నది తొలిసారే అయినప్పటికీ, ఒళ్లుగగుర్పొడిచే ప్రదర్శన కనబరిచాడు క్రిస్ ఫిల్మోర్. ఇక్కడున్న వీడియో చూడండి, ఈ రేస్ ఎంత ప్రమాదకరమైందో మీకే తెలుస్తుంది.