EICMA 2017: 790సీసీ అడ్వెంచర్ బైక్ ఆవిష్కరించిన కెటిఎమ్

ఆస్ట్రియన్ మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం కెటిఎమ్ 2017 మిలాన్ మోటార్ సైకిల్ షో(EICMA) వేదిక మీద 790 అడ్వెంచర్ ప్రోటోటైప్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది.

By Anil

EICMA 2017 కవరేజ్: ఆస్ట్రియన్ మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం కెటిఎమ్ 2017 మిలాన్ మోటార్ సైకిల్ షో(EICMA) వేదిక మీద 790 అడ్వెంచర్ ప్రోటోటైప్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం అభివృద్ది దశలో ఉన్న కెటిఎమ్ 790 అడ్వెంచర్ అతి త్వరలో ప్రొడక్షన్ దశకు చేరుకోనుంది.

కెటిఎమ్ వారి ఇకానిక్ మోడల్ 690 అడ్వెంచర్ బైక్ స్థానాన్ని భర్తీ చేస్తూ, 2019 నాటికి ప్రపంచ కెటిఎమ్ షోరూమ్‌లను చేరనుంది. కెటిఎమ్ అడ్వెంచర్ 790 మోటార్ సైకిల్ ఫోటోలు మరియు కంప్లీట్ డిటైల్స్....

కెటిఎమ్ 790 అడ్వెంచర్

కెటిఎమ్ అడ్వెంచర్ 790 మోటార్ సైకిల్‌లో అదే మునుపటి ఎల్‌సి80 ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ రానుంది. ఇదే వేదిక మీద సరికొత్త డ్యూక్ 790 బైక్ EICMA 2017 వేదిక మీద కొలువుదీరింది. కెటిఎమ్ అభివృద్ది చేసిన 790సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ 9,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 103.5బిహెచ్‌పి పవర్ మరియు 8,000ఆర్‌పిఎమ్ వద్ద 86ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Recommended Video

[Telugu] Ducati 1299 Panigale R Final Edition Launched In India - DriveSpark
కెటిఎమ్ 790 అడ్వెంచర్

డిజైన్ పరంగా కెటిఎమ్ మరో కొత్త లెవల్‌కు వెళ్లిందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న కెటిఎమ్ బైకుల్లోనే ఫ్యూచర్ డిజైన్ కనబడుతుంది. మరి, 2019 నాటికి విపణిలోకి రానున్న అడ్వెంచర్ శ్రేణి అడ్వెంచర్ 790 బైకుల డిజైన్ అంత అడ్వాన్స్‌గా ఉంటుందో అని చెప్పడానికి ఈ ఫోటోల నిదర్శనం.

కెటిఎమ్ 790 అడ్వెంచర్

మిడత పురుగు ఆకారంలో ఉన్న కెటిఎమ్ 790 అడ్వెంచర్ బైకులో హెడ్ ల్యాంప్ కాస్త విచిత్రంగా కనిపిస్తుంది. ఈ సూపర్ బైకులో రెండుగా చీలిపోయిన రూపంలో ఉన్న హెడ్ ల్యాంప్, పొడవాటి విండ్ స్క్రీన్ మరియు లాంగ్ ట్రావెల్ గల ఫ్రంట్ ఫోర్క్స్ అందివ్వడంతో అగ్రెసివ్ డిజైన్ సొంతం చేసుకుంది.

కెటిఎమ్ 790 అడ్వెంచర్

కెటిఎమ్ 790 అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఓవరాల్ డిజైన్‌లో మన దృష్టిని ప్రధానంగా ఆకర్షించే అంశం బాడీలో ఇంజన్ ఒదిగిపోయిన తీరు. దీంతో అన్ని రకాల ఆఫ్ రోడింగ్ మరియు అడ్వెంచర్స్ దీనితో సాధ్యమవుతాయి.

కెటిఎమ్ 790 అడ్వెంచర్

బెస్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కోసం అక్రపోవిక్ ఎగ్జాస్ట్ పైపును 790 అడ్వెంచర్‌లో జోడించడం జరిగింది. అడ్వెంచర్ స్పెషలిస్ట్ 790 సిరీస్‌లో పరిమాణంలో ఉన్న(ముందు వైపు 21-అంగుళాల మరియు వెనుక వైపున 18-అంగుళాల) వీల్స్ అందివ్వడం జరిగింది.

కెటిఎమ్ 790 అడ్వెంచర్

బ్రేకింగ్ కార్యకలాపాల కోసం ముందు చక్రానికి రెండు డిస్క్ బ్రేకులు, వెనుక చక్రానికి సింగల్ డిస్క్ బ్రేక్ కలదు. ఏబిఎస్ మరియు ఇతర సేఫ్టీ ఫీచర్ల గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే, ప్రొడక్షన్ దశకు చేరుకున్న తరువాత ఇందులో రానున్న భద్రత ఫీచర్లు రివీల్ కానున్నాయి.

కెటిఎమ్ 790 అడ్వెంచర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కెటిఎమ్ స్ట్రీట్ స్పోర్ట్స్ బైకులతో పాటు అడ్వెంచర్ సెగ్మెంట్ మీద కూడా దృష్టి సారించింది. మునుపటి బాలిస్టిక్ 690 అడ్వెంచర్ మోటార్ సైకిల్ స్థానాన్ని ఈ సరికొత్త 790 అడ్వెంచర్ భర్తీ చేయనుంది. పర్ఫెక్ట్ అడ్వెంచర్ యూనిట్‌గా మిలాన్ మోటార్ సైకిల్ షో వేదిక మీద మంచి మార్కులు పొందిన 2019 నాటికి పూర్తి స్థాయిలో విడుదల కానుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 7, 2017, 22:07 [IST]
English summary
Read In Telugu: EICMA 2017 - KTM 790 Adventure Prototype Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+