కెటిఎమ్ ఆర్‌సి200 మరియు ఆర్‌సి390 విడుదల: ప్రారంభ ధర రూ. 1.71 లక్షలు

Written By:

ఆస్ట్రియన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కెటిఎమ్ ఇండియన్ మార్కెట్లోకి ఆర్‌సి శ్రేణిలో రెండు బైకులను విడుదల చేసింది. నూతన కలర్ మరియు ప్రీమియమ్ ఫీచర్లతో విడుదలైన ఆర్‌సి200 ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.71 లక్షలు మరియు ఆర్‌సి390 బైకు ప్రారంభ వేరియంట్ ధర రూ. 2.25 లక్షలు ఎక్స్ షోరూమ్ గా ఉన్నాయి.

సరసమైన ధరతో అగ్రెసివ్ మోటార్ సైకిళ్లను అభివృద్ది చేసే కెటిఎమ్ జర్మనీలో జరిగిన 2016 ఇంటర్‌మోట్ మోటార్ సైకిల్ షో వేదిక మీద ఈ రెండు బైకులను ప్రదర్శించింది. ప్రస్తుతం జపాన్ మార్కెట్లో ఉన్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లో ఇది బలమైన పోటీనివ్వనుంది.

ఆర్‌సి200 మరియు ఆర్‌సి390 బైకులు నూతన కలర్ మరియు బాడీ గ్రాఫిక్స్ లతో విడుదలయ్యాయి. ఇక ఆర్‌సి390 వేరియంట్లో బిఎల్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ను కలిగి ఉంది.

కెటిఎమ్ ఆర్‌సి390 వేరియంట్ పోటీదారులు

ఇండియన్ మార్కెట్లో కెటిఎమ్‌ ఆర్‌సి390 బైకు యమహా ఆర్3 మరియు కవాసకి నింజా 300 మోడళ్లకు బలమైన పోటీనివ్వగలదు. అంతర్జాతీయ విపణిలో జపాన్ స్పోర్ట్స్ మోటార్ సైకిళ్లకు అధిక ప్రాధాన్యత ఉంది. ఎలాంటి పరిస్థితులలోనైనా ఉత్తమ పనితీరు, నాణ్యత మరియు విశ్వసనీయత పరంగా జపాన్ స్పోర్ట్స్ బైకులకు పెట్టింది పేరు. అయితే కెటిఎమ్ వీటిని ఎదుర్కుంటుందా లేదా అన్నది చూడాలి.

అత్యంత సరసమైన పాకెట్ రాకెట్ కెటిఎమ్ వారి ఆర్‌సి200. ఇది ప్రస్తుతం ఉన్న యమహా ఆర్15 వి2.0 (త్వరలో వి3.0 వెర్షన్ విడుదల కానుంది) మరియు హోండా సిబిఆర్ 150ఆర్ మోటార్ సైకిళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

కెటిఎమ్ ఆర్‌సి390 ఇంజన్ వివరాలు

సాంకేతికంగా కెటిఎమ్ తమ ఆర్‌సి390 బైకులో 373సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ను అందించింది. ఇది సుమారుగా 44బిహెచ్‌పి పవర్ మరియు 36ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి స్లిప్పర్ క్లచ్ ద్వారా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

కెటిఎమ్ ఆర్‌సి200 ఇంజన్ వివరాలు

కెటిఎమ్ తమ కెటిఎమ్ ఆర్‌సి200 లో 24బిహెచ్‌పి పవర్ మరియు 19.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 199సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ అందించింది. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

కెటిఎమ్ ఆర్‌సి200 మరియు ఆర్‌సి390 ధరలు

  • కెటిఎమ్ ఆర్‌సి200 ధర రూ. 1,71,740 లు
  • కెటిఎమ్ ఆర్‌సి390 ధర రూ. 2,25,300 లు
రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

కెటిఎమ్ ఆర్‌సి390 ఫీచర్లు

  • రైడ్ బై వైర్ థ్రోటిల్, 
  • సౌకర్యవంతమైన కొత్త డిజైన్ లో ఉన్న సీటు, 
  • విశాలంగా ఉన్న అద్దాలు, 
  • అడ్జెస్ట్ చేసుకునే వీలున్న లీవర్లు ఇందులో ఉన్నాయి.

ఈ మోడల్ గతంలో కెటిఎమ్ అందుబాటులో ఉంచిన బైకుల నుండి డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, బయటకు కనిపించే విధంగా ఉన్నటువంటి ట్రెల్లిస్ ట్యూబులర్ ఫ్రేమ్ మరియు ఎల్ఇడి పైలట్ లైట్లను కలిగి ఉంది. ఇంజన్ క్రింది వైపున ఉండే ఎగ్జాస్ట్ సిస్టమ్ స్థానంలో పెద్ద ఎగ్జాస్ట్ పైపు కలదు. ఈ ఫీచర్లన్నింటి జోడింపుతో దీని బరువు మొత్తం 167.5 కిలోలుగా ఉంది.

కెటిఎమ్ ఈ ఆర్‌సి390 లో ఇవిఎపి పరికరాన్ని అందించింది. ఇది గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి వాతవరణంలో నుండి ఇంధన ట్యాంకులో చేరిన అనంతరం ఉత్పన్నమయ్యే గ్యాస్ పొగలను నివారిస్తుంది. మరియు ప్రస్తుతం మరే మోటార్ సైకిళ్లలో లేని విధంగా ఇందులో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ ఉపకరణాల ద్వారా బైకును ఆపరేట్ చేసేందుకు సిఏఎన్ బస్ వ్యవస్థను అందివ్వడం జరిగింది.

సస్పెన్షన్ పరంగా ముందు వైపున 43ఎమ్ఎమ్ అప్ సైడ్ డౌన్ డబ్ల్యూపి ఫోర్క్స్ మరియు వెనుక వైపున డబ్ల్యూపి మోనో షాక్ అబ్జార్వర్ కలదు. ముందు వైపున 320ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ (డిస్క్ లో నాలుగు పిస్టన్ల రేడియల్ ఫిక్స్‌డ్ కాలిపర్ కలదు) మరియు వెనుక వైపున 230ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు (సింగల్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్ వ్యవస్థ). రెండు చక్రాలకు 9ఎమ్‌బి డ్యూయల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు.

కెటిఎమ్ విడుదల చేసిన ఆర్‌సి200 బైకులో మెకానికల్ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు, అయితే బాడీ కలర్ మరియు గ్రాఫిక్స్ పరంగా నూతన మార్పులకు గురైంది. ఇందులో ముందు వైపున 43ఎమ్ఎమ్ డబ్ల్యూపి సస్పెన్షన్ మరియు వెనుక వైపున డబ్ల్యూపి మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

గతంలో ఉన్న వేరియంట్‌తో పోల్చితో ఇంధన ట్యాంకు సామర్థ్యం 10 లీటర్ల నుండి 9.5-లీటర్లకు కుదించబడింది. ఆర్‌సి200 మోటార్ సైకిల్ మొత్తం బరువు 147 కిలోలుగా ఉంది.

బుకింగ్స్ మరియు డెలివరీలు

కెటిఎమ్ ఆర్‌సి390 మరియు ఆర్‌సి200 మోటార్ సైకిళ్ల బుకింగ్స్ నేటి (జనవరి 19, 2017) నుండే ప్రారంభించారు, మరో వారంలో ఆర్‌సి200 మరియు రెండు మూడు వారాల అనంతరం ఆర్‌సి390 ల డెలివరీ ఇవ్వనున్నట్లు కెటిఎమ్ తెలిపింది.

కొత్తగా విడుదలైన కెటిఎమ్ ఆర్‌సి390 మోటార్ సైకిల్ ఫోటో గ్యాలరీ.... చూడటానికి క్లిక్ చేయడం.

 

English summary
2017 KTM RC390 & RC200 Launched In India; Launch Price + Photo Gallery
Story first published: Thursday, January 19, 2017, 15:47 [IST]
Please Wait while comments are loading...

Latest Photos