మళ్లీ ఇండియాలోకి ల్యాంబీ స్కూటర్: వెస్పా కథ కంచికే!!

స్కూటర్ల తయారీ సంస్థ ల్యాంబ్రెట్టా బ్రాండ్ విపణిలో అధికారిక కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమవుతోంది. తాజాగా మిలాన్ నగరంలో జరిగిన EICMA మోటార్ సైకిల్ షో వేదిక మీద ఆ మూడు మోడళ్లను ఆవిష్కరించింది.

By Anil

ల్యాంబ్రెట్టా... పేరు వినడానికి చాలా కొత్తగా ఉంది కదూ... ఇది మనకు కొత్తే కావచ్చు, కానీ దీనికి ఇండియా కొత్త కాదు. సరిగ్గా 1950 వ సంవత్సరంలో ఇటాలియన్ స్కూటర్ల తయారీ దిగ్గజం భారతప్రభుత్వ సహకారంతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించిది.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

తరువాత ల్యాంబీ పేరుతో స్కూటర్లను తయారు చేసి విక్రయించిన ల్యాంబ్రెట్టా సుమారుగా నలభైయేళ్ల తరువాత ఇండియన్ మార్కెట్ నుండి వైదొలిగింది. భారత్‌లో టూ వీలర్ల మార్కెట్ ఊపందుకున్న నేపథ్యంలో ఇండియన్స్ ముందుగా పిలుచుకునే ల్యాంబీ భారత స్కూటర్ల పరిశ్రమ వైపు అడుగులు వేస్తోంది.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

దిగ్గజ స్కూటర్ల తయారీ సంస్థ ల్యాంబ్రెట్టా బ్రాండ్ మూడు సరికొత్త మోడళ్లతో దేశీయ విపణిలో అధికారిక కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమవుతోంది. తాజాగా ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన 2017 EICMA మోటార్ సైకిల్ షో వేదిక మీద ఆ మూడు మోడళ్లను ఆవిష్కరించింది.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

ల్యాంబ్రెట్టా సంస్థ పాత కాలపు డిజైన్‌లో కొత్త టెక్నాలజీ అందించి కొత్త స్కూటర్లను ఆవిష్కరించింది. వీటి ఓవరాల్ డిజైన్ చూడటానికి అచ్చం 1950 నుండి 1960 ల కాలంలో తయారయ్యే స్కూటర్లను పోలి ఉంటాయి.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

ల్యాంబ్రెట్టా మిలాన్ మోటార్ సైకిల్ షోలో ఆవిష్కరించిన మూడు స్కూటర్ల పేర్లు వి అక్షరంతో మొదలవుతాయి. ఆ స్కూటర్లు - వి50 స్పెషల్, వి125 స్పెషల్ మరియు వి200 స్పెషల్.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

ఈ మూడు మోడళ్లు కూడా ఫిక్స్‌డ్ ఫెండర్ మరియు ఫ్లెక్స్‌డ్ ఫెండర్ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభించనున్నాయి. ల్యాంబ్రెట్టా ఈ నూతన శ్రేణి స్కూటర్లను తైవాన్ దేశంలో ఉత్పత్తి చేసి 2018 ప్రారంభం నాటికి యూరోపియన్ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

ల్యాంబ్రెట్టా పరిచయం చేసిన మూడు మోడళ్లలో కూడా వి50 స్కూటర్ అత్యంత తక్కువ కెపాసిటి ఇంజన్ కలిగి ఉంది. ఇందులోని 49సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ 3.4బిహెచ్‌పి పవర్ మరియు 3.4ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

ల్యాంబ్రెట్టా వి125 స్పెషల్ స్కూటర్ 125 కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 9.9బిహెచ్‌పి పవర్ మరియు 9.2ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

ల్యాంబ్రెట్టా ప్రవేశపెట్టిన టాప్ రేంజ్ మోడల్ వి200 స్పెషల్. ప్రతి సెగ్మెంట్లో కూడా విభిన్న ఇంజన్ కెపాసిటితో క్లాసిక్ డిజైన్ శైలిలో స్కూటర్లను అందించే ఉద్దేశంతో వీటిని ఆవిష్కరించింది. వి200 స్పెషల్ స్కూటర్‌లో 168.9సీసీ కెపాసిటి గల ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

ల్యాంబ్రెట్టా వి200 స్పెషల్ స్కూటర్ లోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 12బిహెచ్‌పి పవర్ మరియు 12.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో భద్రత పరంగా డిస్క్ బ్రేకులు మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ కలదు.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

ల్యాంబ్రెట్టా వి స్పెషల్ స్కూటర్లలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఎల్ఇడి హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్స్, 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు 12-వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ వంటివి ఉన్నాయి.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

భారత్‌లో ల్యాంబ్రెట్టా...

భారత స్వాతంత్య్రానంతరం ప్రజారవాణాకు ఎన్నో ఇబ్బందులు ఉండేవి. రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత భారతదేశంలో రోడ్డు, రవాణా పరమైన మౌళికసదుపాయాలు ఏ మాత్రం ఉండేవి కాదు. ఆ సమయంలో వ్యక్తిగత రవాణా కోసం భారత ప్రభుత్వం ల్యాంబ్రెట్టాతో చేతులు కలిపింది.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

తరువాత 1950 నుండి ఆటోమొబైల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఇండియా(API) లైసెన్స్ క్రింద టూ వీలర్లను ఉత్పత్తి చేసింది. కొంత కాలం తరువాత స్కూటర్స్ ఇండియా లిమిటెడ్(SIL) లైసెన్స్‌తో స్కూటర్లను తయారు చేసింది.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

అలా 1990 వరకు ల్యాంబ్రెట్టా ప్రస్థానం ఇండియాలో కొనసాగింది. అయితే, అనుకోకుండా ల్యాంబ్రెట్టాను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం కారణంగా సుమారుగా రెండు దశాబ్దాల పాటు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి అంతర్జాతీయ మార్కెట్ నుండి అదృశ్యమయ్యింది.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

ఇప్పుడు ల్యాంబ్రెట్టా పుట్టిన దేశం ఇటలీలోని మిలాన్ నగర వేదికగా జరిగిన 2017 EICMA మోటార్ సైకిల్ షో వేదిక మీద తమ చరిత్రను రంగరించి మూడు కొత్త క్లాసిక్ స్కూటర్లను ఆష్కరించింది. ల్యాంబ్రెట్టా ఈ స్కూటర్లతో 2019 నాటికి దేశీయ విపణిలోకి ప్రవేశించనుంది.

ల్యాంబ్రెట్టా స్కూటర్లు

ల్యాంబ్రెట్టా క్లాసిక్ స్కూటర్లు పూర్తి స్థాయిలో దేశీయ విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ఉన్న పియాజియా వెస్పా స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Iconic Scooter Brand Lambretta Is Back; India Entry In 2019
Story first published: Saturday, November 11, 2017, 19:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X