లిమిటెడ్ ఎడిషన్ డుకాటి డైవెల్ డీజల్ బైకు విడుదల: ధర రూ. 19.92 లక్షలు

Written By:

ఇటాలియన్‌కు చెందిన దిగ్గజ ఖరీదైన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ డుకాటి దేశీయ విపణిలోకి తమ స్పోర్ట్స్ క్రూయిజర్ మోటార్ సైకిల్ డైవెల్ డీజల్‌ను లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసింది. డీజల్ అంటే డీజల్‌తో నడుస్తుందనుకునేరు, పేరులో మాత్రమే డీజల్ జోడించారు, నిజానికి ఇది పెట్రోల్ మాత్రమే నడుస్తుంది.

డుకాటి డైవెల్ డీజల్ లిమిటెడ్ ఎడిషన్

డుకాటి ఈ డైవెల్ డీజల్‌ను ప్రపంచ వ్యాప్తంగా కేవలం కేవలం 666 యూనిట్లను మాత్రమే లిమిటెడ్ ఎడిషన్‌గా అందుబాటులో ఉంచింది. ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర రూ. 19.92 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

డుకాటి డైవెల్ డీజల్ లిమిటెడ్ ఎడిషన్

లిమిటెడ్ ఎడిషన్ డైవెల్ డీజల్ బైకులో చేతితో మలచబడిన స్టెయిన్ లెస్ స్టీల్ స్ట్రక్చర్ అందివ్వడం జరిగింది, అంతే కాకుండా ఈ స్పోర్ట్స్ క్రూయిజర్‌లో వెల్డింగ్ మరియు రివిట్లు వేయబడిన రూపాన్ని స్పష్టంగా కనిపించే శైలిలో అచ్చం చేతితో తయారుచేసిన మోడల్‌‌గా రూపొందించడం జరిగింది.

డుకాటి డైవెల్ డీజల్ లిమిటెడ్ ఎడిషన్

ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే కూర్చోవడానికి వీలున్న ప్యూర్ సింగల్ సీట్ అందించింది, పిరమిడ్ శైలిలో మూడు ఆంగ్లపు డి అక్షరాలు ఉన్నాయి. మూడు డి లు అంటే - డుకాటి, డైవెల్ మరియు డీజల్ అని అర్థం.

డుకాటి డైవెల్ డీజల్ లిమిటెడ్ ఎడిషన్

డుకాటి డైవెల్ డీజల్ బైకులో ఎరుపు రంగులో ఉన్న బ్రెంబో బ్రేక్ కాలిపర్స్ మరియు ఐదు చైన్ లింక్‌లు ఉన్నాయి. ఎల్‌సిడి డ్యాష్ బోర్డ్ ఎర్రటి బ్యాక్ లైట్ కలిగి ఉంది, మూడు ఎగ్జాస్ట్ గొట్టాలు బ్లాక్ జైక్రోటెక్ సిరామిక్ కోటింగ్ కలవు.

డుకాటి డైవెల్ డీజల్ లిమిటెడ్ ఎడిషన్

ఇండియాలో ఈ లిమిటెడ్ ఎడిషన్ డుకాటి డైవెల్ డీజల్ బైకులకు చెందిన బుకింగ్స్ మరియు డెలివరీలు ఆగష్టు 2017 నుండి ప్రారంభం కానున్నాయి.

డుకాటి డైవెల్ డీజల్ లిమిటెడ్ ఎడిషన్

డిజైన్ మరియు ఫ్యాషన్‌ను ఇష్టపడే ఔత్సాహికులను దృష్టిలో ఉంచుకుని ఈ లిమిటెడ్ ఎడిషన్ డుకాటి డైవెల్ డీజల్ బైకును విడుదల చేసినట్లు డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రవి అవలూర్ తెలిపాడు. గతంలో 2012లో మోన్‌స్టర్ డీజల్ బైకును కూడా లిమిటెడ్ సంఖ్యలో ఉత్పత్తి చేసిన విషయాన్ని ఆయన గుర్తుకుచేశాడు.

 
English summary
Limited Edition Ducati Diavel Diesel Launched In India — Priced At Rs 19.92 Lakh
Story first published: Friday, March 31, 2017, 11:20 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark