మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్కూటర్ విడుదల: ఇవీ ప్రత్యేకతలు!!

మహీంద్రా టూ వీలర్స్ ఇండియన్ మార్కెట్లోకి స్పెషల్ ఎడిషన్ 110సీసీ స్కూటర్‌ను విడుదల చేసింది. సరికొత్త మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 48,180 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీగా ) ఉంది.

By Anil

మహీంద్రా టూ వీలర్స్ ఇండియన్ మార్కెట్లోకి స్పెషల్ ఎడిషన్ 110సీసీ స్కూటర్‌ను విడుదల చేసింది. సరికొత్త మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 48,180 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్కూటర్

మహీంద్రా టూ వీలర్స్ తమ చివరి ప్రకటనలో, భారత్‌లో కమ్యూటర్ మరియు చిన్న కెపాసిటి టూ వీలర్ల మార్కెట్ నుండి విశ్రమించి, ఎక్కువ కెపాసిటి గల మోజో మరియు పురాతణ మోడళ్లయిన బిఎస్ఎ మరియు జావా బ్రాండ్ వంటి మోటార్ సైకిళ్ల అభివృద్ది, తయారీ మరియు మార్కెట్ మీద దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది.

మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్కూటర్

మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్కూటర్‌ను పేటిఎమ్ మాల్ నుండి కొనుగోలు చేస్తే రూ. 6,000 ల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఈ ఆఫర్ అక్టోబర్ 20, 2017 వరకు మాత్రమే వర్తిస్తుంది. మరియు గస్టో ఆర్ఎస్ స్కూటర్లను పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు మహీంద్రా తెలిపింది.

Recommended Video

TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్కూటర్

కొత్తగా విడుదలైన మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్కూటర్‌లో కేవలం కాస్మొటిక్ మార్పులు మాత్రమే జరిగాయి. రెగ్యులర్ వేరియంట్‌తో పోల్చుకుంటే బాడీ పెయింటింగ్‌లో చాలా వ్యత్యాసం ఉంటుంది.

మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్కూటర్

స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ఎరుపు మరియు నీలం రంగుల డ్యూయల్ టోన్ కలర్ స్కీములో మాత్రమే లభిస్తోంది.

Ternding On DriveSpark Telugu:

మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్కూటర్

సాధారణ వెర్షన్‌తో పోల్చుకుంటే విభిన్నంగా ఉండేలా స్కూటర్ ఫ్రంట్ డిజైన్‌లో సరికొత్త గ్రాఫిక్స్ మరియు స్కూటర్ మీద ఆర్ఎస్ డీకాల్స్ అందించారు. గ్రాఫిక్స్, డీకాల్స్ మరియు కలర్స్ మినహాయిస్తే స్కూటర్ చూడటానికి రెగ్యులర్ వెర్షన్ 110సీసీ గస్టో స్కూటర్‌నే పోలి ఉంటుంది.

మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్కూటర్

సాంకేతికంగా మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్కూటర్‌లో 109.6సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, సివిటి ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 8బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా గస్టో ఆర్ఎస్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా టూ వీలర్స్ వద్ద ఉన్న గస్టో స్కూటర్ల స్టాకుని క్లియర్ చేసుకునేందుకు గస్టో ఆర్ఎస్ వెర్షన్‌ను ఈ పండుగ సీజన్ కోసం విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్లో కేవలం బాడీ గ్రాఫిక్స్ మరియు ఆర్ఎస్ బ్యాడ్జి మినహాయిస్తే గుర్తించదగిన మార్పులేవీ పెద్దగా చోటు చేసుకోలేదు.

More from DriveSpark

Article Published On: Thursday, October 19, 2017, 11:14 [IST]
English summary
Read In Telugu: Mahindra Gusto RS Launched In India; Priced At Rs 48,180
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+