బైకుల కోసం సరికొత్త జిపిఎస్ ట్రాకింగ్ పరికరం !

Written By:

జిపిఎస్ న్యావిగేషన్, ట్రాకింగ్, లొకేషన్ యాప్స్, మ్యాప్ డాటా, ఏపిఐ మరియు జిఐఎస్ వంటి వాటికి చక్కటి పరిష్కరం తెలిపే సంస్థగా మ్యాప్‌మై ఇండియా పేరుగాంచింది. అయితే ఇప్పుడు టూ వీలర్ల ట్రాకింగ్ కోసం రోవర్ బైక్ పేరుతో భారత దేశపు మొట్టమొదటి జిపిఎస్ ట్రాకింగ్ పరికరాన్ని పరిచయం చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
టూ వీలర్ జిపిఎస్ ట్రాకింగ్ డివైజ్

ఈ పరికరంలో మ్యాప్‌మైఇండియాకు చెందిన మ్యాప్స్ మరియు లొకేషన్ గుర్తించే టెక్నాలజీ, అంతర్గతంగా నిర్మించిన జిపిఎస్, ఇంటర్నెట్ కనెక్టివిటి వంటివి ఉన్నాయి. ఈ పరికరాన్ని బైకులో అమర్చి దీనితో నిరంతరం అనుసంధానంలో ఉండటానికి ఐఒఎస్, ఆండ్రాయిడ్ మరియు విండోస్ వేదికల కోసం అభివృద్ది చేసిన అప్లికేషన్‌ ద్వారా కనెక్ట్ కావచ్చు.

టూ వీలర్ జిపిఎస్ ట్రాకింగ్ డివైజ్

హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ కలయిక ఉండటం ద్వారా మోటార్ సైకిల్ యొక్క లొకేషన్, డ్రైవింగ్ డైరక్షన్ మరియు బైకు యొక్క వేగానికి సంభందించిన రియల్ టైమ్ డేటాను ఎప్పటికప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.

టూ వీలర్ జిపిఎస్ ట్రాకింగ్ డివైజ్

బైక్ రైడింగ్‌కు సంభందించిన పారామీటర్లను కూడా ఇది రికార్డ్ చేస్తుంది. బైక్ ఆన్, ఆఫ్, ఎక్కువ సేపు ఐడిల్‌లో ఉంచడం మరియు ఓవర్ స్పీడ్ వంటి అనేక వివరాలను రోవర్ బైక్ యాప్ అలర్ట్ రూపంలో చేరవేస్తుంది.

టూ వీలర్ జిపిఎస్ ట్రాకింగ్ డివైజ్

రోవర్ బైక్ అప్లికేషన్‌లో వాస్తవిక భౌగోళిక సరిహద్దు(geofence)ను ఎంచుకునే ఆప్షన్‌ అందివ్వడం జరిగింది. తద్వారా ట్రాకింగ్ డివై‌జ్ అప్లికేషన్‌తో అనుసంధానం కోల్పోయినప్పుడు, ఆ కోల్పోయిన ప్రదేశాన్ని గుర్తించేందుకు geofence ఉపయోగపడుతుంది.

టూ వీలర్ జిపిఎస్ ట్రాకింగ్ డివైజ్

మోటార్ సైకిల్ యొక్క ట్రాకింగ్‌ మాత్రమే కాకుండా బైకు సంభందించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటుంది. సర్వీసింగ్ మరియు ఇన్సూరెన్స్ అంతమయ్యే తేదీలను యాప్, ఇమెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ రూపంలో తెలియజేస్తుంది.

టూ వీలర్ జిపిఎస్ ట్రాకింగ్ డివైజ్

రోవర్ బైక్ ట్రాకింగ్ యాప్‌లో కొంత సమాచారాన్ని భద్రత పరుచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అత్యంత అవసరమైన పత్రాలైన డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్, ఇన్సూరెన్స్ పాలసీ, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి వాటిని స్కాన్ చేసి ఇందులో భద్రపరుచుకోవచ్చు.

టూ వీలర్ జిపిఎస్ ట్రాకింగ్ డివైజ్

మ్యాప్‌మైఇండియా తమ రోవర్ బైక్ అప్లికేషన్‍‌లో టర్న్ బై టర్న్ దిశానిర్దేశం చేస్తుంది. తద్వారా మీరు బైకును పార్క్ చేసిన ప్రదేశం గుర్తించడం మరియు అక్కడకు చేరుకునే దిశలను సూచిస్తుంది.

టూ వీలర్ జిపిఎస్ ట్రాకింగ్ డివైజ్

మ్యాప్‌మైఇండియా సంస్థ రోవర్ బైక్ ట్రాకింగ్ పరికరాన్ని రూ. 3,990 ల ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చింది. ఇది పనిచేయడానికి దోహదపడే సిమ్ కార్డును 12 నెలల చందాతో ఉపయోగించుకునేందుకు రూ. 2,400 లు చెల్లించాల్సి ఉంటుంది.

టూ వీలర్ జిపిఎస్ ట్రాకింగ్ డివైజ్

మీ బైకులో ఈ జిపిఎస్ పరికరాన్ని అమర్చుకోవాలనుకుంటే మ్యాప్‌మైఇండియా అధికారిక వెబ్‌సైట్ మీద లేదా ఆటోమొబైల్స్ విడి పరికరాల డీలర్లు మరియు యాక్ససరీ షాప్ లలో కొనుగోలు చేయవచ్చు.

 
English summary
MapMyIndia Launches India's First GPS Tracking Device For Motorcycles — Here Are The Details
Story first published: Wednesday, February 1, 2017, 12:04 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark