మోడిఫైడ్ డామినర్ 400: బజాజ్‌ బుర్రకు తట్టని ఐడియా

బజాజ్ వారి డామినర్ 400 మోటార్ సైకిల్‌ పూర్తి స్థాయి మోడిఫికేషన్స్‌కు గురైంది. సాధారణ డామినర్ 400 ను చూసి దీనిని చూశారంటే ఖచ్చితంగా మోడిఫైడ్ మోడల్‌నే ఎంచుకుంటారు. ఈ స్టోరీ చదవండి మీరు కూడా అవునంటారు.

By Anil

బజాజ్ ఆటో గత ఏడాది డిసెంబర్‌లో డామినర్ 400 మోటార్ సైకిల్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ధరకు తగ్గ విలువలతో విడుదలయిన ఇది ఇండియన్ క్రూయిజ్ బైక్ సెగ్మెంట్లో సునామీ సృష్టించింది. నూతన డిజైన్ మేళవింపుతో అందుబాటులోకి వచ్చిన ఇది యువతను భారీగా ఆకట్టుకుంటోంది.

మోడిఫైడ్ డామినర్ 400

అయితే ఇవాళ్టి కథనంలో మీ ముందుకు తీసుకువచ్చిన మోడిఫైడ్ డామినర్ 400ను చూశారంటే అసలైన డామినర్ 400 కాకుండా ఈ మోడిఫైడ్ బైకు మీద మనసు పారేసుకోవడం ఖచ్చితం. నమ్మశక్యం కాలేదా... అయితే ఈ స్టోరీ పూర్తి చూడాల్సిందే.

మోడిఫైడ్ డామినర్ 400

బజాజ్ ఆటో తమ డామినర్ 400 ను శక్తివంతమైన ఇంజన్, అధునాత ఫీచర్లు, నూతన డిజైన్ భాషలో ధరకు తగ్గ విలువలతో విడుదల చేసింది. అయితే మోడిఫికేషన్ సంస్థ మరింత ఆకర్షణీయంగా కాస్మొటిక్ మార్పులకు గురి చేసి అధ్బుతంగా మోడిఫై చేసింది.

మోడిఫైడ్ డామినర్ 400

నైట్ ఆటో కస్టమైజర్(Knight Auto Customizer) అనే మోడిఫికేషన్ సంస్థ ఈ డామినర్ 400 మోటార్ సైకిల్ ఎక్ట్సీరియర్‌లోని ప్రధాన భాగాలను మెటాలిక్ బ్లూ కలర్‌లో పెయింట్ చేసి, అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.

మోడిఫైడ్ డామినర్ 400

ప్రతి మోటార్ సైకిల్‌లో సీటుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కస్టమైజేషన్ బృందం ఈ డామినర్ 400లో గోధుమ వర్ణంలో ఉన్న సీటును అందించారు. ఇలాంటి రంగులో సీటును చాలా అరుదుగా చూస్తుంటాం.నీలం రంగు ఎక్ట్సీరియర్ రంగుకి ఈ సీటు కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయ్యింది.

మోడిఫైడ్ డామినర్ 400

హెడ్ ల్యాంప్ డిజైన్‌లో బజాజ్ ఓ మెట్టు అడ్వాన్స్‌గా వేసిందని చెప్పవచ్చు. దీని సొగసును పెంచుతూ, గ్లోస్ కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ చేసింది ఈ కస్టమైజేషన్ సంస్థ.

మోడిఫైడ్ డామినర్ 400

ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వద్ద ఉన్న బ్రేక్ క్యాలిపర్ ను ఎరుపు రంగులో అందివ్వడం జరిగింది. నలుపు, నీలం మరియు సిల్వర్ రంగుల మధ్యలో ఎరుగు రంగు మరింత ఆకర్షణీయంగా ఉంది.

మోడిఫైడ్ డామినర్ 400

ప్రతి మోటార్ సైకిల్‌కు టెయిల్ లైట్ తప్పనిసరి, మరి ఇందులో టెయిల్ లైట్ లేదేంటని సందేహిస్తున్నారా... మాకు ఇదే సందేహం కలిగింది. అయితే బ్లాక్ అవుట్ టెయిల్ లైట్లను అసలైన వాటిలో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి బ్రేక్ అప్లై చేసినపుడు లైట్లు వెలుగుతాయి.

మోడిఫైడ్ డామినర్ 400

ఎక్ట్సీరియర్ సొబగుల మీద జరిగిన మార్పులు మినహాయిస్తే, సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. బజాజ్ డామినర్ 400లో శక్తివంతమైన 373సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ అందించింది.

మోడిఫైడ్ డామినర్ 400

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 385బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

మోడిఫైడ్ డామినర్ 400

బజాజ్ ఆటో తమ గేమ్ చేంజర్ క్రూయిజ్ బైకును మూడు విభిన్న (మిడ్ నైట్ బ్లూ, ట్విలైట్ ప్లమ్ మరియు మూన్ లైట్ వైట్) రంగుల్లో పరిచయం చేసింది. ఇప్పటి వరకు మోడిఫైడ్ డామినర్ 400ను నూతన రంగులో చూశారు కదా.... ఇప్పుడు అసలైన డామినర్ 400 వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

Most Read Articles

English summary
Metallic Blue Dominar Is As Cool As A Bajaj Can Get
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X