బిఎస్4 హోండా సిబి హార్నెట్ 160ఆర్ విడుదల: ధర మరియు పూర్తి వివరాల కోసం....

Written By:

జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ తమ 2017 హోండా సిబి హార్నెట్ 160ఆర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. తప్పనిసరి చేసిన బిఎస్4 ఇంజన్ అప్‌గ్రేడ్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్ ఇందులో కలదు.

2017 సిబి హార్నెట్ 160ఆర్ ధరలు

2017 సిబి హార్నెట్ 160ఆర్ ధరలు

2017 సిబి హార్నెట్ 160ఆర్ స్టాండర్డ్ ధర రూ. 81,113 లు

2017 సిబి హార్నెట్ 160ఆర్ సిబిఎస్ ధర రూ. 85,613 లు

స్పెషల్ ఎడిషన్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 82,095 లు

స్పెషల్ ఎడిషన్ సిబిెస్ వేరియంట్ ధర రూ. 86,595 లు

అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బిఎస్4 మోటార్ సైకిల్

ఈ 2017 హోండా సిబి హార్నెట్ 160 ఆర్‌ ను డబుల్ మరియు సింగల్ డిస్క్ బ్రేక్ ఆప్షన్‌లలో మరియు 2017 సిబి హార్నెట్ 160ఆర్ ను నాలుగు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు.అవి, స్ట్రైకింగ్ గ్రీన్, మార్స్ ఆరేంజ్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ మరియు స్పోర్ట్స్ రెడ్.

హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బిఎస్4 మోటార్ సైకిల్

సాంకేతికంగా 2017 హోండా సిబి హార్నెట్ 160 ఆర్‌లో 162.71సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బిఎస్4 మోటార్ సైకిల్

15.04బిహెచ్‌పి పవర్ మరియు 14.76ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బిఎస్4 మోటార్ సైకిల్

ఇందులో ముందు వైపున 276ఎమ్ఎమ్ చుట్టుకొలత గల పెటల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ చుట్టుకొలత గల ఆప్షనల్ డిస్క్ బ్రేక్ కలదు. ముందు మరియు వెనుక వైపుల ట్యూబ్ లెస్ టైర్లను అందివ్వడం జరిగింది.

హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బిఎస్4 మోటార్ సైకిల్

సరికొత్త సిబి హార్నెట్ మరియు మునుపటి హార్నెట్‌కు మధ్య గల తేడా గమనిస్తే, మునుపటి మోడల్ ఉన్న 140 కిలోల కన్నా రెండు కిలోలు తక్కువ బరువుతో 138 కిలోలు మాత్రమే ఉంది. మరియు ఇందులో 12-లీటర్ ఫ్యూయల్ ట్యాంకు కలదు.

 
English summary
Read In Telugu To know about 2017 Honda CB Hornet 160R With BS-IV Engine Launch and Price details.

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark