గోల్డ్ వింగ్ విడుదల వివరాలను వెల్లడించిన హోండా

Written By:

జపాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా తమ సరికొత్త గోల్డ్ వింగ్ బైకును విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. గోల్డ్ వింగ్ బైకును అక్టోబర్ 2017 లో ప్రపంచ ఆవిష్కరణకు సిద్దం చేసింది. అయితే, ఈ తరుణంలో హోండా గోల్డ్ వింగ్ బైకు ఫోటోలు లీక్ అయ్యాయి. వీటి గురించిన మరిన్ని విశేషాలు చూద్దాం రండి...

హోండా గోల్డ్ వింగ్

హోండా గోల్డ్ వింగ్ ముందు మరియు వెనుక వైపు డిజైన్ పూర్తిగా మారిపోయింది. అచ్చం బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ కె-సిరీస్‌ మోటార్ సైకిళ్ల డిజైన్‌ను పోలి ఉంది. దీనితో పాటు, ఎఫ్6బి బైకు ఫోటోలు కూడా రివీల్ అయ్యాయి.

Recommended Video - Watch Now!
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
హోండా గోల్డ్ వింగ్

పూర్తి స్థాయిలో అప్‌డేట్ అయిన గోల్డ్ వింగ్ మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే, చాలా తేలిగ్గా ఉంటుంది. గత మోడల్ డిజైన్‌లోని ముందు భాగంలో భారీ మార్పులు చేయడంతో బరువు చాలా వరకు తగ్గిపోయింది. అంతే కాకుండా, యువ కొనుగోలుదారులని టార్గెట్ చేస్తూ దీనిని రీడిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

హోండా గోల్డ్ వింగ్

హ్యాండిల్ బార్ డిజైన్ పూర్తిగా నూతనత్వాన్ని నింపుకుంది. సరికొత్త స్టీరింగ్ సిస్టమ్ మరియు స్టీరింగ్ సెంటర్ అరేంజ్‌మెంట్ వ్యవస్థలో సాంకేతికంగా కీలక మార్పులు చేసింది. ఫ్రంట్ సస్పెన్షన్ సిస్టమ్‌లో రెండు బైకుల నుండి సేకరించిన ఫోర్క్స్‌ను జోడించి స్టీరింగ్ హ్యాండిల్‌కు జోడించినట్లు ఉంటుంది. ఇక బైకు బరువును రియర్ మోనో షాక్ హ్యాండిల్ చేస్తుంది.

హోండా గోల్డ్ వింగ్

హోండా గోల్డ్ వింగ్ లోని డ్యాష్‌బోర్డులో అప్‌డేట్ చేసిన ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇందులో మూడు ఎల్‌సిడి తెరలు ఉన్నాయి. వీటిలో ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న టిఎఎఫ్‌టి స్క్రీన్ కలదు. న్యావిగేషన్ మరియు ఎన్నో వివరాలను ఈ స్క్రీన్‌ల నుండి పొందవచ్చు.

హోండా గోల్డ్ వింగ్

రహస్యంగా లీక్ అయిన 2018 గోల్డ్ వింగ్ సిరీస్ బైకులో హోండా డిసిటి గేర్‌బాక్స్ అందించింది. కొన్ని ఫోటోలలో క్లచ్ లీవర్ లేదు, మరికొన్నింటిలో క్లచ్ లీవర్ ఉంది. అయితే, రైడర్ ఆటోమేటిక్‌గా గేర్లను మార్చేందుకు డ్రైవ్ సెలక్టర్ అనే బటన్లను హ్యాండిల్ బార్‌లో ఎడమవైపున అందివ్వడం జరిగింది.

బైకుల్లో డిసిటి గేర్ బాక్స్ ఎలా పనిచేస్తుందో, హోండా ఆఫ్రికా ట్విన్ డిసిటి బైకు ఫస్ట్ రైడ్ రివ్యూ ద్వారా తెలుసుకోగలరు....

Read more on: #హోండా #honda
English summary
Read In Telugu: New Honda Gold Wing Revealed In Leaked Images
Story first published: Monday, September 25, 2017, 21:19 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark