సరికొత్త యమహా YZF-R1 విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు

Written By:

యమహా మోటార్ ఇండియా విపణిలోకి సరికొత్త వైజడ్ఎఫ్-ఆర్1 బైకును లాంచ్ చేసింది. అప్‌డేటెడ్ వెర్షన్ యమహా YZF-R1 సూపర్ బైకు ధర రూ. 20.73 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

ఇండియన్ మార్కెట్లోని సూపర్ బైకుల సెగ్మెట్లో తమ స్థానాన్ని పధిలం చేసుకోవడానికి కొత్త తరం వైజడ్ఎఫ్-ఆర్1 బైకును ప్రవేశపెట్టింది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్1

యమహా ఇండియాకు ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలవనున్న YZF-R1 పూర్తిగా మోటోజిపి ప్రేరణతో డెవలప్ చేయబడింది. ఈ నూతన మోటార్ సైకిల్ రెండు విభిన్న రంగుల్లో లభించనుంది. అవి, బ్లూ మరియు టెక్ బ్లాక్. యమహా ప్రస్తుతం అవసరానికి తగ్గట్లు కంప్లీట్‌గా నిర్మించిన YZF-R1 బైకును దిగుమతి చేసుకుని విపణిలో విక్రయించనుంది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్1

సరికొత్త యమహా YZF-R1 బైకులో 998సీసీ కెపాసిటి గల క్రాస్ ప్లేన్ నాలుగు సిలిండర్ల, ఫోర్ వాల్వ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 197.2బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసేందుకు ఇంజన్‌లోని అసమాన ఫైరింగ్ ఆర్డర్‌ను నివారించే పరిజ్ఞానం ఇందులో ఉంది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్1

నిర్ధిష్టమైన మరియు గరిష్ట టార్క్ కోసం తేలికపాటి బరువువున్న 4-2-1 ఎగ్జాస్ట్ సిస్టమ్ కలదు. మరియు చిన్నగా రూపొందించిన మఫ్లర్ వేగంగా ఉద్గారాలను వెదజల్లి అధిక పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేయడంతో ఇంజన్‌కు సహకరిస్తుంది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్1

సరికొత్త YZF-R1 బైకులో క్లచ్ లేకుండా గేర్లు మార్చడం మరియు మృదువుగా గేర్లు మారడం కోసం నూతన క్విక్ షిఫ్ట్ సిస్టమ్ ఇందులో వచ్చింది. అప్‌డేట్ అయిన సూపర్ బైకులో లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్1

యమహా YZF-R1 బైకును అల్యూమినియం డెల్డా-బాక్స్ ఫ్రేమ్ మీద స్వింగ్ ఆర్మ్ మరియు మెగ్నీషియం రియర్ ఫ్రేమ్ ఆధారంగా బైకును నిర్మించింది. బైకు మొత్తం బరువు 199కిలోలు. తక్కువ ఎత్తులో ఉన్న హెడ్ ల్యాంప్ పొజిషన్ మరియు ఎత్తైన విండ్ స్క్రీన్‌తో ఏరోడైనమిక్‌గా డిజైన్ చేశారు.

యమహా వైజడ్ఎఫ్-ఆర్1

యమహా వైజడ్ఎఫ్-ఆర్1 బైకులో అదనపు ఫీచర్లయిన కాంపాక్ట్ ఎల్ఇడి హెడ్ లైట్లు, ఎయిర్ ఇంటేకర్, ట్విన్ ఎల్ఇడి రన్నింగ్ లైట్లతో ఇది చూడటానికి YZF-M1 ను పోలి ఉంటుంది.

యమహా వైజడ్ఎఫ్-ఆర్1

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

YZF-M1లో వినియోగించిన టెక్నాలజీని సరికొత్త సరికొత్త YZF-R1 బైకులో యమహా అందించింది. మోటోజిపి ప్రేరణతో యమహా రేసింగ్ టీమ్ ప్రత్యేకంగా దీనిని అభివృద్ది చేసింది. ఓవరాల్ డిజైన్ అచ్చం మోటోజిపి మోడళ్ల తరహాలోనే ఉంటుంది. అత్యుత్తమ పనితీరును ప్రదర్శించే శక్తివంతమైన ఇంజన్ ఇందులో మరో ప్రత్యేకం.

English summary
Read In Telugu: New Yamaha YZF-R1 Launched In India; Priced At Rs 20.73 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark