పెట్రోల్ స్కూటర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల మార్కెట్లో శరవేగంగా వృద్ది చెందుతున్న ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ విపణిలోకి ప్రైస్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది.

By Anil

ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ల మార్కెట్లో శరవేగంగా వృద్ది చెందుతున్న ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ విపణిలోకి ప్రైస్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. పెట్రోల్ స్కూటర్లకు దీటైన పోటీనిచ్చే ఒకినవ ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 59,889లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్

గత ఏడాది విపణిలోకి రిడ్జ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన ఒకినవ సంస్థ ఇప్పుడు ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెండవ ఉత్పత్తిగా లాంచ్ చేసింది.

ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్

ఒకినవ సంస్థ ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రీమియమ్ మోడల్‌గా ప్రవేశపెట్టింది. రిడ్జ్ స్కూటర్‌‌తో పోల్చుకుంటే అత్యుత్తమ పర్ఫామెన్స్ మరియు అధునాతన ఫీచర్లు దీని సొంతం. ఫ్రంట్ డిజైన్‌లో ఆకర్షణీయమైన హెడ్ ల్యాంప్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు పిలియన్ రైడర్ బ్యాక్ రెస్ట్ వంటివి ఉన్నాయి.

Recommended Video

Yamaha Considering Electric Two-Wheelers For India - DriveSpark
ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్

ఒకినవ పూర్తి స్థాయిలో విడుదల చేసిన ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటరులో 1,000-వ్యాట్ కెపాసిటి గల ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం కలదు. ఇది గరిష్టంగా 3.35బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్

ఒకినవ ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యంత వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.

ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్

ఒక్కసారి ఛార్జింగ్‌తో 175 నుండి 200కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుందని, ఒక్క కిలోమీటరుకు కేవలం 10 పైసలు మాత్రమే ఖర్చవుతుందని ఒకినవ పేర్కొంది.

ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్

ఒకినవ ప్రైస్ స్కూటర్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌కు కావాల్సిన విద్యుత్ లెడ్-యాసిడ్ బ్యాటరీ నుండి అందుతుంది. ఈ బ్యాటరీ ఆరు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

Trending On DriveSpark Telugu:

ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్

అతి త్వరలో లిథియ్-అయాన్ బ్యాటరీతో మరో స్కూటర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. కేవలం రెండు గంటల్లో ఛార్జింగ్ పూర్తి చేసుకునే దాని ధర దీని కంటే రూ. 5,000 నుండి రూ. 6,000 వరకు అదనంగా ఉండే అవకాశం ఉంది.

ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్

ఒకినవ ప్రైస్ ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి. సైడ్ స్టాండ్ సెన్సార్, కీలెస్ ఎంట్రీ, ఫైండ్ మై స్కూటర్ ఫంక్షన్, యాంటి థెఫ్ట్ మెకానిజమ్ ఇంకా ఎన్నో. ఇవే కాకుండా డిజిటల్ ఇంస్ట్రుమెంటల్ క్లస్టర్ మరియు 19.5-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలదు.

ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్

ఒకినవ ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందువైపున రెండు డిస్క్, వెనుక వైపున సింగల్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. రియర్ డిస్క్ బ్రేకు మీద ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్(E-ABS)కలదు.

ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్

సస్పెన్షన్ కోసం ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 12-అంగుళాల వీల్స్ మీద పరుగులు పెడుతుంది.

ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్

ఒకినవ ఇండియా తమ ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద నవంబర్ 2017 నుండి బుకింగ్స్ ఆహ్వానించింది. రూ. 2,000 లతో దీనిని బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న వారికి ఈ నెల చివరి నుండి డెలివరీలను ప్రారంభించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 106 ఒకినవ విక్రయ కేంద్రాలు ఉన్నాయి. 2018 నాటికి మరో 150 షోరూమ్‌లను తెరిచే లక్ష్యంతో ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

More from DriveSpark

Article Published On: Tuesday, December 19, 2017, 18:05 [IST]
English summary
Read In Telugu: Okinawa Praise Electric Scooter Launched In India; Priced At Rs 59,889
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+