ఈ పోలీస్ రోడ్డు ప్రక్కన హెల్మెట్లను ఎందుకు పగలగొడుతున్నాడో తెలుసా...?

Written By:

రోడ్డు ప్రక్కన కుప్పలుగా ఉన్న హెల్మెట్లను పోలీస్ నాశనం చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మన భద్రత కోసం హెల్మెట్ ధరించండని చెప్పే పోలీసులు ఇలా ఎందుకు చేస్తున్నారో చూద్దాం రండి....

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

ప్రతి టూ వీలర్ రైడర్ లైఫ్‌లో అతి ముఖ్యమైనది "హెల్మెట్". టూ వీలర్ ప్రమాదాల్లో మనల్ని 90 శాతం వరకు సురక్షితంగా ఉంచడంలో హెల్మెట్లు ఎంతో కీలకం. అయితే ఎలాంటి హెల్మెట్ ధరించినా సురక్షితంగా ఉంటామా... అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి.

Recommended Video - Watch Now!
[Telugu] Toyota Etios Safety Experiential Drive in Bengaluru - DriveSpark
నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

ఎందుకంటే.... నాణ్యత లేని హెల్మెట్లను ఆరడుగుల ఎత్తు నుండి జారవిడిస్తే పగిలిపోతాయి. అలాంటి హెల్మెట్లు మనల్ని రక్షిస్తాయా....? ట్రాఫిక్ పోలీసులకు ఫైనా కట్టాల్సి వస్తుందని, నాణ్యతలేని తాత్కాలిక శిరస్త్రాణాలను ఎంచుకుంటున్నారు.

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

హెల్మెట్లు తప్పనిసరిగా ధరించండి అని పోలీసులు వెంటపడుతున్నారని ఏదో మొక్కుబడిగా కెమికల్ కోటింగ్‌ గల డిప్పలాంటి హెల్మెట్లను తలకు తగిలించుకుని ఊరేగుతుంటారు. శిరస్త్రాణం ఖచ్చితం అనేది మొక్కుబడి కాదు, పోలీసుల ఫైన్ నుండి తప్పించుకోవడానికి అస్సలు కాదు.... శిరస్త్రాణం మన రక్షణ కోసం.

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

మరి ఎంత వరకు నాణ్యమైన హెల్మెట్లను వాడుతున్నామనేది చూసుకోవాలి. ఖచ్చితంగా ఐఎస్ఐ మార్క్ గల హెల్మెట్లను మాత్రమే ధరించాలి. రోడ్డు ప్రమాదాలను తట్టుకుని, ధరించడానికి సౌకర్యంగా అన్ని భద్రత మరియు నాణ్యత ప్రమాణాలను పాటించిన వాటికే ఐఎస్ఐ సర్టిఫికేట్ లభిస్తుంది.

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

కర్ణాటకలోని మైసూరు నగరంలో రోడ్డు ప్రక్కన ఉన్న నాణ్యతలేని హెల్మెట్లను నగర ఏసిపి దగ్గరుండి ధ్వంసం చేయించాడు. వీటి ధరించడం వలన ఎలాంటి ప్రయోజనం లేదు. ప్లాస్టిక్ కెమికల్ కోటింగ్ ఈ హెల్మెట్లను ధరించడం శుద్ద దండగ అని తెలిపాడు.

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

ట్రాఫిక్ పోలీసుల ఫైన్లకు బయపడి, నాణ్యతలేని శిరస్త్రాణాలను ఎంచుకుంటున్నారు. వీటి ధరించినా... ధరించకపోయినా.. ఒకటే. అందుకే ప్రతి రైడర్ కూడా ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్‌నే ధరించాలి. సాధారణ హెల్మెట్లతో పట్టుబడితే చట్టపరంగా శిక్షార్హులని మైసూర్ సిటీ ఏసిపి మాదయ్య తెలిపారు.

నాన్ ఐఎస్ఐ హెల్మెట్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆచరించడానికి ఎంత ఇబ్బందిగా ఉన్నా... ఖచ్చితంగా పాటించండి. దురదృష్టవశాత్తుగా జరగరానిది ఏదైనా జరిగితే అది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చిన్నాభిన్న చేస్తుంది. పోలీసుల కోసమో.... ఫైన్లను తప్పించుకోవడం కోసమో... నాణ్యతలేని హెల్మెట్లు ఎంచుకోకండి.

బడ్జెట్ ధరలో లభించే ఐఎస్ఐ గుర్తింపు పొందిన మంచి హెల్మెట్‌ను మాత్రమే ఎంచుకోండి.

English summary
Read In Telugu: police seize non ISI mark helmet
Story first published: Saturday, November 4, 2017, 14:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark