బ్యాటిల్ గ్రీన్ కలర్‌లో క్లాసిక్ 500: ఇండియాలో ఈ కలర్ వినియోగం చట్టపరంగా విరుద్దం!

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ తమ మోటార్ సైకిళ్లలో ఏ విధమైన మార్పులు చేసినా అవి చర్చనీయాంశం అవుతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తులకు ఉన్న క్రేజే అంత! గతంలో రెడ్డిచ్ అనే కలర్ ఆప్షన్‌లతో క్లాసిక్ శ్రేణి బైకులను పరిచయం చేసి మంచి విజయం సాధించింది. అదే రీతిలో క్లాసిక్ 500 ను కొత్త మిలిటరీ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో రూపొందించింది.

మిలిటరీ గ్రీన్ కలర్‌ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500

సరికొత్త కలర్ ఆప్షన్‌లో డీలర్ వద్ద గుర్తించిన ఈ మోటార్ సైకిల్ గురించి అనేక ప్రశ్నలు లేవడం జరిగింది. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైకును పరీక్షిస్తోందా...? లేదంటే ఇప్పుడున్న మోడల్‌కు కొత్త కలర్ ఆప్షన్‌ను పరిచయం చేస్తోందా...?

మిలిటరీ గ్రీన్ కలర్‌ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500

ఇలాంటి ప్రశ్నలకు కారణం కూడా ఉందిలేండి? ఇప్పటి వరకు రాయల్ ఎన్పీల్డ్ వెబ్‌సైట్‌లో ఈ కలర్ ఆప్షన్‌ లేదు, మరియు కస్టమైజ్ చేసి దీనికి ఈ మిలిటరీ గ్రీన్ కలర్‌తో పెయింట్ చేశారా అంటే ఛాన్సే లేదని చెప్పాలి. ఎందుకంటే ఇంకా రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు.

మిలిటరీ గ్రీన్ కలర్‌ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500

ఈ మూడు కిలోమీటర్లు తిరిగిన ఈ బ్రాండ్ న్యూ మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ లేకుండా షోరూమ్ ముందు దర్శనమిచ్చింది. కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

మిలిటరీ గ్రీన్ కలర్‌ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500

ఒక వేల రాయల్ ఎన్ఫీల్డే ఈ క్లాసిక్ 500 బైకును బ్యాటిల్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో డీలర్ చెంతకు చేర్చిందనుకుంటే, రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్‌సైట్లో ఇది ఇండియన్ మార్కెట్లో అందుబాటులో లేకపోవడాన్ని స్పష్టంగా గమనించవచ్చు.

మిలిటరీ గ్రీన్ కలర్‌ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500

మరో అవకాశం ఉంది, ఏదైనా కస్టమర్ దీనిని దిగుమతి చేసుకుని ఉండవచ్చు. అయితే ఇలా జరగడం దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. అంతే కాకుండా మిలిటరీ గ్రీన్(బ్యాటిల్ గ్రీన్) వినియోగం ఇండియాలో చట్టపరంగా నిషేధం ఉన్న రంగు.

మిలిటరీ గ్రీన్ కలర్‌ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500

మరి ఏమై ఉండవచ్చు ? ఈ బ్యాటిల్ గ్రీన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ మోటార్ సైకిల్ మిస్టరీ అలాగే ఉండిపోయింది. ఒక వేళ ఈ మోటార్ సైకిల్‌ గురించి మీకేమైనా తెలిస్తే, వాటి వివరాలను ఇక్కడ కామెంట్ రూపంలో మాతో పంచుకోండి...

English summary
Read In Telugu Battle Green Royal Enfield Classic 500 Spotted Outside Bangalore Dealership
Story first published: Friday, June 2, 2017, 10:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark