రెండు కొత్త బైకులను ఆవిష్కరించిన రాయల్ ఎన్ఫీల్డ్: ఫస్ట్ లాంచ్ ఏ దేశంలో తెలుసా...?

EICMA: భారతదేశపు ఇకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతున్న 2017 EICMA మోటార్ సైకిల్ షో వేదిక మీద తమ మోస్ట్ పాపులర్ ఇంటర్‌సెప్టార్ బైకును ఆవిష్కరించి.

By Anil

EICMA 2017 కవరేజ్: భారతదేశపు ఇకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతున్న 2017 EICMA మోటార్ సైకిల్ షో వేదిక మీద తమ మోస్ట్ పాపులర్ ఇంటర్‌సెప్టార్ బైకును ఆవిష్కరించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

EICMA వేదిక మీద ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోటార్ సైకిళ్లను ఒకేసారి ఆవిష్కరించింది. సరికొత్త డిజైన్, నూతన ట్విన్ సిలిండర్ ఇంజన్‌లతో వీటిని అభివృద్ది చేసింది.

Recommended Video

[Telugu] Benelli 300 TNT ABS Now Avaliable In India - DriveSpark
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న టూ వీలర్ల కంపెనీల్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి. గత దశాబ్ద కాలంలో ఏకంగా 16 రెట్లు వృద్దిని సాధించింది. ఇకానిక్ డిజైన్, దీనికి తోడు తమ పూర్వవైభవాన్ని మళ్లీ పునికితెచ్చుకునేందుకు ట్విన్ సిలిండర్ ఇంజన్‌లతో రెండు సరికొత్త మోడళ్లను అభివృద్ది చేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

వివిధ దేశాలు, మార్కెట్లు మరియు ప్రజల అభిరుచికి అనుగుణంగా ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి రెండూ ముఖ్యమైన బైకులే... వీటిలో 650సీసీ కెపాసిటి గల ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ పవర్‌ఫుల్ ఇంజన్ 7,100ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 46.3బిహెచ్‌పి పవర్ మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 52ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ మిలాన్ మోటార్ సైకిల్ షో వేదికగా ఆవిష్కరించిన ఇంటర్‌సెప్టార్ పేరు ఇప్పటిది కాదు. రాయల్ ఎన్ఫీల్డ్ సుమారుగా 1960 ల కాలంలో 700ఇంటర్‌సెప్టార్ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అప్పట్లో ఇది 692సీసీ కెపాసిటి గల ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజన్‌తో లభించేది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

తరువాత రాయల్ ఎన్ఫీల్డ్ సిరీస్ 1 ఇంటర్‌సెప్టార్ బైకును 1962 లో సరికొత్త 763సీసీ కార్బోరేటర్ ఇంజన్‌తో అప్‌డేట్ చేసింది. కొద్ది కాలానికే ఇంటర్‌సెప్టార్ సిరీస్ 1 మోడల్‌ను మార్కెట్ నుండి తొలగించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

ఇంజన్ మొత్తానికి అత్యుత్తమ లుబ్రికేష్ వ్యవస్థను అందించేందుకు వెట్ సంప్ లుబ్రికేషన్ సిస్టమ్‌తో ఇంటర్‌సెప్టార్ సిరీస్ 2 ను పరిచయం చేసింది. దీని తరువాత ఇంజన్ పనితీరును మెరుగుపరిచేందుకు ఇంజన్‌లోని ఎన్నో విడి భాగాలను రీడిజైన్ చేసి మూడవ తరానికి చెందిన ఇంటర్‌సెప్టార్‌ను విడుదల చేయాలని భావించింది. అయితే కంపెనీ కొన్నాళ్లకు పూర్తిగా మూతపడిపోవడంతో ఇంటర్‌సెప్టార్ ప్రొడక్షన్ అంతటితో ఆగిపోయింది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

సుమారుగా 47 తరువాత విడుదలైన ఇంటర్‌సెప్టార్ లో కొత్తదనం మరియు దీని ప్రత్యేకత గురించి వివరాలు...

సరికొత్త ఇంటర్‌సెప్టార్ మూడు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో లభ్యం కానుంది. అవి, లూమినిసెంట్ ఆరేంజ్ క్రష్, గోస్ట్లీ సిల్వర్ స్పెక్టర్ మరియు ఎరుపు, నలుపు రంగుల కలయికలో లభించే డ్యూయల్ టోన్ రవిషింగ్ రెడ్.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 బైకులో ఉన్న ఇంజన్ చూడటానికి పాత కాలం దానిలా ఉన్నప్పటికీ ఇందులో లిక్విడ్ మరియు ఎయిర్ రెండు రకాల కూలింగ్ వ్యవస్థలు ఉన్నాయి. 650 ఇంజన్‌తో వస్తున్న ఇంటర్‌సెప్టార్ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రేమికుల మదిని దోచేయనుంది.

Trending On DriveSpark Telugu:

రూ. 57,827 లకే హోండా గ్రాజియా విడుదల: ఇక మీదట ఆక్టివా ఎంపిక దండగే!!

సుజుకి ఇంట్రూడర్ 150 విడుదలయ్యిందోచ్....!!

భారత రైల్వే గురించి ప్రతి ఇండియన్ తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన నిజాలు...

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మార్కెట్లో ఉన్నది కొనాళ్లే అయినప్పటికీ ఇంగ్లాండ్ మరియు అంతర్జాతీయ విపణిలో ఇంటర్‌సెప్టార్ సృష్టించిన అలజడి అంతా ఇంత కాదు. మొన్నొచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో ఇంటర్‌సెప్టార్ అంటే ఎంతగా ఇష్టపడే వారున్నారో చెబుతోంది. ఎన్నాళ్లకయినా ఇంటర్‌సెప్టార్ పేరు రాయల్ ఎన్ఫీల్జ్‌కే సొంతం. కాబట్టి పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్టకేలకు ఇంటర్‌సెప్టార్ బైకు అభివృద్ది పూర్తి స్థాయిలో ఆవిష్కరించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ 2017 మిలాన్ మోటార్ సైకిల్ షో వేదిక మీద ఇంటర్‌సెప్టార్ 650తో పాటు కాంటినెంటల్ జిటి బైకును కూడా ఆవిష్కరించింది. ఇందులో కూడా అదే శక్తివంతమైన 650సీసీ ట్విన్ ప్యార్లల్ సిలిండర్ ఇంజన్ కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

ఇంటర్‌సెప్టార్ 650 క్రూయిజర్ సెగ్మెంట్‌లో చేరితే కాంటినెంటల్ జిటి 650 మోడల్ కెఫెరేసర్ వర్గంలో చోటు దక్కించుకుంది. కాంటినెంటల్ జిటి 650 చూడటానికి అచ్చం కాంటినెంటల్ 500 బైకును పోలి ఉంటంది. అయితే, ఇందులో ట్విన్ సిలిండర్ ఇంజన్ రావడంతో రెండు ఎగ్జాస్ట్ పైపులు ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి రెగ్యులర్ మోడల్ సంతృప్తి చెందని కస్టమర్లకు కాంటినెంటల్ జిటి 650 అత్యుత్తమ ఎంపిక కానుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటస్ జిటి 650 బైకును యూరోపియన్ రోడ్ల మీద స్పీడ్ టెస్ట్ చేసినపుడు గంటకు 112.6కిలోమీటర్ల వేగాన్ని సునాయసంగా అందుకున్నట్లు నిరూపించకుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

ఇంగ్లాండ్, యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కెఫెరేసర్లను దృష్టిలో ఉంచుకుని రెండు ఎగ్జాస్ట్ గొట్టాలతో, ఆకర్షణీయమైన డిజైన్‌లో, అత్యుత్తమ రైడింగ్ పొజిషన్ కల్పిస్తూ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 బైకును అభివృద్ది చేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి మూడు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అందులో ఒకటి స్ట్రైకింగ్ బ్లూ షేడ్, దీనిని సీ నింప్ అని కూడా పిలుస్తారు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త కెఫెరేసర్ లభించే రెండవ కలర్ ఆప్షన్ బ్లాక్ మ్యాజిక్ పేరుతో పిలువడే ఆమినస్ షేడ్.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 థర్డ్ కలర్ ఆప్షన్ ఫ్రాజెన్ వైట్ పేరుతో పిలువబడే ఐస్ క్వీన్.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 సీటింగ్ కేవలం ఒక్కరి కోసం మాత్రమే. అయితే, ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్‌లో ఇద్దరు ప్రయాణించే సీటు కలదు.

Most Read Articles

English summary
Read In Telugu: Royal enfield continental gt 650 and interceptor 650 details revealed at 2017 EICMA
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X