రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

Written By:

దేశీయ దిగ్గజ క్లాసిక్ బైకు తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తమ అడ్వెంచర్ మోటార్ సైకిల్ హిమాలయన్‌లో భారత్ స్టేజ్ 4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ మరియు కార్బోరేటర్ స్థానంలో ఫ్యూయల్ ఇంజెక్టడ్ సిస్టమ్ అందించి హిమాలయన్ ఎఫ్ఐ మోడల్‌గా విపణిలోకి విడుదల చేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ ఎక్స్-షోరూమ్ ధర వివరాలు

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ ఎక్స్-షోరూమ్ ధర వివరాలు

  • హైదరాబాద్ లో ధర రూ. 1,62,572 లు
  • బెంగళూరులో ధర రూ. 1,63,000 లు
  • చెన్నైలో ధర రూ. 1,63,156 లు
  • ఢిల్లీలో ధర రూ. 1,60,500 లు
  • కలకత్తాలో ధర రూ. 1,65,771 లు
  • ముంబాయ్ లో ధర రూ. 1,70,000 లు
  • త్రివేండ్రంలో ధర రూ. 1,61,341 లు
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ

హిమాలయన్ ఎఫ్ఐ (ఫ్యూయల్ ఇంజెక్టడ్) మోడల్ మీద దేశవ్యాప్తంగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్లు బుకింగ్స్ ఆహ్వానిస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ బైకును రూ. 5,000 ల బుకింగ్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ

సరికొత్త హిమాలయన్ స్పోర్ట్స్ ఎఫ్ఐ లో 411సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 24.5బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ

అడ్వెంచర్ మోటార్ సైకిలోని శక్తివంతమైన ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ

ఫ్యూయల్ ఇంజక్టర్‌ను పరిచయం చేయడాన్ని మినహాయిస్తే, మెకానికల్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

ఫ్యూయల్ ఇంజక్టర్ అంటే ఏమిటి ?

ఫ్యూయల్ ఇంజక్టర్ అంటే ఏమిటి ?

ఇంజన్‌లోకి ఇంధనాన్ని రెండు పద్దతుల్లో పంపిస్తారు.

కార్బోరేటర్: ఇందులో వాతావరణంలోని గాలిని సేకరించి పెట్రోల్‌తో కలిపి, నిర్ణయించిన నిష్పత్తిలో ఈ గాలి మరియు పెట్రోల్ మిశ్రమాన్ని ఇంజన్ లోనికి పంపిస్తారు.

ఫ్యూయల్ ఇంజక్టర్: ఇందులో ముందుగానే గాలితో పెట్రోల్‌ కలపకుండా, కేవలం గాలిని మాత్రమే ఇంజన్‌లోకి పంపించి తరువాత ఇంజక్టర్ ద్వారా ముందుగా నిర్ణయించిన మోతాదులో పెట్రోల్‌ను ఇంజక్ట్ చేస్తారు.

 
English summary
Read In Telugu to know about Royal Enfield Himalayan BS-IV and FI. Get more details about BS-IV compliant and Fuel Injected Royal Enfield Himalayan price, engine, and more

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark