హిమాలయన్ బిఎస్-IV పై రహస్యంగా పనిచేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్

Written By:

హిమాలయన్ మోటార్ సైకిల్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లు అందించి ఇంగ్లాడ్ మార్కెట్లోకి ఈ మధ్యనే విడుదల చేసారు. ప్రస్తుతం దేశీయంగా బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ అప్‌గ్రేడ్ తప్పనిసరైన నేపథ్యంలో ఆ రెండు ఫీచర్లు ఇందులో వచ్చే అవకాశం ఉంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-IV

హిమాలయన్ మోటార్ సైకిల్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ మరియు యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లు అందించి ఇంగ్లాండ్ మార్కెట్లోకి ఈ మధ్యనే విడుదల చేసారు. ప్రస్తుతం దేశీయంగా బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ అప్‌గ్రేడ్ తప్పనిసరైన నేపథ్యంలో ఆ రెండు ఫీచర్లు ఇందులో వచ్చే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-IV

అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, నివేదికలందిస్తున్న తాజా సమాచారం మేరకు, ఇంగ్లాండ్ స్పెక్ వేరియంట్లోని ఫీచర్లతో పాటు, అప్‌గ్రేడ్స్ నిర్వహించిన ఇంజన్ మరియు అప్‌డేటెడ్ క్లచ్ అసెంబ్లీ ఇందులో రానున్నట్లు తెలిసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-IV

రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయ కేంద్రాలలో అనధికారికంగా బిఎస్-IV హిమాలయన్ వేరియంట్‌కు చెందిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రాయల్ ఎన్పీల్డ్ బిఎస్-III మోడళ్లను విపణి నుండి శాశ్వతంగా నిలిపివేసి ఏప్రిల్‌లో అధికారికంగా బిఎస్-IV హిమాలయన్ వేరియంట్‌ను విడుదల చేయనున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-IV

గత ఏడాది రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేయనున్న ఈ మోడల్ అడ్వెంచర్ రైడర్లలో మంచి ఉత్సాహాన్ని నింపింది. అయితే విడుదలకు ముందు మరియు విడుదల అనంతరం అనేక సవాళ్లను ఎదుర్కొంది. అందులో ప్రధానంగా మెకానికల్‌కు సంభందించినవి. అయితే సందర్భానుసారంగా అన్నింటి ఫిక్స్ చేయడం జరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-IV

విడుదల సమయం నుండి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మంచి అమ్మకాలు నమోదు చేసుకుంటూ వచ్చింది. రైడింగ్ ఊహించినంత స్మూత్‌గా ఉండదు, అయినప్పటికీ పోటీ ఎరుగని కారణంగా మంచి విక్రయాలనే నమోదు చేసుకుంది. ఇప్పుడు ఇంజన్ అప్‌గ్రేడ్స్ ఉండటం వలన అమ్మకాల్లో వృద్ది సాధ్యమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-IV

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లో బిఎస్‌-IV ఉద్గార నియమాలను పాటించే 411సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-IV

. ఇది గరిష్టంగా 24.5బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-IV

ఈ ఏడాది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కొనే ఆలోచనలో ఉన్నారా...? అయితే ఖచ్చితంగా బిఎస్-IV అప్‌గ్రేడ్స్‌తో విడుదల కానున్న వేరియంట్‌ను ఎంచుకోవడం ఉత్తమం అని బలంగా సూచిస్తున్నాము.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్-IV

2017 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బిఎస్‌-IV వేరియంట్ 2017 కెటిఎమ్ డ్యూక్ 390 కు పోటీనివ్వనుంది. కెటిఎమ్ డ్యూక్ 390 బైకును చూడాలనుకుంటే క్రింది గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి...

 
English summary
Royal Enfield Himalayan BS-IV Variant Launch Details Revealed — The Right Time To Wait
Story first published: Tuesday, March 7, 2017, 11:40 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark