రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ విడుదల: ధర రూ. 1.66 లక్షలు

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ విపణిలోకి హిమాలయన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను ఫ్యూయల్ ఇంజెక్షన్ మరియు బిఎస్-4 అప్‌గ్రేడెడ్ ఇంజన్‌తో విడుదల చేసింది. హిమాలయన్ ఎఫ్ఐ ఇంజన్, ధర, ఫీచర్లు మరియు ఇతర వివరాలు నేటి కథనంలో....

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ విడుదల

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ విడుదల గురించి అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, దేశవ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్లు హిమాలయన్ ఎఫ్ఐ మీద బుకింగ్స్ మరియు డెలివరీలు ప్రారంభించారు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ విడుదల

రిపోర్ట్స్ ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.66 లక్షలు మరియు దీని ఆన్ రోడ్ ధర రూ. 2 లక్షల వరకు ఉన్నట్లు తెలిసింది. రూ. 5,000 ల ధరతో హిమాలయన్ ఎఫ్ఐ ను బుక్ చేసుకోగలరు, అయితే డెలవరీలకు సుమారుగా రెండు నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ చెబుతున్నారు.

Recommended Video - Watch Now!
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ విడుదల

హిమాలయన్ ఎఫ్ఐ మోటార్ సైకిళ్లను కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేసి, డీలర్ల వద్దకు చేరుస్తున్నట్లు తెలిసింది. ప్రొడక్షన్ పెంచడానికి ముందే, ఈ బైకుల గురించి కస్టమర్ల స్పందన మరియు అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇలా మితంగా ఉత్పత్తి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ విడుదల

సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎఫ్ఐ బైకులో 411సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 6,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 24.5బిహెచ్‌పి పవర్ మరియు 4,250ఆర్‌పిఎమ్ వద్ద 32ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ విడుదల

5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న హిమాలయన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లో ముందువైపున 41ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉండగా వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ ఉంది. బ్రేకింగ్ వ్యవస్థ కోసం ముందువైపున 300ఎమ్ఎమ్ డిస్క్ మరియు వెనుక వైపున 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ విడుదల

రాయల్ ఎన్ఫీల్డ్ తమ తొలి అడ్వెంచర్ బైకు హిమాలయన్‌ను గత ఏడాది మార్చిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఏప్రిల్ 2017 నుండి బిఎస్-4 ఇంజన్ గల టూ వీలర్లను మాత్రమే విక్రయించాలనే నియమం రావడం మరియు కస్టమర్ల నుండి తయరీ లోపాల గురించి అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో విపణి నుండి తొలగించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫ్యూయల్ ఇంజెక్షన్ విడుదల

భారతదేశపు ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి హిమాలయన్ విడుదలతో ప్రవేశించిన రాయల్ ఎన్ఫీల్డ్‌కు ఈ బైకు పరంగా తీవ్ర వ్యతిరేకత లభించింది. అయితే ఈ సారైనా అడ్వెంచర్ ప్రేమికులను ఆకట్టుకుంటుందో... లేదో... చూడాలి మరి.

English summary
Read In Telugu: Royal Enfield Himalayan FI Launched India Price Details
Story first published: Saturday, September 9, 2017, 12:26 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark