తయారీదారులకు దడ పుట్టిస్తున్న మోడిఫికేషన్స్

తాము వాడే వెహికల్స్‌ అందరిలో భిన్నంగా ఉండేందుకు, తమ వెహికల్స్‌కు భారీ మోడిఫికేషన్స్ నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి ఓ ఔత్సాహికుడు హిమాలయన్‌ను బైకును ఎలా మార్చేశాడో చూడండి.

ఇతరుల వద్ద ఉన్న వాటితో పోల్చితే భిన్నంగా ఉండేందుకు తమ వాహనాలకు మోడిఫికేషన్స్ నిర్వహిస్తుంటారు. ఇలాంటి మోడిఫికేషన్స్ ఒక్కోసారి ఎలా ఉంటాయంటే... కొన్ని సార్లు తయారీ సంస్థలు కూడా ఆశ్చర్యపోతాయి. అచ్చం అలాంటి మోడిఫికేషన్ ఇవాళ్టి కథనంలో మీ కోసం....

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడిఫికేషన్

ఈ బైకును క్షుణ్ణంగా పరిశీలిస్తే... అసలు ఇది ఏ కంపెనీకి చెందిందో కనుక్కోవడం కాస్త కష్టమే. ఇది రాయల్ ఎన్ఫీల్డ్‌కు చెందిన హిమాలయన్ అడ్వెంచర్ బైకు. దీనిని ముంబాయ్ ఆధారిత ట్రాన్స్‌ఫిగర్ కస్టమ్ హౌస్ అనే గ్యారేజ్ ఇలా మోడిఫై చేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడిఫికేషన్

తయారీదారులు ఇచ్చిన రూపాన్ని పూర్తిగా మార్చేసి ఒక కొత్త ఆకృతిలోకి తెచ్చిన ఈ మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్‌కు ప్రాజెక్ట్ మ్యాడ్‌మ్యాక్స్ అనే పేరును కూడా పెట్టారు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడిఫికేషన్

దీనిని మోడిఫికేషన్‌లో నైపుణ్య గల అనుభవజ్ఞులు చాలా చక్కగా మోడిఫై చేశారు. మరియు ఇందులో అత్యంత నాణ్యమైన విడి పరికరాలను వినియోగించడం జరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడిఫికేషన్

మన కంటికి కనిపించే బైకు శరీర భాగాలకు జరిగిన మోడిఫికేషన్స్ గమనిస్తే, ఇందులో నూతన ఎల్ఇడి హెడ్ ల్యాంప్, రీ డిజైన్ చేయబడిన ఇంధన ట్యాంకు, మ్యాట్ బ్లాక్ ఫినిష్ గల విండ్ స్క్రీన్, మరియు అత్యంత ఎత్తులో ఏర్పాటు చేసిన మడ్ గార్డు ఇందులో గుర్తించవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడిఫికేషన్

పెయింట్ విషయానికి వస్తే, శరీరం మొత్తానికి షీట్ మెటల్ మరియు నార్డో గ్రే పెయింట్ జాబ్ అందివ్వడం జరిగింది. దీనికి తోడుగా కస్టమైజ్ చేయబడిన సింగల్ పీస్ సీటును అమర్చారు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడిఫికేషన్

ఆడి ఆర్ఎస్6 షేడ్ ప్రేరేపిత నార్డో గ్రే పెయింట్ జాబ్ ఈ మోడిఫైడ్ హిమాలయన్ మ్యాడ్‌మ్యాక్స్‌కు అందివ్వడం జరిగింది. దీనికి తోడు ఎరుపు రంగు క్రోమ్ వీల్స్ మరియు ఫ్రంట్ ఫోర్క్ చక్కగా ఆకర్షణగా నిలిచాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడిఫికేషన్

మోడిఫైడ్ హిమాలయన్ మ్యాడ్‌మ్యాక్స్ బైకులో ముందు వైపున హస్కవర్నా 450 టిఇ డర్ట్ బైకు నుండి సేకరించిన స్టర్డీ ఫ్రంట్ ఫోర్క్స్ అందివ్వడం జరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడిఫికేషన్

హిమాలయన్‌కు ఉన్న కంపెనీ అసలైన టైర్లు, చక్రాలు తొలగించి ప్రత్యేకంగా తయారు చేయించిన ఫోక్స్ గల 17-అంగుళాల రిమ్ములను మోడిఫైడ్ బైకులో వినియోగించారు. వీటికి ముందు వైపున 120/60 మరియు వెనుక వైపున 160/60 టైర్లను అందించారు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడిఫికేషన్

ముంబాయ్ ఆధారిత ట్రాన్స్‌ఫిగర్ హౌస్ సంస్థ ఓ నెల పాటు 1.5 లక్షల రుపాయలు వెచ్చించి మోడిఫైడ్ రాయల్ హిమాలయన్‌ను రూపొందించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడిఫికేషన్

సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ అందించిన 411సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ ఇంజన్‌ యథావిధిగా ఇందులో కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోడిఫికేషన్

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఈ ఇంజన్ గరిష్టంగా 24.5బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

Most Read Articles

English summary
Read In Telugu Royal Enfield Himalayan Modified
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X