తన హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్

తాను కొనుగోలు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకులో అనేక తయారీ లోపాలున్నాయని ఓ కస్టమర్ వినియోగదారుడి కోర్టను ఆశ్రయించాడు.

By Anil

తమకు నచ్చిన వస్తువు మీద అసంతృప్తి కలిగితే సాధారణంగా ఏం చేస్తాం.... అందులో ఉన్న లోపాలను వెతికి, కావాలని దూరం చేసుకుంటాం. అచ్చం ఇలాగే ఓ రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్‌కు హిమాలయన్ అనే అమితమైన ఇష్టం. అయితే దాని పనితీరు పరంగా సంతృప్తి చెందని అతను ఆ బైకులో సుమారుగా 40 తయారీ లోపాలను కనుగొన్నాడు. దీనికి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలాంటి సమాధానమిచ్చిందో తెలుసా...?

హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్

విడుదలకు ముందే భారీ అభిమానులను పోగుచేసుకున్న హిమాలయన్ 2016 ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శనకు వచ్చింది. అదే వేదిక మీద విడుదలయ్యింది కూడా.

హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్

ఎమ్ పునీత్ కుమార్ అనే వ్యక్తి వృత్తి పరంగా ఇంజనీర్. కర్ణాటకలోని కోలార్‌కు చెందిన పునీత్ జూన్ 1,2016 న తాను ఎంతగానో ఇష్టపడే హిమాలయన్ బైకును కొనుగోలు చేశాడు.

హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్

కొన్ని రోజుల తర్వాత తన హిమాలయన్ బైకు పనితీరులో అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. వాటిని నివృత్తి చేసుకునేందుకు సమీపంలోని మెకానిక్ వద్దకు వెళ్లి పూర్తి స్థాయిలో చెక్ చేయించగా తన అనుమానాలన్నీ నిజమయ్యాయి.

హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్

ఫ్యూయల్ ట్యాంక్ మరియు కార్బోరేటర్ వద్ద పెట్రోల్ లీక్ కావడం, సాధారణంగా కంటే ఎక్కువ శబ్దం రావడం, ఐడిల్‌గా ఉంచినపుడు మరింత సౌండ్ రావడం, ఇంజన్ హెడ్ నుండి ఆయిల్ లీక్ అవ్వడం మరియు గేర్లను మార్చేటపుడు సమస్యలు తలెత్తడం వంటివి నిజమే అని ఓ నిర్ధారణకు వచ్చాడు.

హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్

న్యూస్9తో పునీత్ మాట్లాడుతూ, తాను హిమాలయన్ బైకును నడుపుతున్నపుడు ఇప్పుడు చెప్పినవే కాకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కున్నట్లు తెలిపాడు. పేరుకు మాత్రమే అడ్వెంచర్ మోటార్ సైకిల్, కానీ ఈ పేరును నిలుపుకోవడంలో ఇది ఫెయిల్ అయ్యిందని తెలిపాడు.

హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్

ఈ హిమాలయన్ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్న పునీత్ తన బైకులో ఉన్న లోపాలన్నింటిని వివరిస్తూ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ ఆన్ లైన్ లేఖ వ్రాసినట్లు అయితే వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పుకొచ్చాడు.

హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్

తయారీదారుల నుండి ఎలాంటి సమాధానం రాలేదని తన బైకులోని సమస్యలను వివరిస్తూ, ఈ బైకుతో వినియోగదారుల కోర్టును సంప్రదించాడు పునీత్.

హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్

న్యూస్9 విచారణ బృందానికి రాయల్ ఎన్ఫీల్డ్ సమాధానం ఇస్తూ, కోర్టు కేసు మరియు దాని పరిష్కారం కోసం తమ లీగల్ అడ్వైసర్‌ను సంప్రదిస్తున్నట్లు పేర్కొంది.

హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్

ప్రస్తుతం పునీత్ అనే కస్టమర్ ఎదుర్కున్న ఇలాంటి సమస్యలనే అనేక ఇతర రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కస్టమర్లు రాయల్ ఎన్ఫీల్డ్‌కు నివేదించారు. అయితే దీనిని సీరియస్‌గా తీసుకుని ఇందులో తలెత్తే లోపాలను సవరిస్తే మంచిది.

హిమాలయన్ బైకులో 40 తయారీ లోపాలను కనుగొన్న కస్టమర్

కోర్టుల చుట్టూ తిరిగి... సమస్యను పెద్దది చేసుకోవడం కన్నా కస్టమర్ల కోరిన మేరకు సర్వీస్ చేయిస్తే బాగుంటుంది. తద్వారా హిమాలయన్ అడ్వెంచర్ బ్రాండ్ పేరు పడిపోకుండా ఉంటుంది.

Most Read Articles

English summary
Read In Telugu To Know About Owner Finds 40 Manufacturing Defects In His Himalayan — Drags RE To Court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X