రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బుకింగ్ వివరాలు
ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి బైకుల బుకింగ్స్ సంభందించిన వివరాలు రివీల్ అయ్యాయి. ఏప్రిల్ 2018 నుండి ఈ రెండు మోటార్ సైకిళ్ల మీద బుకింగ్స్ ప్రారంభమవుతాయని తెలిసింది.
రాయల్ ఎన్ఫీల్డ్ 650సీసీ కెపాసిటి ఇంజన్‌ను ఆవిష్కరించి ఔత్సాహికులకు ఆశ్చర్యపరిచింది. విపణిలో ఉన్న 750సీసీ ఇంజన్‌లను టార్గెట్ చేస్తూ ప్రవేశపెట్టిన ఇంజన్‌తో ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోటార్ సైకిళ్లను ఆవిష్కరించి 2017 ఐక్మా మోటార్ సైకిల్ షో వేదిక మీద అభిమానుల మతిపోగొట్టింది.

ఇప్పుడు, ఓ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ప్రచురించిన కథనం మేరకు, ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి బైకుల బుకింగ్స్ సంభందించిన వివరాలు రివీల్ అయ్యాయి. ఏప్రిల్ 2018 నుండి ఈ రెండు మోటార్ సైకిళ్ల మీద బుకింగ్స్ ప్రారంభమవుతాయని తెలిసింది. అయితే, దీని గురించి రాయల్ ఎన్ఫీల్డ్ నుండి ఎలాంటి సమాచారం లేదు.
Recommended Video


ఇటలీలో జరిగిన మోటార్ సైకిల్ షో వేదిక మీద ఆవిష్కరించిన ఈ రెండు మోటార్ సైకిళ్లను రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ చేయనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రెట్రో డిజైన్‌తో రోడ్‌స్టర్(ఇంటర్‌సెప్టార్ 650) మరియు కెఫె రేసర్ (కాంటినెంటల్ జిటి)లను రూపొందించింది.

రెండు బైకుల్లో 650సీసీ కెపాసిటి గల ట్విన్ ప్యార్లల్ ఇంజన్ కలదు. ఇది 7,100ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 46.3బిహెచ్‌పి పవర్ మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 52ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఈ బైకుల గరిష్ట వేగం గంటకు 160కిలోమీటర్లుగా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఆవిష్కరించిన కవలలో సాంకేతికంగా అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందించింది. స్లిప్పర్ క్లచ్, ముందు మరియు వెనుక వైపున డిస్క్ బ్రేకులు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరిగా అందించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ 1960ల కాలంలో పరిచయం చేసిన ఇంటర్‌సెప్టార్ 700 మోడల్ పేరు ఆధారంగా ఇంటర్‌సెప్టాక్ 650 మోటార్ సైకిల్‌కు ఆ పేరును తీసుకొచ్చింది. అప్పట్లో ఈ ఇంటర్‌సెప్టార్ 700 బైకు 692సీసీ కెపాసిటి గల ట్విన్ ప్యార్లల్ ఇంజన్‌తో లభించేది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ధర ఎక్కువైనా పర్వాలేదు, ఖచ్చితంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులే కావాలనుకునే ఔత్సాహికులకు ఈ రెండు మోటార్ సైకిళ్లు ప్రత్యేక ఎంపిక కానున్నాయి. ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650ల కోసం ఎదురు చూస్తున్న కస్టమర్లు ఏప్రిల్ 2018లో తమకు నచ్చిన వేరియంట్ బుక్ చేసుకునే అవకాశాన్ని రాయల్ ఎన్ఫీల్డ్ కల్పించనుంది.
మరిన్ని తాజా ఆటోమొబైల్ న్యూస్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు చూస్తూ ఉండండి... డ్రైవ్‌స్పార్క్ తెలుగు పట్ల మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి.
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








