650 ఇంజన్‌తో రెండు బైకులను ఆవిష్కరించిన రాయల్ ఎన్ఫీల్డ్

Written By:

రెట్రో స్టైల్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థగా పేరుగాంచిన రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయంగా రెండు కొత్త బైకులను ఆవిష్కరించింది. 650సీసీ ఇంజన్ కెపాసిటి గల ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకులను తొలిసారిగా ప్రదర్శించింది.

ఇటీవల జరిగిన 2017 రైడర్ మానియా ఈవెంట్‌ బైక్ ఫెస్టివల్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ తమ రెండు కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650

రైడర్ మేనియా ఫెస్టివల్‌లో ఆవిష్కరించిన రెండు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు క్రోమ్ కలర్ స్కీమ్‌తో వచ్చాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రేమికులను ఆకట్టుకునేలా అదే ఓల్డ్ స్టైల్ క్లాసిక్ డిజైన్‌ శైలిని సొంతం చేసుకున్నాయి.

Recommended Video - Watch Now!
[Telugu] 2017 Triumph Tiger Explorer XCx Launched In India - DriveSpark
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650

రైడర్ మేనియా కార్యక్రమంలో రాయల్ ఎన్ఫీల్డ్ సిఇఒ సిద్ లాల్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్గార నియమాలను మరియు నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా కొత్త మోడళ్లను ఆవిష్కరించినట్లు చెప్పుకొచ్చాడు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650

క్కువ ధరకే యాక్ససరీలను మరియు సరసమైన ధరతో నూతన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను సొంతం చేసుకోవచ్చని తెలిపాడు. మిడ్ సైజ్ క్లాసిక్ బైకులను తక్కువ ధరకే అందించే కంపెనీ లక్ష్యంతో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపాడు.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650

ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 రెండు బైకుల్లో 650సీసీ కెపాసిటి గల ప్యార్లల్ ట్విన్ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఈ ఇంజన్ 46.3బిహెచ్‌పి పవర్ మరియు 52ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్

ఈ రెండు బైకుల విడుదల విషయానికి వస్తే, తొలుత యూరోపియన్ మార్కెట్లో లాంచ్ చేసి, తరువాత ఇండియన్ మార్కెట్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభివృద్ది చెందుతున్న దేశాలలో వీటిని విడుదల చేయనుంది.

రాయల్ ఎన్ఫీల్డ్

వ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్లాసిక్ స్టైల్ పవర్ ఫుల్ బైకులను అభివృద్ది చేసిందని చెప్పవచ్చు. ధరకు తగ్గ విలువలు, నమ్మదిగిన నాణ్యత మరియు దేశవ్యాప్తంగా సర్వీస్ మరియు స్పేర్స్ లభ్యత వంటి ఎన్నో అంశాలు ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకుల సక్సెస్ గ్యారంటీ అని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Royal Enfield 650 Twins Showcased In India
Story first published: Monday, November 20, 2017, 17:59 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark