అమెరికా విపణిలోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకులు

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తమ తొలి అడ్వెంచర్ మోటార్ సైకిల్ హిమాలయన్‌ బైకును అమెరికా మార్కెట్లో విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. హిమాలయన్‌ను అమెరికా విపణిలో ప్రవేశపెట్టడానికి కావాల్సిన అనుమతులను ఒక్కొక్కటిగా పొందుతోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

రాయల్ ఎన్ఫీల్డ్ అధికారిక ప్రతినిధి బృందం నుండి ఒకరు మాట్లాడుతూ, ఈ మధ్యనే రెండు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకులను అమెరికాకు పంపినట్లు తెలిపాడు. అక్కడ హిమాలయన్ బైకును రైడ్ చేసిన వారి నుండి సానుకూల స్పందన లభించడంతో వీటిని అమెరికాలో ప్రవేశపెట్టడానికి సిద్దమవుతున్నట్లు వెల్లడించాడు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

ప్రస్తుతం అమెరికన్ మోటార్ సైకిల్ మార్కెట్లో, బాగా అభివృద్ది చెందుతున్న మరియు అధిక డిమాండ్ ఉన్న కెటగిరీ అడ్వెంచర్ మోటార్ సైకిల్ కెటగిరీ. అక్కడి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ రైడింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్న హిమాలయన్‌ను యుఎస్‌లో లాంచ్ చేయడానికి మార్గం సుగమం చేసుకుంటోంది.

Recommended Video
Benelli 300 TNT ABS Now Avaliable In India | In Telugu - DriveSpark తెలుగు
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

దక్షిణ అమెరికాలో రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తులకు పోటీ అధికంగా ఉన్నందున ఆశించిన విక్రయాలు సాధించడం లేదు. కాబట్టి విక్రయాలను పెంచుకునేందుకు 60 డీలర్ల ద్వారా, మరికొన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైకులో 411సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తున్న ఇది గరిష్టంగా 24.5బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

అమెరికన్ మార్కెట్లో కఠినమైన నిభందనలు ఉన్న నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ తమ హిమాలయన్ బైకులో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్(ABS)ను తప్పనిసరిగా అందించే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అమెరికా విపణిలో విక్రయాలు పెంచుకునేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. అందుకోసం, హిమలయన్‌ను ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. దీని తరువాత ట్విన్ సిలిండర్ గల మిడిల్ వెయిట్ మోటార్ సైకిల్‌ను అభివృద్ది చేస్తోంది.

English summary
Read In Telugu: Royal Enfield To Introduce Himalayan In The US Market
Story first published: Tuesday, September 19, 2017, 11:17 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark