జిఎస్‌టి అనంతరం రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల ధరలు

Written By:

కేంద్ర ప్రభుత్వం వస్తు మరియు సేవా పన్ను (GST)విధానాన్ని నేడు అమల్లోకి తెచ్చింది. జిఎస్‌టిలోని టూ వీలర్ల స్లాబుల్లో పేర్కొన్న ట్యాక్స్ ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు పెరిగాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లపై మునుపు అమలయ్యే ట్యాక్స్ కన్నా జిఎస్‌టి మేరకు అమలయ్యే పన్ను ఎక్కువగా ఉంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
జిఎస్‌టి తరువాత రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు

350సీసీ కన్నా తక్కువ ఇంజన్ కెపాసిటి ఉన్న టూ వీలర్ల మీద 28 శాతం మరియు 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్ల మీద 28 శాతంతో పాటు అదనంగా 3 శాతం సెస్ కలుపుకుని మొత్తం 31 శాతం ట్యాక్స్ అమలుకానుంది.

జిఎస్‌టి తరువాత రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు

గతంలో అన్ని ద్విచక్ర వాహనాలపై ట్యాక్స్ 30 శాతం ఉండేది. కాబట్టి చిన్న బైకులు మరియు స్కూటర్ల మీద ధరలు తగ్గుతాయి. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ విషయానికి వస్తే దాదాపు అన్ని 350సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగి ఉన్నాయి.

జిఎస్‌టి తరువాత రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ లోని హిమాలయన్, క్లాసిక్ 500, బుల్లెట్ 500, థండర్‌బర్డ్500 మరియు కాంటినెంటల్ జిటి వంటి మోటార్ సైకిళ్ల మీద ధరలు పెరగనున్నాయి.

జిఎస్‌టి తరువాత రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు

రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ల తెలిపిన వివరాల మేరకు జిఎస్‍‌టి అమలయ్యాక. 7,000 నుండి 10,000 వరకు వివిధ మోడళ్ల మీద ధరలు పెరిగినట్లు తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో కొత్త ధరలను వెల్లడించడానికి డీలర్లు నిరాకరిస్తునాయి. రాయల్ తమ ఉత్పత్తుల ధరలను సవరించి అతి త్వరలో వెల్లడించనుంది.

English summary
Royal Enfield Prices Post GST
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark