రాయల్ ఎన్ఫీల్డ్‌కు ప్రాణం పోసిన కస్టమైజేషన్
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్‌ను ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న స్క్రాంబ్లర్ స్టైల్లో పేరుగాంచిన బుల్లెట్టీర్ కస్టమైజేషన్ సంస్థ మోడిఫై చేసింది.
టూ వీలర్లను ఎంచుకోవడంలో యువత నూతన ఒరవడిని ప్రదర్శిస్తోంది మరియు మార్కెట్లో లభించే మోటార్ సైకిళ్లను యధావిథిగా వాడుకునే కాలం దాదాపు మారిపోయింది. ఈ రెండింటికి పరిష్కారమే కస్టమైజేషన్. తమ వద్ద ఉన్న మోటార్ సైకిల్ ఇతరుల వద్ద ఉండకూడదు మరియు తాము ఎంచుకునే మోడల్ అత్యంత విభిన్నంగా ఉండాలని కోరుకుంటారు.

ఇలాంటి ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కస్టమైజేషన్ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం లభించే మోటార్ సైకిళ్లను కస్టమర్ కోరుకునే స్టైల్లో రూపొందించడమే కస్టమైజేషన్ సంస్థలు టార్గెట్.
Recommended Video


కానీ, ఒక్కసారి వారి కస్టమైజేషన్ క్లిక్ అయ్యిందంటే, వాటికి పోగయ్యే ఔత్సాహికుల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇందుకు చిన్న ఉదాహరణ ఇవాళ్టి కథనంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్ సైకిల్‌ను ప్రస్తుతం ట్రెండింగ్‌గా ఉన్న స్క్రాంబ్లర్ స్టైల్లో పేరుగాంచిన బుల్లెట్టీర్ కస్టమైజేషన్ సంస్థ మోడిఫై చేసింది. సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. అయితే, అన్ని రకాల భూబాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచే విధంగా ఆఫ్ రోడింగ్ సామర్థ్యంతో అభివృద్ది చేసింది.

మోడిఫైడ్ క్లాసిక్ 350 ఫ్యూయల్ ట్యాంక్, ఫ్రంట్ హెడ్ ల్యాంప్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్పెన్షన్ సిస్టమ్, ఎగ్జాస్ట్ పైప్ మరియు సీటు ఇలా బైకులో అతి ప్రధానమైన అన్ని పరికరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల ఇంజన్, మెషీన్ కట్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేకాకర్షణగా ఉన్నాయి. ప్రాథమిక స్క్రాంబ్లర్ స్టైల్ మోటార్ సైకిల్‌కు ఈ మాత్రం తీసిపోన క్లాసిక్ 350 మోడల్‌కు అనతి కాలంలోనే భారీ అభిమానులు పోగయ్యారు. దీనిని బెంగళూరు ఆధారిత మోటార్ సైకిల్ మోడిఫికేషన్ సంస్థ బుల్లెట్టీర్ రూపొందించింది.


Click it and Unblock the Notifications








