రాయల్ ఎన్ఫీల్డ్ నుండి అనూహ్యమైన 750సీసీ ట్విన్ సిలిండర్ బైకు!!

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్ల తయారీ మీద దృష్టిసారించిందని చెప్పడానికి ఓ ఆధారం దొరికింది. అదే ఈ రెండు సిలిండర్లు గల 750సీసీ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిల్‌ను దేశీయ రహదారులు మీద పరీక్షిస్తూ మీడియాకు దొరికింది, రాయల్ ఎన్ఫీల్డ్ 750సీసీ ట్విన్ సిలిండర్ బైకు గురించి మరింత సమాచారం.

రెండు సిలిండర్లు, 750సీసీతో రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి బైకు

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క రెండు సిలిండర్ల 750సీసీ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిల్‌ను దేశీయ రహదారుల మీద పరీక్షిస్తున్నపుడు ఫోటోలను తీయడం జరిగింది. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉండటం ద్వారా డిజైన్ అంశాలను పరిశీలించలేకపోడం జరిగింది.

రెండు సిలిండర్లు, 750సీసీతో రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి బైకు

ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో ఉన్న కాంటినెన్షియల్ జిటి మోడల్‌ తరహాలోనే ఈ 750సీసీ బైకు డిజైన్ ఉంది. గతంలో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఈ మోటార్ సైకిల్‌ను స్పెయిన్‌లో పరీక్షించింది.

రెండు సిలిండర్లు, 750సీసీతో రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి బైకు

750సీసీ ట్విన్ సిలిండర్ గల బైకును అచ్చం కాంటినెన్షియల్ జిటి తరహాలోనే అభివృద్ది చేసినప్పటికీ, ఎక్ట్సీరియర్‌లోని కొన్ని ప్రధానమైన భాగాలలో మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన ఛాసిస్‍‌ను దీని కోసమే డెవలప్‌చేయడం జరిగింది.

రెండు సిలిండర్లు, 750సీసీతో రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి బైకు

రాయల్ ఎన్ఫీల్డ్ 750సీసీ ఇంజన్‌ను అభివృద్ది చేసినప్పటికీ, దీనికి ఓ రూపాన్ని ఇచ్చే శరీరాన్ని డెవలప్ చేయలేదు. ప్రస్తుతం పరీక్షించడానికి కాంటినెన్షియల్ జిటి బాడీని వినియోగిస్తోంది. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా దీనికి సంభందించిన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

రెండు సిలిండర్లు, 750సీసీతో రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి బైకు

ఇండియాలో రహస్య పరీక్షలకు గురిచేసిన బైకులో వెనుక వైపున కేఫ్ రేసర్ తరహాలో రెండు ఎగ్జాస్ట్ గొట్టాలు ఉన్నాయి. స్పెయిన్‌లో పరీక్షించిన దానిలో ఉన్న క్రోమ్ ఎగ్జాస్ట్ తరహా కాకుండా మట్టీ బ్లాక్ ఎగ్జాస్ట్ గొట్టాలు ఉన్నాయి.

రెండు సిలిండర్లు, 750సీసీతో రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి బైకు

సాధారణ కాంటినెన్షియల్ జిటితో ప్రస్తుతం పరీక్షించిన 750సీసీ మోడల్‌‌ను పోల్చుకుంటే, ఇందులో వెనుక వైపున నూతన సస్పెన్షన్ సిస్టమ్, రివైజ్ చేయబడిన టర్న్ ఇండికేటర్స్, వెనుక వైపున్న చైన్ మరియు స్ప్రాకెట్ అరేంజ్ సిస్టమ్ వంటి వాటిని గుర్తించవచ్చు.

రెండు సిలిండర్లు, 750సీసీతో రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి బైకు

కొన్ని ఆటోమొబైల్ సైట్లు తెలిపిన వివరాలు మేరకు, ఈ 750సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 50బిహెచ్‍‌పి పవర్ మరియు 60ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని తెలిపాయి.

రెండు సిలిండర్లు, 750సీసీతో రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి బైకు

రాయల్ ఎన్ఫీల్డ్ తమ శక్తివంతమైన 750సీసీ సామర్థ్యంతో రెండు సిలిండర్లు గల మోటార్ సైకిల్‌ను ఈ ఏడాదిలోపే మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. తాజా ఆటోమొహబైల్ కథనాల కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్.

English summary
Also Read In Telugu: Spy Pics - Royal Enfield Twin-Cylinder Motorcycle Spotted Testing For The First Time In India

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark