లాజిస్టిక్ కంపెనీని నమ్మి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను పార్శిల్ చేస్తే, చివరికి ఇలా మిగిలాయి!

లాజిస్టిక్ కంపెనీ ద్వారా మనాలికి పార్శిల్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి.

By Anil

లాజిస్టిక్ కంపెనీ ద్వారా మనాలికి పార్శిల్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. కస్టమర్లు GATI-KWE అనే కంపెనీ ద్వారా కేరళ నుండి మనాలికి తమ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ట్రాన్స్‌పోర్ట్ చేశారు. అయితే మనాలి చేరుకున్న కస్టమర్లు తమ బైకులను చూసి భారీ షాక్‌కు గురయ్యారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను పార్శిల్ ఓనర్లకు ఊహించని షాక్

దేశవ్యాప్తంగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మోటార్ సైకిళ్లను ఎగుమతి చేసుకోవచ్చు. వేగంగా, సురక్షితంగా బైకులను ట్రాన్స్‌పోర్ట్ చేసే సామర్థ్యం ఉన్న ట్రాన్స్‌పోర్ట్ సంస్థలు ఉన్నాయి. అలాంటి వాటిని నమ్మి కేరళకు చెందిన కొంత మంది రైడర్లు తమ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను మనాలికి ట్రాన్స్‌పోర్ట్ చేశారు.

Recommended Video

2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను పార్శిల్ ఓనర్లకు ఊహించని షాక్

అయితే మనాలిలో డెలివరీ కోసం వెళ్లిన ఆ రైడర్లకు భారీగా డ్యామేజ్‌తో ఉన్న బైకులు దర్శనమిచ్చాయి. అన్ని లాజిస్టిక్ కంపెనీలు ఒకేలా ఉండవు కదా... కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో లక్షలు ఖరీదైన బైకులు ఇలా ఎటూ పనికిరాకుండాపోయాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను పార్శిల్ ఓనర్లకు ఊహించని షాక్

వంకర్లు తిరిగిన బాడీ పార్ట్, తీవ్రంగా డ్యామేజ్ అయిన ఇంధన ట్యాంక్ మరియు వీల్ హబ్‌తో పాటు బైకులోని అనేక ఇతర ప్రధాన పార్ట్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. కేరళ నుండి మనాలికి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను GATI-KWE ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ద్వారా పార్శిల్ చేస్తే, చివరికి ఇలా మిగిలాయి అంటూ, కేరళకు చెందిన షాను కల్లంగాడి తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ఫోటోలు మరియు వీడియో పోస్ట్ చేశాడు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను పార్శిల్ ఓనర్లకు ఊహించని షాక్

గాటి-కెడబ్ల్యూఇ( GATI-KWE) అనేది భారత్‌కు చెందిన గాటి మరియు జపాన్‍‌కు చెందిన దిగ్గజ లాజిస్టిక్ కంపెనీ కిన్‌టెట్సు వరల్డ్ ఎక్స్‌ప్రెస్ (KWE) సంస్థల ఉమ్మడి భాగస్వామ్యపు లాజిస్టిక్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను పార్శిల్ ఓనర్లకు ఊహించని షాక్

కేరళలో పార్శిల్ చేసి మనాలి చేరుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రైడర్లు, డ్యామేజ్‌కు గురైన బైకుల గురించి GATI-KWE కంపెనీని ప్రశ్నిస్తే, ఎలాంటి సమాధనం ఇవ్వలేదు. సర్వీసులో నాణ్యత లేదనడానికి రైడర్లు నెటిజన్లతో పంచుకున్న ఫోటోలు మరియు వీడియోలే ఇందుకు నిదర్శనం.

ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ముందే, లాజిస్టిక్ కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదు. దూర ప్రాంతాలను రవాణా చేస్తున్నపుడు వాటిని భద్రంగా పార్శిల్ చేయాల్సి ఉంటుంది. మనాలికి చేరిన తరువాత కూడా నిర్లక్ష్యంగా బైకులను అడ్డదిడ్డంగా క్రింద పడేశారు.

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfields Damaged In Transport To Manali
Story first published: Saturday, July 29, 2017, 12:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X