ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రత్యేకం: బీయింగ్ హ్యుమన్ ఇ-సైకిల్స్ విడుదల చేసిన సల్మాన్ ఖాన్

Written By:

ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ గురించి ప్రతి ఒక్కరు అది చేయాలి, ఇది చేయాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని ప్రసంగాలకు పరిమితమవుతుంటారు. అయితే వాటిని ఆచరించడంలో చాలా వరకు విఫలమవుతుంటారు. ఆ ఆధునిక యుగంలో ఈ తంతు ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఇదే రోజున సల్మాన్ ఖాన్ తన బీయింగ్ హ్యుమన్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ సైకిళ్లను విడుదల చేశాడు.+

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బీయింగ్ హ్యుమన్ ఇ-సైకిల్స్ విడుదల చేసిన సల్మాన్ ఖాన్

అయితే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఎలక్ట్రిక్ సైకిల్స్ వినియోగిచండం ద్వారా వాహన కాలుష్యాన్ని తగ్గించవచ్చని పిలుపునిచ్చి, ఆ సందర్భంగా బీయింగ్ హ్యుమన్ అనే బ్రాండ్ పేరుతో విపణిలోకి ఎలక్ట్రిక్ సైకిళ్లను విడుదల చేశాడు.

బీయింగ్ హ్యుమన్ ఇ-సైకిల్స్ విడుదల చేసిన సల్మాన్ ఖాన్

ఇండియన్ మార్కెట్లోకి బీయింగ్ హ్యుమన్ ఎలక్ట్రిక్ సైకిళ్ల విడుదల కార్యక్రమంలో సల్మాన్ ఖాన్‌తో పాటు ఒలంపిక్ స్విమ్మర్, ఐదు సార్లు నేషనల్ ఛాంపియన్ మరియు అర్జున్ అవార్డ్ గ్రహీత రేహన్ పొంచా పాల్గొన్నారు.

బీయింగ్ హ్యుమన్ ఇ-సైకిల్స్ విడుదల చేసిన సల్మాన్ ఖాన్

బీయింగ్ హ్యుమన్ ఎలక్ట్రిక్ సైకిళ్లు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. అవి, బిహెచ్27 మరియు బిహెచ్ 12. రెండు వేరియంట్లను నాలుగు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, తెలుపు, పసుపు, ఎరుపు మరియు నలుపు.

బీయింగ్ హ్యుమన్ ఇ-సైకిల్స్ విడుదల చేసిన సల్మాన్ ఖాన్

మరికొన్ని నెలల్లో బీయింగ్ హ్యుమన్ ఇ-సైకిళ్లలో మరిన్ని వేరియంట్లను విడుదల చేయనున్నారు. పట్టణ వాతావరణంలో స్థిరమైన శక్తి విద్యుత్, ఈ శక్తి ఆధారంగా నడిచే సైకిళ్ల పట్టణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని అభివృద్ది చేయడం జరిగింది.

బీయింగ్ హ్యుమన్ ఇ-సైకిల్స్ విడుదల చేసిన సల్మాన్ ఖాన్

శక్తిని ఆదా చేయడంలో, ఉద్గార రహిత మరియు తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేయడంలో బీయింగ్ హ్యుమన్ ఇ-సైకిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. బీయింగ్ హ్యుమన్ ఎలక్ట్రిక్ సైకిళ్లను ముంబాయ్‌ వేదికగా బుక్ చేసుకోవచ్చు.

బీయింగ్ హ్యుమన్ ఇ-సైకిల్స్ విడుదల చేసిన సల్మాన్ ఖాన్

ధర విషయానికి వస్తే, బీయింగ్ హ్యుమన్ ఇ-సైకిల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 40,000 లు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 57,000 లు. రానున్న కాలంలో దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాలలో డిస్ట్రిబ్యూటర్లను చేర్చుకుని మరిన్ని సైకిళ్లను విపణిలోకి తీసుకురానుంది బీయింగ్ హ్యుమన్.

Read more on: #సైకిల్ #cycle
English summary
Read In Telugu To know More About Salman Khan Launches Being Human E-Cycles
Story first published: Wednesday, June 7, 2017, 11:42 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark