కేవలం డీజల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే నెక్సాన్

Written By:

మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకో స్పోర్ట్‌లకు గట్టి పోటీగా ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్దంగా ఉన్న అప్ కమింగ్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్. ఇప్పటికే పలుమార్లు రహదారి పరీక్షలు పూర్తి చేసుకున్న నెక్సాన్‌లోని ప్రధానమైన ఫీచర్లు గురించి తెలుసుకున్నాం.

సింగల్ ఇంజన్ ఆప్షన్‌లోనే టాటా నెక్సాన్

ప్రారంభంలో నెక్సాన్ ఇంజన్ ఆప్షన్స్‌ గురించి వచ్చిన సమాచారం మేరకు, 1.2-లీటర్ టుర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ టుర్బో డీజల్ ఇంజన్ వేరియంట్లలో నెక్సాన్ రానున్నట్లు తెలిసింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు కేవలం ఒక్క ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే విడుదల కానుంది.

సింగల్ ఇంజన్ ఆప్షన్‌లోనే టాటా నెక్సాన్

నెక్సాన్ తొలుత 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లతో లభించనుంది. పెట్రోల్ ఇంజన్ కాస్త ఆలస్యంగా విడుదల కానుంది.

సింగల్ ఇంజన్ ఆప్షన్‌లోనే టాటా నెక్సాన్

నెక్సాన్ ఎస్‌యూవీలోని డీజల్ ఇంజన్ గరిష్టంగా 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. ఎస్‌యూవీ సెగ్మెంట్ శ్రేణిలో అత్యుత్తమ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

సింగల్ ఇంజన్ ఆప్షన్‌లోనే టాటా నెక్సాన్

ప్రస్తుతం నెక్సాన్‌కు పోటీగా ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా కూడా 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది.

సింగల్ ఇంజన్ ఆప్షన్‌లోనే టాటా నెక్సాన్

కాన్సెప్ట్ దశలో 2016 ఇండియన్ ఆటో ఎక్స్-పో మరియు జెనీవా ఆటో షో వేదిక మీద ప్రదర్శించిన మోడల్‌లోనే టాటా తమ నెక్సాన్‌ను విడుదల చేస్తే, ఇండియన్ మార్కెట్లోనే ఓ గుడ్ లుకింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా స్థానం సంపాదించుకోవడం ఖాయం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా మోటార్స్ వితారా బ్రిజాకు సరాసరి పోటీనిచ్చేందుకు వ్యూహాత్మకంగా నెక్సాన్‌ను కేవలం ఒకే డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే అందిస్తున్నట్లు తెలిసింది. ధర కూడా బ్రిజా కన్నా తక్కువగా నిర్ణయిస్తే, రెండింటిలో నెక్సాన్ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది.

English summary
Read In Telugu Tata Nexon To Come Only With A Single Engine Option
Story first published: Saturday, June 24, 2017, 10:54 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark