బేబి కెటిఎమ్ డ్యూక్ బైకు స్టైల్లో స్కూటి పెప్ ప్లస్ స్కూటర్‌

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన స్కూటి పెప్ ప్లస్ స్కూటర్‌ను బేబి కెటిఎమ్ డ్యూక్ బైకుగా మోడిఫై చేసుకున్నాడు.

By Anil

రైడ్ చేయడానికి చాలా సింపుల్‌గా... తేలిగ్గా ఉంటుందని స్కూటి పెప్ ప్లస్ స్కూటర్ కొన్నవారు చాలా మందే ఉన్నారు. అయితే, తగినంత పవర్ ప్రొడ్యూస్ చేయలేదనో... వీలైనంత పికప్ లేదన్న నిరాశతో అలాగే వాడుకుంటూ ఉంటారు.

టీవీఎస్ స్కూటి పెప్ కెటిఎమ్ డ్యూక్ మోడిఫికేషన్

కానీ, బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తన స్కూటి పెప్ ప్లస్ స్కూటర్‌ను బేబి కెటిఎమ్ డ్యూక్ బైకుగా మోడిఫై చేసుకున్నాడు. మోడిఫికేషన్ అనంతరం ఈ స్కూటర్ కాదు... కాదు, ఈ పొట్టి కెటిఎమ్ బైకును ఎక్కడ పార్క్ చేసినా జనాలు విపరీతంగా పోగవుతున్నారు.

Recommended Video

Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
టీవీఎస్ స్కూటి పెప్ కెటిఎమ్ డ్యూక్ మోడిఫికేషన్

మీ దగ్గరా స్కూటి పెప్ స్కూటర్ ఉందా.....? మీకు ఇలాంటి మోడిఫైడ్ కెటిఎమ్ డ్యూక్ 125 బైకు కావాలా....? ఇంకెందుకు ఆలస్యం. డ్యూక్ స్టైల్లోకి మారిపోయిన స్కూటి పెప్ ప్లస్ కస్టమైజేషన్ వివరాలు...దీనికెంత ఖర్చవుతుందో చూద్దాం రండి....

టీవీఎస్ స్కూటి పెప్ కెటిఎమ్ డ్యూక్ మోడిఫికేషన్

మునుపటి తరానికి చెందిన కెటిఎమ్ డ్యూక్ నుండి సేకరించిన హెడ్ ల్యాంప్, హ్యాండిల్ బార్, బాడీ ప్యానల్స్, ఇంజన్ క్రింద మడ్ గార్డ్ ట్యూబులర్ ట్రెల్లిస్ ఫ్రేమ్ మరియు క్యానిస్టర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ వంటి వాటిని వినియోగించి స్కూటి పెప్‌ను డ్యూక్ 125 పేరుతో మార్చేశాడు.

టీవీఎస్ స్కూటి పెప్ కెటిఎమ్ డ్యూక్ మోడిఫికేషన్

అయితే కెటిఎమ్ డ్యూక్‌లో ఉన్న 11-లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ తొలగించి, 2-లీటర్ల ఫ్యూయల్ ట్యాంకును అందివ్వడం జరిగింది. అయితే ఎక్కడికెళ్లినా ఓ నాలుగు పెట్రోల్ వెంట తీసుకెళ్లాలి లేదంటే ప్రతి రెండు లీటర్లకు ఒకసారి పెట్రోల్ బంక్ చుట్టూ తిరగాల్సిందే.

టీవీఎస్ స్కూటి పెప్ కెటిఎమ్ డ్యూక్ మోడిఫికేషన్

హైట్ పక్కనపెడితే, చూడటానికి అచ్చం కెటిఎమ్ డ్యూక్ మాదిరిగానే ఉంటుంది. కాని ఇంజన్ మొత్తం టీవీఎస్ స్కూటి పెప్ ప్లస్‌లో ఉన్నదే ఉంది. ఇందులోని 88సీసీ సింగల్ సిలిండర్ ఇంజన్ 5బిహెచ్‌పి పవర్ మరియు 5.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ స్కూటి పెప్ కెటిఎమ్ డ్యూక్ మోడిఫికేషన్

టీవీఎస్ స్కూటి పెప్ ప్లస్ స్కూటర్‌ను హైబ్రిడ్ కెటిఎమ్ డ్యూక్ 125 రూపంలోకి మార్చేయడానికి సుమారుగా రూ. 55,000-60,000 ల వరకు ఖర్చైనట్లు దీనిని మోడిఫికేషన్ చేసిన వ్యక్తి తెలిపాడు. కెటిఎమ్ విడిపరకరాలు సేకరించడానికే ఎక్కువ మొత్తం వెచ్చించాడు.

కెటిఎమ్ డ్యూక్ 125 రూపంలో ఉన్న స్కూటి పెప్ ప్లస్ స్కూటర్‌ను వీడియోలో వీక్షించగలరు.

ఆరేంజ్ మరియు వైట్ కలర్‌లో ఉన్న బుడ్డ కెటిఎమ్ డ్యూక్ 125 గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్ తెలపండి...

Most Read Articles

English summary
Read In Telugu: This TVS Scooty Pep Dresses Up To Look Like A KTM 125 Duke
Story first published: Saturday, September 9, 2017, 13:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X