ఐఫోన్ X కన్నా తక్కువ ధరతో 2017లో విడుదలైన ఐదు బైకులు

ఒక లక్ష ధరలో లభించే బైకులకు గిరాకీ ఎక్కువ. ఈ నేపథ్యంలో పలు టూ వీలర్ల కంపెనీలో 2017లో ఇండియన్ మార్కెట్లోకి ఎన్నో బైకులను లాంచ్ చేశాయి.

By Anil

లక్షల రుపాయలలోపు ధరతో లభించే మోటార్ సైకిళ్లు ఇటు కస్టమర్లకు, అటు కంపెనీలకు చాలా ముఖ్యమైనవి. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అమ్ముడుపోతున్న బైకులన్నీ లక్ష రుపాయల ధరకు దిగువనే ఉంటాయి.

కాబట్టి విపణిలో ఒక లక్ష ధరలో లభించే బైకులకు గిరాకీ ఎక్కువ. ఈ నేపథ్యంలో పలు టూ వీలర్ల కంపెనీలో 2017లో ఇండియన్ మార్కెట్లోకి ఎన్నో బైకులను లాంచ్ చేశాయి. వీటిలో లక్ష రుపాయల కంటే తక్కువ ధరతో, చెల్లించిన డబ్బుకు అత్యుత్తమ విలువ గల టాప్ 5 బైకుల గురించి ప్రత్యేక కథనం...

2017లో విడుదలైన టాప్ 5 బైకులు

5. బజాజ్ పల్సర్ ఎన్ఎస్200

బజాజ్ ఆటో ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో ఇటు కమ్యూటర్ సెగ్మెంట్లో, అటు స్పోర్ట్స్ మరియు నేక్ట్డ్ వెర్షన్ పర్ఫామెన్స్ బైకుల సెగ్మెంట్లో జపాన్ దిగ్గజాలతో పోటీపడి రాణించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తమ పాత వెర్షన్ పల్సర్ 200ఎన్ఎస్ బైకును, ఎన్ఎస్200 పేరుతో రీలాంచ్ చేసింది.

Recommended Video

TVS Apache RR 310 Launched In India | Specs | Top Speed | Mileage | Price
2017లో విడుదలైన టాప్ 5 బైకులు

బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 బైకును యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌తో అప్‌జడేట్ చేసి, లాంచ్ చేసింది. సరికొత్త ఫెయిరింగ్, నూతన డీకాల్స్, మూడు విభిన్నమైన కలర్ ఆప్షన్స్(వైట్, రెడ్ మరియు బ్లాక్)లో ప్రవేశపెట్టింది. బజాజ్ 200సీసీ సెగ్మెంట్లో దీని విడుదలతో మంచి ఫలితాలు సాధిస్తోంది.

2017లో విడుదలైన టాప్ 5 బైకులు

సాంకేతికంగా బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్ మరియు నాన్-ఏబిఎస్ వెర్షన్‌లో 199.5సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ట్రిపుల్ స్పార్క్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇది 23.5బిహెచ్‌పి పవర్ మరియు 18.3ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

  • బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ధర రూ. 97,075 లు
  • బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఏబిఎస్ ధర రూ. 1,09,075 లు
  • 2017లో విడుదలైన టాప్ 5 బైకులు

    4. హోండా సిబి హార్నెట్ 160 ఆర్

    160సీసీ సెగ్మెంట్లో ఉన్న యమహా ఎఫ్‌జడ్‌ను ఎదుర్కొనేందుకు హోండా టూ వీలర్స్ 2016లో హార్నెట్ బైకును లాంచ్ చేసింది. అయితే, 2017 ఏప్రిల్ నుండి ప్రతి బైకులో కూడా బిఎస్-4 ఇంజన్ తప్పనిసరి చేయడంతో ఏప్రిల్ 2017లో బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌తో పాటు కొన్ని మార్పులు చేర్పులు చేసి అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది.

    2017లో విడుదలైన టాప్ 5 బైకులు

    ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఇరు వైపులా డిస్క్ బ్రేకులతో పాటు స్ట్రైకింగ్ గ్రీన్, మార్స్ ఆరేంజ్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ మరియు స్పోర్ట్స్ రెడ్ అనే నాలుగు విభిన్న రంగుల్లో 12-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో పరిచయం చేసింది.

    2017లో విడుదలైన టాప్ 5 బైకులు

    2017 హోండా సిబి హార్నెట్ 160 ఆర్ బైకులో 162.71సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే బిఎస్-4 సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 15.04బిహెచ్‌పి పవర్ మరియు 14.76ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

    • హోండా సిబి హార్నెట్ 160 ఆర్ ధర రూ. 82,392 లు
    • 2017లో విడుదలైన టాప్ 5 బైకులు

      3. బజాజ్ అవెంజర్

      భారత్‌లో కొంత మంది సెలక్టివ్ కస్టమర్లు ఉంటారు. యమహా ఎంటీసర్ నుండి ఇప్పటి వరకు కంఫర్ట్ మరియు క్రూయిజర్ స్టైల్ రైడింగ్ కోరుకునే కస్టమర్లకు కొదవేలేదు. ఇలాంటి వారికి ఉన్న ఏకైక ఆప్షన్ బజాజ్ అవెంజర్ సిరీస్.

      2017లో విడుదలైన టాప్ 5 బైకులు

      ఇండియాలో లభిస్తున్న చీపెస్ట్ క్రూయిజ్ బైకులకు కేరాఫ్ అడ్రస్‍‌గా మారిన బజాజ్ అవెంజర్ సిరీస్‌లో బైకులను 2017లో అప్‌డేట్ చేసింది. అవెంజర్ బ్రాండ్ క్రింద అవెంజర్ 150, క్రూయిజర్ 200, స్ట్రీట్ 220 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలో కూడా బజాజ్ అప్‌డేటెడ్ ఇంజన్ ప్రవేశపెట్టింది.

      2017లో విడుదలైన టాప్ 5 బైకులు

      బజాజ్ అవెంజర్ సిరీస్‌లోని స్ట్రీట్ మరియు క్రూయిజ్ ప్రీమియమ్ బైకుల్లో 220సీసీ కెపాసిటి గల ఇంజన్ ఉంటే, ఎంట్రీ లెవల్ అవెంజర్ స్ట్రీట్ 150లో 150సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు.

      • బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150 ధర రూ. 80,691 లు
      • బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 ధర రూ. 88,922 లు
      • బజాజ్ అవెంజర్ క్రూయిజ్ 220 ధర రూ. 88,922 లు
      • 2017లో విడుదలైన టాప్ 5 బైకులు

        2. సుజుకి జిక్సర్

        హయాబుసా మరియు జిఎస్ఎక్స్-ఆర్100 వంటి లెజండరీ బైకులను తయారుచేసిన ఘనత సుజుకి మోటార్ సైకిల్స్‌దే. ఖరీదైన బైకుల సెగ్మెంట్లో ఆశించిన మేర రాణించనప్పటికీ, జిక్సర్ పేరుతో ప్రవేశపెట్టిన ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ బైకులతో ఇండియన్ మార్కెట్లో తన ఉనికిని కాపాడుకుంది.

        2017లో విడుదలైన టాప్ 5 బైకులు

        సుజుకి స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ ఇండియా లిమిటెడ్ జిక్సర్ సిరీస్ లాంచ్‌తో మంచి ఫలితాలనే సాధించింది. కస్టమర్లకు ఎప్పటికప్పుడు వెర్షన్‌లో అందించే లక్ష్యంతో మరియు బిఎస్-4 ఇంజన్ తప్పనిసరి చేయడంతో సుజుకి తమ జిక్సర్ సిరీస్ బైకులను అప్‌డేట్ చేసి లాంచ్ చేసింది.

        2017లో విడుదలైన టాప్ 5 బైకులు

        జిక్సర్ మరియు జిక్సర్ ఎస్ఎఫ్ బైకులో 150సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు. చెప్పుకోడానికి తక్కువ సీసీనే అయినప్పటికీ పర్ఫామెన్స్ విషయంలో ఎక్కడా నిరాశపరచదు. ఫిట్ డిజైన్, మంచి మైలేజ్‌తో పాటు ఫ్యూయల్ ఇంజెక్షన్, డిస్క్ బ్రేక్స్ మరియు ఏబిఎస్ వంటివి ఉన్నాయి.

        • జిక్సర్ ధర రూ. 81,423 లు
        • జిక్సర్ ఎస్ఎఫ్ ధర రూ. 84,715 లు
        • 2017లో విడుదలైన టాప్ 5 బైకులు

          1. టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 200 4వి

          కమ్యూటర్ మరియు స్కూటర్ల సెగ్మెంట్లో అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్న దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ అపాచే సిరీస్‌ ద్వారా పర్ఫామెన్స్ బైకుల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. తొలుత 160సీసీ బైకులను ఉత్పత్తి చేసిన టీవీఎస్ ఇప్పుడు అపాచే ఆర్‌టిఆర్ 2004వి పేరుతో 200సీసీ బైకును లాంచ్ చేసింది.

          2017లో విడుదలైన టాప్ 5 బైకులు

          టీవీఎస్ 2017లో అప్‌డేటెడ్ వెర్షన్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకును విడుదల చేసింది. అధునాతన ఫీచర్లు, నూతన టెక్నాలజీ జోడింపుతో న్యూ వెర్షన్ ఆపాచే ఆర్‌టిఆర్ 200 4వి పర్ఫామెన్స్ బైక్ ప్రియుల హృదయాల్లో నిలిచిపోయింది. విపణిలో ఉన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 కు ఇది గట్టి పోటీనిస్తోంది.

          2017లో విడుదలైన టాప్ 5 బైకులు

          సాంకేతికంగా టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకులో 197సీసీ కెపాసిటి గల ఆయిల్ మరియు ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‍‌బాక్స్ అనుసంధానం గల ఇది 21బిహెచ్‌పి పవర్ మరియు 18ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

          • టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ధర రూ. 96,205 లు
          • గమనిక: అన్ని బైకుల ధరలను వాటి ప్రారంభ వేరియంట్ల ఆధారంతో ఎక్స్-షోరూమ్ హైదరాబాదుగా ఇవ్వడం జరిగింది. వివిధ షోరూమ్ మధ్య ధరల వ్యత్యాసం ఉంటుంది.

            Trending DriveSpark Telugu YouTube Videos

            Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Top 5 Motorcycles Bikes launched In India In 2017 Under Rs. 1 Lakh
Story first published: Friday, December 22, 2017, 13:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X