విద్యుత్ స్కూటర్లతో దూసుకొస్తున్న మరో ఇండియన్ టూ వీలర్ కంపెనీ

ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఉన్న భవిష్యత్తు ప్రణాళికలను వివరించింది.

By Anil

దక్షిణ భారత దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్లపై ఉన్న భవిష్యత్తు ప్రణాళికలను వివరించింది. ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ టూ వీలర్లను ప్రవేశపెట్టడం మరియు వాటి అభివృద్ది పరమైన పనులను వేగవంతం చేస్తోంది.

టీవీఎస్ ఎలక్ట్రిక్ టూ వీలర్లు

ద్విచక్ర వాహన పరిశ్రమలో తమకున్నపరిజ్ఞానంతో విద్యుత్ ద్వారా నడిచే టూ వీలర్లను తయారు చేసి, వాటిని విపణిలోకి విడుదల చేయనున్నట్లు చెన్నై ఆధారిత టూ వీలర్ల కంపెనీ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

టీవీఎస్ ఎలక్ట్రిక్ టూ వీలర్లు

టీవీఎస్ కమ్యూటర్ మోటార్‌సైకిల్స్, స్కూటర్స్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ మాట్లాడుతూ," భవిష్యత్ రవాణాలో విద్యుత్ వాహనాలు కీలకంగా మారనున్నాయి. దానికనుగుణంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు."

Recommended Video

TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టీవీఎస్ ఎలక్ట్రిక్ టూ వీలర్లు

ఎలక్ట్రిక్ టూ వీలర్లను విడుదల చేసే సమయం గురించి మాట్లాడుతూ, అతి త్వరలో మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపాడు. అయితే, ఎలాంటి స్కూటర్లు లేదా బైకులు ఉంటాయనే వివరాలను వెల్లడించడానికి నిరాకరించాడు.

టీవీఎస్ ఎలక్ట్రిక్ టూ వీలర్లు

ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్ మరియు లోహియా కంపెనీలు దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమలో ప్రముఖంగా ఉన్నాయి. అదే విధంగా బజాజ్ అర్బనైట్ బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ టూ వీలర్లను విడుదల చేయనున్నట్లు ఈ మధ్యనే స్పష్టం చేసింది.

టీవీఎస్ ఎలక్ట్రిక్ టూ వీలర్లు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,000 నుండి 20,000 యూనిట్ల మధ్య ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడవుతున్నాయి. అయితే పెట్రోల్ స్కూటర్ల విషయానికి వస్తే ఏడాదికి 1.7 కోట్ల స్కూటర్లు అమ్ముడవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు అధికంగా ఉండటమే.

టీవీఎస్ ఎలక్ట్రిక్ టూ వీలర్లు

డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ మోటార్స్ పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల మార్కెట్లోకి ప్రవేశించడానికి సర్వం సిద్దం చేసుకుంది. ఇప్పటకే పలు ఎలక్ట్రిక్ స్కూటర్ల‌ను అభివృద్ది చేసింది. దీనికి తోడు బజాజ్ ఆటో అర్బనైట్ బ్రాడ్ పేరుతో ఎకో ఫ్రెండ్లీ టూ వీలర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Most Read Articles

English summary
Read In Telugu: TVS Plans To Introduce Electric Two-Wheelers In India
Story first published: Monday, September 18, 2017, 17:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X