20 లక్షల సేల్స్‌తో దుమ్ముదులిపేసిన టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ జూపిటర్ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి 20 లక్షల సేల్స్ మైలురాయిని దాటిపోయింది.

By Anil

భారతదేశపు టూ వీలర్ మరియు త్రీ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీకు చెందిన మోస్ట్ పాపులర్ స్కూటర్ జూపిటర్ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి 20 లక్షల సేల్స్ మైలురాయిని దాటిపోయింది. నాలుగు సంవత్సరాల్లో 20 లక్షలకు పైగా జూపిటర్ స్కూటర్లు రోడ్డెక్కాయి.

టీవీఎస్ జూపిటర్ స్కూటర్

టీవీఎస్ మోటార్స్ సరిగ్గా 2013లో జూపిటర్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్కువ వల్ల లాభం అనే కాన్సెప్టుతో వచ్చిన జూపిటర్‌కు ఇండియన్స్ భారీ సంఖ్యలో ఫిదా అయిపోయారు. 2016 లో, కేవలం30 నెలల్లోనే జూపిటర్ స్కూటర్ పది లక్షల సంతృప్తి చెందిన కస్టమర్లను చేరుకుంది.

Recommended Video

TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
టీవీఎస్ జూపిటర్ స్కూటర్

టీవీఎస్ జూపిటర్ స్కూటర్లో సాంకేతికంగా 110సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 7.8బిహెచ్‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అత్యుత్తమ యాక్సిలరేషన్ మరియు బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ దీని సొంతం.

టీవీఎస్ జూపిటర్ స్కూటర్

టీవీఎస్ పేటెంట్ పొందిన ఎకోనోమీటర్ ఇందులో ఉంది. దీంతో ఇంజన్ ఎకో మరియు పవర్ రెండు మోడ్‌లలో నడుస్తుంది. ఎకో మీటర్ అందివ్వడం ద్వారా అధిక మైలేజ్ సాధ్యమవుతుంది. టీవీఎస్ జూపిటర్ బేస్ వేరియంట్, జడ్ఎక్స్ మరియు జడ్ఎక్స్ డిస్క్ వేరియంట్లలో లభ్యమవుతోంది.

టీవీఎస్ జూపిటర్ స్కూటర్

టీవీఎస్ మోటార్స్ ఈ మధ్యనే, జూపిటర్ క్లాసిక్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ఇందులో సన్‌లిట్ ఇవోరి బాడీ కలర్, క్రోమ్ మిర్రర్లు, విండ్ షీల్డ్, పిలియన్ కుషన్ బ్యాక్ రెస్ట్ మరియు స్మార్ట్ యుఎస్‌బి ఛార్జర్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

టీవీఎస్ జూపిటర్ స్కూటర్

టీవీఎస్ జూపిటర్‌లో సింక్ బ్రేకింగ్ సస్టమ్(SBS)ఉంది, దీని ద్వారా సూరక్షితమైన మరియు స్మూత్ రైడింగ్‌కు సాధ్యపడుతుంది. జూపిటర్ స్కూటర్‌ను తొమ్మిది విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, రాయల్ వైన్, మ్యాట్ బ్లూ, స్టేలియన్ బ్రౌన్, టైటానియమ్ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్, వోల్కానో రెడ్, ప్రిస్టిన్ వైట్, జాడ్ గ్రీన్ మరియు మైస్టిక్ గోల్డ్.

టీవీఎస్ జూపిటర్ స్కూటర్

టీవీఎస్ స్కూటర్స్ మరియు మోటార్ సైకిల్స్ కార్పోరేట్ బ్రాండ్ మరియు వైస్ ప్రెసిడెంట్, అనిరుధ్ హల్దార్ మాట్లాడుతూ, "టీవీఎస్ జూపిటర్ అనతి కాలంలో భారీ విజయాన్ని అందుకుంది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే 20 లక్షలకు పైగా సంతృప్తి చెందిన వినియోగదారులను చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు."

టీవీఎస్ జూపిటర్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అత్యుత్తమ సదుపాయాలు గల టీవీఎస్ జూపిటర్ అతి తక్కువ కాలంలోనే ఇండియన్ మార్కెట్లో పాపులర్ స్కూటర్‌గా నిలిచింది. హోండా ఆక్టివా తరువాత, అత్యుత్తమ సేల్స్ మరియు ఆదరణ లభిస్తున్న స్కూటర్ టీవీఎస్ జూపిటర్.

More from DriveSpark

Article Published On: Wednesday, September 27, 2017, 17:08 [IST]
English summary
Read In Telugu: TVS Jupiter Crosses Two Million Sales Mark In India
Read more on: #టీవీఎస్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+