టీవీఎస్ స్పోర్ట్ బిఎస్4 బైకు విడుదల: ప్రారంభ ధర రూ. 37,580 లు
టీవీఎస్ మోటార్ సైకిల్ విపణిలోకి సరికొత్త 2017 స్పోర్ట్ బైకును బిఎస్4 ఇంజన్‌తో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 37,580 లుగా నిర్ణయించింది.
దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి 2017 టీవీఎస్ స్పోర్ట్ మోటార్ సైకిల్‌ను బిఎస్4 ఇంజన్ మరియు 35వాట్ సామర్థ్యం ఉన్న ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్‌తో విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన బిఎస్4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్, మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్(AHO) ఫీచర్లను టీవీఎస్ తమ స్పోర్ట్ వేరియంట్ బైకులో జోడించింది.

2017 టీవీఎస్ స్పోర్ట్ బిఎస్4 ధర వివరాలు
- కిక్ స్టార్ట్ మరియు స్పోక్ వీల్ వేరియంట్ ధర రూ. 37,580 లు
- కిక్ స్టార్ట్ మరియు అల్లాయ్ వీల్ వేరియంట్ ధర రూ. 43,236 లు
- సెల్ఫ్ స్టార్ట్ అల్లాయ్ వీల్ వేరియంట్ ధర రూ. 46, 924 లు అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

టీవీఎస్ మోటార్స్ కొత్తగా విడుదల చేసిన 2017 టీవీఎస్ స్పోర్ట్ బిఎస్4 మోటార్ సైకిల్‌ను ఏడు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, బ్లాక్ సిల్వర్, ఇండిగో స్ట్రీక్, మెర్క్యురీ గ్రే, బ్లేజ్ రెడ్, వొల్కానో రెడ్, డాజ్లింగ్ వైట్ మరియు ఎలక్ట్రిక్ గ్రీన్.

2017 టీవీఎస్ స్పోర్ట్ బిఎస్4 లో 99.77సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ డ్యూరా లైఫ్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ ఉత్పత్తి చేసే 7.7బిహెచ్‌పి పవర్ మరియు 7.8ఎన్ఎమ్ టార్క్ 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రానికి అందుతుంది.

2017 టీవీఎస్ స్పోర్ట్ బిఎస్4 లో ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ఐదు దశలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ట్విన్ సస్పెన్షన్స్ కలవు.

ముందు వైపున ఉన్న 130ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున ఉన్న 110ఎమ్ఎమ్ చుట్టుకొలత ఉన్న డ్రమ్ బ్రేకులు బ్రేకింగ్ డ్యూటీని నిర్వర్తిస్తాయి.

2017 టీవీఎస్ స్పోర్ట్ బిఎస్4 లో 12-లీటర్ స్టోరేజీ సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు మరియు దీని మొత్తం బరువు 108.5కిలోలుగా ఉంది.


Click it and Unblock the Notifications








