బెంగళూరు స్టైల్లో న్యూ ఇయర్ వేడుకలు: టీవీఎస్ వీగో అడ్వెంచర్ రైడ్

2016 ఏడాదికి వీడ్కోలు పలుకుతూ... 2017 ఏడాదిని స్వాగతించే సంభరాలను టీవీఎస్ వీగో ద్వారా బెంగళూరులో జరుపుకున్న డ్రైవ్‌స్పార్త్ బృందం. రెండవ కథనం ద్వారా పూర్తి వివరాలు...

By Anil

బెంగళూరు వేదికగా టీవీఎస్ వీగో ద్వారా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న మొదటి రోజు మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే 2016 లోని చివరి రోజుకు గుడ్ బై చెప్పడానికి సూర్యుడు పడమరకు వాలిపోయాడు. ఆ రోజు రాత్రి నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి మా బృందం టీవీఎస్ వీగో ద్వారా మళ్లీ రోడ్డెక్కింది.

బెంగళూరు స్టైల్లో న్యూ ఇయర్ వేడుకలు

2016 ఏడాది చివరి రోజు రాత్రి బెంగళూరులో పుట్టి పెరిగిన స్నేహితులతో ఓ మోస్తారు స్థాయిలో ఉండే రెస్టారెంట్లో డిన్నర్ చేసి న్యూ ఇయర్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్‌లో నిమగ్నమయ్యాము. చిన్న పరిమాణంలో అనేక చోట్ల విస్తరించి ఉన్న అనేక రెస్టారెంట్లలో న్యూ ఇయర్ సంభరాలు ప్రారంభమయ్యాయి.

బెంగళూరు స్టైల్లో న్యూ ఇయర్ వేడుకలు

డిన్నర్ అయిన తరువాత టీవీఎస్ వీగో స్కూటర్ల ద్వారా బెంగళూరులో మా జర్నీని ప్రారంభించాము. అయితే నగరంలో మాకు ఎదురుగా వెళ్లే వాహనాల కోసం కాసేపు ఆగాల్సి వచ్చింది.

టీవీఎస్ వీగో లోని బాహ్య భాగంలో అందించిన ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాపునకు ధన్యవాధాలు చెప్పుకోవాలి. చాలా వరకు స్కూటర్లలో ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాపు సీటు క్రింది భాగంలో ఉంటుంది. అలా కాకుండా సీటుకు చివరి భాగంలో ఈ క్యాపును అందించారు.

బెంగళూరు స్టైల్లో న్యూ ఇయర్ వేడుకలు

దక్షిణ భారత దేశంలో పబ్బులు మరియు బార్లకు నిలయమైన నగరాలలో బెంగళూరుది ప్రథమ స్థానం అని చెప్పుకోవాలి. అయితే నిర్మాణాత్మకంగా బెంగళూరులో అద్బుతమైన రహదారులున్నాయి. వీటి వెంబడి టీవీఎస్ వీగో ద్వారా అలుపెరగని రైడింగ్ చేయగలిగాము. బెంగళూరులో తాత్కాలిక నివాసితుల సంఖ్య బాగా ఎక్కువే, ఈ న్యూ ఇయర్ వేడుకల్లో వారిదీ కూడా కీలక పాత్రే.

ఇక నగర వ్యాప్తంగా అక్కడక్క ఉండే చర్చిలయితే క్రిస్మమల్ వేడుకలకు ఇంకా టాటా చెప్పునట్లు లేవు. ఇప్పటికే అదే సొబగులతో కాంతిని వెదజల్లుతున్నాయి.

బెంగళూరు స్టైల్లో న్యూ ఇయర్ వేడుకలు

తరువాత న్యూ వేడుకల సందర్బంగా మా రైడింగ్ చర్చ్ స్ట్రీట్ లేదంటే పబ్ క్రాల్ సెంట్రల్ మీదుగా సాగింది. చర్చ్ స్ట్రీట్ లోని ఇరుకైన బజారుల మీదుగా వెళ్లాల్సి వచ్చింది. అయితే ఎలాంటి రోడ్లలోనైనా అద్బుతమైన రైడింగ్ అనుభవాన్ని ఇవ్వగలదని వీగో నిరూపించుకుంది.

బెంగళూరు స్టైల్లో న్యూ ఇయర్ వేడుకలు

వీగో లోని పొడవాటి వీల్ బేస్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. కొత్త సంవత్సరం వచ్చే లోపు ఒక పబ్బు నుండి క్లబ్బుకు అలాగే విభిన్న ప్రదేశాలను చుట్టేయడంలో వీగో కీలకమైన పాత్ర పోషించింది. రహదారుల మీద న్యూ ఇయర్ కు స్వాగతం పలకడానికి సిద్దంగా ఉన్న యువత చూపును మా వైపు తిప్పుకోగలిగేలా దీని బాడీ గ్రాఫిక్స్ మరియు పెయింటింగ్ అద్బుతంగా చేయబడింది.

బెంగళూరు స్టైల్లో న్యూ ఇయర్ వేడుకలు

2016 సంవత్సరం అంతమవ్వడానికి ఇక కొన్ని గంటలే మిగిలి ఉన్నాయనే సందర్బంలో మా ప్రయాణం సిటి సెంటర్ నుండి ఇందిరా నగర్ వైపుగా సాగింది. యువత భారీ జనసందోహంతో న్యూ ఇయర్ కు వెల్‌కమ్ చెప్పడానికి సిద్దంగా ఉంది. సరాసరిగా వారినే టార్గెట్ చేస్తూ అక్కడికి చేరుకున్నాము. టీవీఎస్ వీగో కూడా యువతను టార్గెట్ చేస్తూ మార్కెట్లోకి వచ్చింది.

బెంగళూరు స్టైల్లో న్యూ ఇయర్ వేడుకలు

2017 లోకి ప్రవేశించగానే యువత మొత్తం గర్జించడం మొదలు పెట్టింది. దీనికి తోడుగా టపాసుల మోత రకరకాల ధ్వనులచే న్యూ వేడుకలను అంగరంగ వైభంగా జరుపుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా కొత్త ఫుడ్‌తో, వీగో మీద వివిధ ప్రదేశాలను కలియతిరుగుతూ ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడం ఒక కొత్త అనుభూతిగా మిగిలిపోయింది.

బెంగళూరు స్టైల్లో న్యూ ఇయర్ వేడుకలు

వివిధ పండుగలకు టీవీఎస్ వీగో మీద వివిధ నగరాలలో చేసే అడ్వెంచర్ రైడింగ్ బెంగళూరు న్యూ ఇయర్ ఫెస్టివల్ తో ఆగిపోవడం లేదు. వచ్చే సంక్రాతిని చెన్నైలో టీవీఎస్ వీగో అడ్వెంచర్ రైడింగ్ ద్వారా జరుపుకోనున్నాము.

తెలుగు రాష్టాలు జరుపుకునే సంక్రాతి లేదా తమిళులు జరుపుకునే పొంగల్ పండుగ విశేషాలతో టీవీఎస్ వీగో రైడింగ్ ద్వారా త్వరలో మీ ముందుకు వస్తాము. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు....

More from DriveSpark

Article Published On: Monday, January 2, 2017, 18:15 [IST]
English summary
Here #Wego: Ringing In The New Year In Style In Bangalore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+