తమిళనాడు స్టైల్లో సంక్రాంతి సంభరాలను వివరించే టీవీఎస్ వీగో రైడ్

మెట్రో నగరాలలో యాంత్రిక జీవనానికి అలవాటుపడిపోయిన వారు సొంతింటికి తప్పకుండా చేరాల్సిన పండుగ సంక్రాతి. ప్రాంతాలు వేరయినా సంక్రాంతిని జరుపుకునే సమయం ఒకటే, దీని ప్రాధాన్యత ఒక్కటే.

By Anil

మెట్రో నగరాలలో యాంత్రిక జీవనానికి అలవాటుపడిపోయిన వారు సొంతింటికి తప్పకుండా చేరాల్సిన పండుగ సంక్రాతి. ప్రాంతాలు వేరయినా సంక్రాంతిని జరుపుకునే సమయం ఒకటే, దీని ప్రాధాన్యత ఒక్కటే. తమిళనాడు శైలిలో సంక్రాంతి సెలబ్రేషన్స్‌ను వివరించడానికి డ్రైవ్‌‌స్పార్క్ బృందం టీవీఎస్ వీగో ద్వారా అడ్వెంచర్ రైడ్ చేసింది.

మొదటి కథనం ద్వారా తంజావూరు గురించి తెలుసుకున్నారు కదా, నేటి కథనంలో టీవీఎస్ వీగో ద్వారా తంజావూరులోని అద్బుతమైన దేవాలయాలు, పెయింటింగ్స్ గురించి తెలుసుకుందాం రండి. నగర నివాసితులకు ఈ కథనం తమ సొంతూరుని ఖచ్చితంగా గుర్తుచేస్తుంది.

టీవీఎస్ వీగో సంక్రాంతి సంభరాలు

సంక్రాంతిని నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజుని భోగి అంటారు. ఈ ప్రాంత నివాసితులు ఈ భోగి రోజున మేఘాలను శాసించే ఇంద్రున్ని పూజిస్తారు. చేతికొచ్చిన పంటను ఇంటికి తీసుకొచ్చిన అనంతరం వచ్చే పంటల కోసం వరుణుడు కరుణించి వర్షించాలనే ఉద్దేశ్యంతో ఇక్కడి ప్రజలు ఇంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

టీవీఎస్ వీగో సంక్రాంతి సంభరాలు

మరికొన్ని ప్రదేశాల్లో భోగి రోజున పాత వస్తువులను భోగి మంటలు వేసి కాల్చేస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు సంక్రాంతి సంభరాల్లో మొదటి రోజున బాగా జరుపుకుంటారు. పాత వస్తువులకు స్వస్తి పలుకడం దీని ప్రధాన ఉద్దేశ్యం.

స్కూటర్ల డిజైన్ ఇందుకు ముఖ్య ఉదాహరణ. ఒకప్పుడు భారీ ఖాయంతో, విశాలమైన శరీరంతో, ఎక్కువ కాలుష్యాన్ని, శబ్దాన్ని విడుదల చేస్తూ తక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లు ఉండేవి. అయితే ఇక్కడున్న టీవీఎస్ వీగో ను గమనించండి. స్కూటర్ల డిజైన్‌లో టీవీఎస్ అందిపుచుకున్న నూతన డిజైన్ భాష తెలుస్తుంది.

టీవీఎస్ వీగో సంక్రాంతి సంభరాలు

ఈ ప్రాంతాల్లో మట్టితో చేసిన కుండల్లో బియ్యం మరియు బెల్లంతో పరమాన్నం వండుతారు. భోగి తరువాత రోజు మక సంక్రాంతి నాడు ఈ వంటకాన్ని తప్పకుండా చేస్తారు. తంజావూరులోని తమిళులు. పొయ్యి మీద మట్టి కుండల్లో ఉన్న పదార్థాన్ని ఉడికించడానికి ముందుగా ఈ తరహాలో చిన్న నృత్యం కూడా చేస్తారు.

టీవీఎస్ వీగో సంక్రాంతి సంభరాలు

హిందువులు జరుపుకునే పండుగల్లో చెరకు చేతికి అందివచ్చేది ఈ సంక్రాంతికే. ప్రాంతాన్ని బట్టి ఒక్కో చోట ఒక్కో రకమైన పదార్థాలు ఈ పండుగకు ప్రత్యేకం. అయితే దేశవ్యాప్తంగా విభిన్న పేర్లతో పిలుచుకునే సంక్రాంతికి అన్ని ప్రదేశాల్లో కూడా చెరకుది ప్రత్యేక స్థానం. మా బృందం తంజావూరులో కొన్ని చెరకు గడలను తరలించడానికి కూడా టీవీఎస్ వీగోను ఉపయోగించింది. అప్పుడు దీని స్థిరమైన రైడింగ్ నిర్వహణ అద్బుతం అని తెలిసింది.

టీవీఎస్ వీగో సంక్రాంతి సంభరాలు

తరువాత మనం గుర్తించే సాంప్రదాయకమైన అంశాలలో ముగ్గు. మహిళలకు ప్రత్యేకించి అమ్మాయిలకు ముగ్గులంటే మహా ప్రాణం. ఈ సంక్రాంతికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ముగ్గుల పోటీ జరగని ప్రదేశం అంటూ ఉండదు. ఇప్పట్లో రెడిమేడ్ ముగ్గులు వచ్చేశాయి. అయినప్పటికీ పల్లెల్లో విశైలమైన ముత్యాల ముగ్గులు దర్శనిమిస్తూనే ఉంటాయి. చక్కటి ఈ ముగ్గును కొల్లామ్ ‌లో మా బృందం రైడింగ్ చేస్తున్నప్పుడు సేకరించినది.

టీవీఎస్ వీగో సంక్రాంతి సంభరాలు

హిందువులు పవిత్రంగా కొలిచే వాటిలో గోవులు అతి ముఖ్యం. అవులు మరియు ఎద్దులు మానవులకు సంపదను వృద్ది చేకూర్చడంలో అత్యంత కీలకం అని చెప్పాలి. ప్రముఖంగా డైరీ మరియు వ్యవసాయ పరిశ్రమలో వీటి వినియోగం అధికం. ఆవులు మరియు ఎద్దులను సంక్రాంతిలోని మూడవ రోజు కనుమ నాడు పూజిస్తారు. ఎద్దులు అద్బుతమైన దేహధారుడ్యంతో భారీ బరువులను ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి సునాయాసంగా తరలిస్తాయి. టీవీఎస్ వీగో లో ఉన్న శక్తివంతమైన పనితీరును కనబరిచే సివిటిఐ ఇంజన్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాలి.

టీవీఎస్ వీగో సంక్రాంతి సంభరాలు

సంక్రాంతిలోని నాలుగవ రోజుని "ముక్కనుమ" అని సంభోదిస్తారు. దీనిని తమిళులు "కనుమ పొంగల్" అని పిలుస్తారు. చివరి రోజున కుటుంబ సమేతంగా అందరూ బయటకు వెళతారు. కొన్ని ప్రాంతాల్లో మూడవ రోజున మరికొన్ని ప్రాంతాల్లో నాలుగువ రోజున మాంసాన్ని వండుతారు. పట్టణ ప్రాంతాల నుండి పల్లెలకు వచ్చిన వారు ఈ రోజున అన్నీ సర్దుకుని బయలుదేరుతారు. అయితే మానవ జీవనం ఎన్ని ఆధునిక పోకడలకు గురైన ఈ నాలుగు రోజుల పండుగనాళ్లలో సాంప్రదాయాన్ని వంటబడ్డించుకోవడం ఈ యాంత్రిక జీవనంలో పరిపాటిగా మారాల్సిందే.

టీవీఎస్ వీగో సంక్రాంతి సంభరాలు

చాలా ప్రదేశాల్లో నాలుగువ రోజున అనేక ఆట పాటలకు నెలవు అని గుర్తుచేసుకోవచ్చు. అందులో ఒకటి జల్లికట్టు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా పోటీలతో పాటు, రాతి దూలం లాగుడు పోటీలు, కోళ్ల పందేలు, పడవ పోటీలు వంటివి జరుగుతాయి.

టీవీఎస్ వీగో సంక్రాంతి సంభరాలు

డ్రైవ్‌స్పార్క్ బృందం టీవీఎస్ వీగో ద్వారా భారత దేశంలో ఉన్న ప్రధాన పండుగలను ఆ యా ప్రధాన నగరాలలో తెలుసుకునే అడ్వెంచర్ రైడింగ్ ప్రారంభించింది. కలకత్తాలోని దుర్గా పూజతో ప్రారంభమై, పూనే లో దీపావళి, కొచ్చిలో క్రిస్మస్, బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకలు మరియు తమిళనాడులో సంక్రాంతి వేడుకలను టీవీఎస్ వీగో ద్వారా అడ్వెంచర్ రైడింగ్ పూర్తి చేసింది. అన్ని టీవీఎస్ వీగో అడ్వెంచర్ రైడింగ్ విశేషాలను చదవండి...

Most Read Articles

English summary
Here #Wego: After Celebrating A Joyful Pongal In Tamil Nadu
Story first published: Monday, January 16, 2017, 20:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X