విపణిలోకి బడ్జెట్ ఫ్రెండ్లీ క్రూయిజర్ బైకులు: హ్యార్లీ, ఎన్ఫీల్డ్‌లకు ఎదురుదెబ్బ

యుఎమ్ మోటార్ సైకిల్స్ విపణిలోకి రెనిగేడ్ కమాండో మొజావే మరియు రెనిగేడ్ కమాండో క్లాసిక్ మోటార్ సైకిళ్లను విడుదల చేసింది.

By Anil

యుఎమ్ మోటార్ సైకిల్స్ విపణిలోకి రెనిగేడ్ కమాండో మొజావే మరియు రెనిగేడ్ కమాండో క్లాసిక్ మోటార్ సైకిళ్లను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 1.8 మరియు 1.89 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి. బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, డెలివరీలను అతి త్వరలో ప్రారంభించనుంది. ఈ రెండు క్రూయిజర్ బైకులు ఇండియన్ మోటార్ సైకిల్స్ స్టైల్లో హ్యార్లీ డేవిడ్సన్ కంటే అత్యంత సరసమైన లభిస్తున్నాయి.

యుఎమ్ మొజావే, క్లాసిక్ క్రూయిజర్ బైకులు

యుఎమ్ మోటార్ సైకిల్స్ సంస్థ రెనిగేడ్ కమాండో క్లాసిక్ బైకును గత ఏడాది జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. బైక్ బాడీ మీద డ్యూయల్ టోన్ గ్లాస్ మెటాలిక్ పెయింట్ ఫినిషింగ్ మరియు క్రోమ్ మేళవింపులు ఉన్నాయి.

Recommended Video

TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
యుఎమ్ మొజావే, క్లాసిక్ క్రూయిజర్ బైకులు

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఈ ధరతో లభించే ఏకైక, అల్టిమేట్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ అని చెప్పవచ్చు. శాడిల్ బ్యాగ్, ట్యాంక్ కవర్, పాలికార్బోనేట్ విండ్ షీల్డ్(ముందు వైపు అద్దం), భారీ ఇంజన్ గార్డ్స్, అల్లాయ్ బ్యాక్ రెస్ట్ మరియు సౌకర్యవంతమైన రైడింగ్ ఫీల్ కల్పించే హ్యాండిల్ బార్ కలదు.

యుఎమ్ మొజావే, క్లాసిక్ క్రూయిజర్ బైకులు

యుఎమ్ రెనిగేడ్ కమాండో క్లాసిక్ దేశీయ విపణిలో రెండు విభిన్న కలర్ ఆప్షన్‌లతో లభిస్తోంది. అవి, కాపర్ క్రీమ్ షేడ్స్‌తో కూడిన డ్యూయల్ టోన్ క్యాండీ పెయింట్ మరియు క్యాండి మెటాలిక్ గ్లాజీ బ్లాక్.

యుఎమ్ మొజావే, క్లాసిక్ క్రూయిజర్ బైకులు

రెనిగేడ్ కమాండో మొజావే బైకును, అమెరికాలోని మొజావే ఎడారి ఆధారంతో పెయింట్ చేశారు. విభిన్నమైన డెసర్ట్ కలర్ మ్యాట్ పెయింట్ జాబ్ దీని మీద గుర్తించవచ్చు. మొజావే డెసర్ట్ లోగో మరియు ఫ్యూయల్ ట్యాంక్ సెల్ ఫోన్ ప్యాడ్ ఉన్నాయి.

యుఎమ్ మొజావే, క్లాసిక్ క్రూయిజర్ బైకులు

మొజావే మరియు క్లాసిక్ రెండు బైకుల్లో కూడా 279.5సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలద. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ గల ఇది 25బిహెచ్‌పి పవర్ మరియు 23ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

యుఎమ్ మొజావే, క్లాసిక్ క్రూయిజర్ బైకులు

ఒక్కో మోటార్ సైకిల్ బరువు 179 కిలోలుగా ఉంది. అంతే కాకుండా, ఇందులో సర్వీస్ అలర్ట్ మెయింటెనెన్స్ ఫీచర్‌ను స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది. బైకు సర్వీసింగ్ సంభందించిన వివరాలను ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో చూపిస్తుంది.

యుఎమ్ మొజావే, క్లాసిక్ క్రూయిజర్ బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యుఎమ్ మోటార్‌సైకిల్స్ గత ఏడాది దేశీయ విపణిలోకి ప్రవేశించింది. ఇండియన్ క్రూయిజర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో భారీ వాటాను సొంతం చేసుకునే లక్ష్యంతో తొలుత రెండు బైకులను విడుదల చేసింది. ఇప్పుడు కమండో క్లాసిక్ మరియు కమాండో మొజావే బైకులను విడుదల చేసింది.

Most Read Articles

English summary
Read In Telugu: UM Motorcycle Launch The Renegade Commando Mojave & Renegade Commando Classic
Story first published: Monday, September 4, 2017, 15:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X