నన్ను ఇష్టపడే వారికి అక్టోబర్ 3, 2017 న గుడ్ న్యూస్

Written By:

ఇటాలియన్ టూ వీలర్ల తయారీ సంస్థ పియాజియో సరికొత్త వెస్పా స్కూటర్‌ను భారత విపణిలోకి విడుదల చేయడానికి ఏర్పాట్లు సిద్దం చేసుకుంది. అక్టోబర్ 3, 2017 న వెస్పా రెడ్ అనే సరికొత్త బ్రాండ్ పేరు గల స్కూటర్‌ను విడుదల చేయనుంది.

వెస్పా రెడ్ స్కూటర్‌

రెడ్ అనే పేరు గల ఆర్గనైజేషన్‌లో వెస్పా బ్రాండ్ చేరింది. ట్యూబర్‌క్యులోసిస్, ఎయిడ్స్ మరియు మలేరియా తో భాదపడే వారి సహాయం కోసం ఈ రెడ్ ఆర్గనైజేషన్‌లో వెస్పా చేరింది. కాబట్టి వెస్పార్ రెడ్ స్కూటర్ ఎంచుకునే వారు పరోక్షంగా బాధితులకు సహాయం చేయనున్నారు.

వెస్పా రెడ్ స్కూటర్‌

అంతర్జాతీయ విపణిలో వెస్పా 946 స్కూటర్ పూర్తిగా రెడ్ కలర్ ఆప్షనల్‌లో లభిస్తోంది. విక్రయించే ప్రతి యూనిట్‌కు చెప్పున 150 డాలర్లను ఆర్గనైజేషన్‌కు అందిస్తోంది. ఎయిడ్స్ బాధితుల కోసం లో రెడ్ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించబడింది. ఇప్పటి వరకు సుమారుగా 450 మిలియన్ డాలర్లకు పైగా నిధులు చేకూర్చింది.

Recommended Video - Watch Now!
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
వెస్పా రెడ్ స్కూటర్‌

అయితే, వెస్పా ఇండియన్ మార్కెట్లోకి అసలైన 946 రెడ్ స్కూటర్‌ను విడుదల చేయడం లేదు. దీనికి బదులుగా, 125సీసీ మరియు 150సీసీ వెర్షన్‌‌లో లభించే విఎక్స్ఎల్, ఎస్ఎక్స్ఎల్, ఎలిగెంట్ మరియు స్టాండర్డ్ వెస్పా స్కూటర్లను రెడ్ కలర్ పెయింట్ స్కీములో అందివ్వనుంది.

వెస్పా రెడ్ స్కూటర్‌

గతంలో, పియాజియో ఇండియా వెస్పా 946 ఎంపోరియం అర్మానీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. సుమారుగా 12.04 లక్షల ధరతో విడుదలైన ఈ స్కూటర్ ఈ మధ్యనే మార్కెట్ నుండి తొలగించబడింది. పియాజియో మరియు జియార్జియో అర్మానీ మద్య భాగస్వామ్యం ముగియడంతో దీనిని తొలగించడం జరిగింది.

వెస్పా రెడ్ స్కూటర్‌

ప్రస్తుతం, ఇండియాలో 125సీసీ మరియు 150సీసీ కెపాసిటి గల వెస్పా స్కూటర్ల లభ్యమవుతున్నాయి. ఇవి, వరుసగా 11.44బిహెచ్‌పి పవర్ మరియు 10.45ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఎరుపు రంగు పెయింట్ స్కీమ్ మినహాయిస్తే ఈ స్కూటర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు.

వెస్పా రెడ్ స్కూటర్‌

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రతి వెస్పా రెడ్ స్కూటర్ విక్రయం మీద వచ్చే దానిలో కొంత మొత్తం హెచ్ఐవీ బాధితులకు అందజేయడం అబినందనీయం. ప్రస్తుతం వెస్పా స్కూటర్ల ధరల శ్రేణి రూ. 71,000 ల నుండి రూ. 97,000 మధ్య ఉంది. అయితే, రెడ్ ఎడిషన్ స్కూటర్ల ధరలు రూ. 5,000 నుండి 10,000 వరకు అదనంగా ఉండనున్నాయి.

English summary
Read In Telugu: Vespa RED India Launch Date Revealed
Story first published: Thursday, September 28, 2017, 12:28 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark