చిన్న తప్పు నిండు ప్రాణాన్ని బలిగొంది; స్కూటర్లో వెళుతున్నారా... తస్మాత్ జాగ్రత్త
ముంబాయ్‌లో ఓ మహిళా రైడర్ స్కూటర్ మీద వెళ్తూ లేన్ చేంజ్(రోడ్డు మారడం) కోసం ప్రయత్నిస్తూ క్రింద పడిపోయింది. ఆమె వెకాలే వచ్చిన హైడ్రాలిక్రేన్ ఆమె మీదుగా వెళ్లడంతో అక్కడిక్కడే మరణించింది.
ముంబాయ్‌లో ఓ షాకింగ్ ప్రమాదం జరిగింది. చిన్న తప్పిదం నిండు ప్రాణాన్ని క్షణాల్లో బలిగొంది. చెప్పుకోవడానికి చాలా చిన్న కారణమే... కానీ, ఊహించని విధంగా ప్రాణం గాల్లో కలిసిపోయింది.

ముంబాయ్‌లో ఓ మహిళా రైడర్ స్కూటర్ మీద వెళ్తూ లేన్ చేంజ్(రోడ్డు మారడం) కోసం ప్రయత్నిస్తూ క్రింద పడిపోయింది. ఆమె వెకాలే వచ్చిన హైడ్రాలిక్రేన్ ఆమె మీదుగా వెళ్లడంతో అక్కడిక్కడే మరణించింది.

ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం రోడ్లు. అవును, 34 ఏళ్ల వయస్సున్న శిల్పా పూరి ఆఫీసులో పనిపూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా కర్గర్ ప్రాంత సమీపంలోని ఉత్సవ్ చౌక్‌లో రోడ్డు మీద గల గుంత కారణంగా క్రిందపడిపోయింది.
Recommended Video


శిల్పా రోడ్డు మీద ఉన్న గుంతను గమనించి వెంటనే దానిని తప్పించేందుకు ప్రక్కలేన్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించింది. అయితే, రోడ్డు అసమానంగా ఉండటంతో స్కూటర్‌ను బ్యాలెన్స్ చేయలేక అనుకోకుండా రోడ్డు మీద పడిపోయింది.

స్కూటర్ వెనకాలే వస్తున్న భారీ పరిమాణం గల హైడ్రాలిక్ క్రేన్ శిల్పా మీద వెళ్లిపోయింది. ఇంత ఘోరమైన ప్రమాదం మరెప్పుడూ జరగకూడదు. క్రేన్ నడుపుతున్న వ్యక్తి శిల్పా తన వాహనం క్రింద పడటాన్ని గమనించాడు.

ముందు చక్రాలు ఆమె మీదుగా వెళ్లినా కూడా వాహనాన్ని ఆపకుండా అలాగే పోనిచ్చాడు. దీంతో వెనుక చక్రాలు కూడా ఎక్కించాడు. ముందు చక్రాలు వెళ్లిన వెంటనే వాహనాన్ని ఆపి ఉంటే శిల్పా ప్రాణాలతో బ్రతికి ఉండేది. ఏదేమైనా ఊహించని ప్రమాదం శిల్పా ప్రాణాలను హరించేశాయి.

శిల్పాతో పాటు మరో మూడు టూ వీలర్లు ఆమె వెనకాలే వచ్చాయి. ఈ ప్రమాదాన్ని చూసిన వారు ఏమీ తెలియనట్లు అక్కడి నుండి జారుకున్నారు. కనీసం ఆమె పరిస్థితి ఏంటో అని చూడకుండా కఠిన హృదయాలతో వెళ్లిపోయారు. అదే దారిలో ఎంతో వెళ్లారు, అయితే ఎవ్వరూ స్పందించలేదు.
Trending On DriveSpark Telugu:

చాలా సమయం తరువాత ఓ మోటార్ సైకిల్ రైడర్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అక్కడకు చేరుకుని శిల్పాను హాస్పిటల్‌కు తరలించారు. బాదాకరమైన విషయం ఏమిటంటే చాలా ఆలస్యంగా తీసుకెళ్లడంతో ఆమె అప్పటికే చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించారు.

ఈ ప్రమాదానికి బాద్యులెవరు ? రోడ్డు పాడయినపుడు, రోడ్డు బాగోలేదని లేదంటే రిపేరీలో ఉందని ఒక రహదారి బోర్డు పెట్టాలి. అయితే, అక్కడ రోడ్డు బాగోలేదని తెలియని రైడర్లు సడెన్‌గా చూసినపుడు ప్రక్కకు తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఊహించని ప్రమాదాల బారిన పడతారు.
కాబట్టి రద్దీగా ఉండే నగరాల్లోని రోడ్ల పర్యవేక్షణ మరియు వాటిని బాగుచేయడాన్ని ఆయా ప్రభుత్వాలు భాద్యతగా తీసుకోవాలి.
ఇలాంటి ప్రమాదాల్ని నివారించే అవకాశాలున్నాయా...?
ఖచ్చితంగా నివారించవచ్చు. రోడ్డు పాడయ్యిందన్న సమాచారాన్ని సూచించే హెచ్చరిక బోర్డులను పెట్టి ఉంటే, రైడర్ జాగ్రత్తపడే అవకాశం ఉండేది. ఇలాంటి సందర్భంలో లైన్ చేంజ్ అయ్యే అవకాశం అవసరమయ్యేది. కానీ చాలా ప్రమాదాల్లో రైడర్లదే తప్పంటారు.

టూ వీలర్ రైడర్‌గా రద్దీతో కూడిన సిటీల్లో జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. అధిక వేగంలో ఉన్నపుడు రోడ్డు బాగోలేదని కుడి వైపుకు వెళ్లేందుకు అస్సలు ప్రయత్నించకండి. మీ వెనకాలే వచ్చే వాహనాలు మీ మీద నుంచి పోతాయి. మరియు ఎప్పుడు రియర్ వ్యూవ్ మిర్రర్లను గమనిస్తూ ఉండండి. ఇలా చేయడంతో వెనుక వచ్చే వాహనాలను గుర్తించవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి ఎంతో మంది చూసి చూడనట్లు వెళ్లిపోయారు. మనలో ఒకరుగా బ్రతికే మనిషి ప్రమాదానికి గురైనపుడు ఏమీ పట్టనట్లు అందరూ వెళ్లిపోతుంటే చాలా బాదగా అనిపిస్తుంది. ప్రమాదం ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ఒక మనిషిగా మన బాధ్యత, మానవత్వం మరిచిపోతున్నామనడానికి ఇదొక నిదర్శనం. ఎంత ఎత్తుకి ఎదిగినా, ఎంత సంపాదించినా మన మూలం మానవత్వమై ఉండాలి. ప్రాణాపాయ సమయంలో తెలిసిన వారైనా.... తెలియని వారైనా వెంటనే స్పందిస్తే ఎన్నో విలువైన ప్రాణాలు నిలబడతాయి.


Click it and Unblock the Notifications








