ప్రపంచపు అతి పెద్ద హోండా టూ వీలర్ల ప్రొడక్షన్ ప్లాంటు ఇప్పుడు ఇండియాలో

ప్రపంచపు అతి పెద్ద హోండా టూ వీలర్ల తయారీ ప్లాంటును ఇండియాలో ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం నాలుగు ప్రొడక్షన్ ప్లాంట్లు ఇండియాలోనే ఉన్నాయి.

By Anil

మార్కెట్, తయారీ మరియు మానవ వనరుల పరంగా ఇండియాలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని దేశ, విదేశీ సంస్థలు ప్రపంచ రికార్డులను నెలకొల్పుతున్నాయి. అందులో ప్రత్యేకించి ఆటోమొబైల్ రంగానికి భారత్ స్వర్గధామంగా మారింది. బైకులు, కార్లు, బస్సులు మరియు లారీ లను దేశీయ మరియు అంతర్జాతీయ సంస్థలు ఇండియాలో ఉత్పత్తి చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.

జపాన్‌ దిగ్గజం హోండా టూ వీలర్స్ మార్కెట్ అవకాశాల కోసం భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచపు అతి పెద్ద హోండా టూ వీలర్ల తయారీ ప్లాంటును ఇండియాలో ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం నాలుగు ప్రొడక్షన్ ప్లాంట్లు ఇండియాలోనే ఉన్నాయి.

Recommended Video

2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ ప్లాంటు

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ కర్ణాటకలోని కోలార్ జిల్లాలో గల నర్సాపుర హోండా టూ వీలర్ల ప్రొడక్షన్ ప్లాంటులో మరో కొత్త అసెంబ్లీ లైన్ ప్రారంభించింది. ఇదే ప్రొడక్షన్ ప్లాంటులో మొత్తం నాలుగు అసెంబ్లీ లైన్‌లు ఉన్నాయి.

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ ప్లాంటు

బెంగళూరు మహానగరానికి వెలుపల ఉన్న ఈ ప్రొడక్షన్ ప్లాంటు విస్తరణలో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా..? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హోండా టూ వీలర్ల ప్లాంట్లలో ఈ ప్లాంటు ఇప్పుడు అతి పెద్దదిగా నిలిచింది.

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ ప్లాంటు

మేకిన్ ఇండియా చొరవతో, ఇటు హోండా టూ వీలర్స్‌కు అటు భారత్ రెండింటికి కూడా ఈ అరుదైన విజయం సాధ్యమైంది. హోండా అడ్వెంచర్ టూరింగ్ మోటార్ సైకిల్ హోండా ఆఫ్రికా ట్విన్ లాంచి చేసిన తరువాత. హోండా అధికారికంగా నాలుగవ లైన్ అసెంబ్లీ యూనిట్ ప్రారంభించింది.

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ ప్లాంటు

ప్రపంచ టూ వీలర్ల మార్కెట్లో హోండా టూ వీలర్స్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రొడక్షన్ ప్లాంట్లను హోండా నెలకొల్పింది మరియు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న ప్రజలు వినియోగించే ఉత్పత్తులకు అనుగుణంగా అన్ని రకాల టూ వీలర్లను ఉత్పత్తి చేస్తోంది. చిన్న చిన్న స్కూటర్ల నుండి సూపర్ బైకులు హోండా లైనప్‌లో ఉన్నాయి. ప్రపంచపు దిగ్గజ టూ వీలర్ల సంస్థకు ఇండియాలో అతి పెద్ద ప్రొడక్షన్ ప్లాంటు ఉంది.

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ ప్లాంటు

హోండా టూ వీలర్ల సంస్థకు ఇండియా అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. మరియు ప్రపంచ మార్కెట్ వాటాలో మేజారిటీ షేర్ ఇండియాలోనే ఉండటం విశేషం. భారీ పెట్టుబడులతో హోండా ముందుకు రావడం మరియు ఇండియాలో మంచి మార్కెట్ అవకాశాలు ఉండటంతో దేశవ్యాప్తంగా హోండా నాలుగు తయారీ యూనిట్లను నెలకొల్పింది.

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ ప్లాంటు

హోండా తమ తొలి తయారీ యూనిట్‌ను హర్యాణాలోని మానేసర్ లో ఏర్పాటు చేసింది. ఏడాదికి 16 లక్షల 50 వేల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ ప్లాంటు మొత్తం 100,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది.

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ ప్లాంటు

ఆ తరువాత హోండా తమ రెండవ ప్రొడక్షన్ ప్లాంటును రాజస్థాన్ లోని టపుకరా ప్రాంతంలో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు పూర్తి స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించాక 2012-2013 ఆర్థిక సంవత్సరంలో హోండా టూ వీలర్ ఇండియా మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 28 లక్షలకు చేరుకుంది.

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ ప్లాంటు

హోండా టూ వీలర్స్ మూడవ ప్రొడక్షన్ ప్లాంటును 2013లో కర్ణాటకలో కోలార్ జిల్లాలోని నర్సాపూర్‌లో నెలకొల్పింది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫ్యాక్టరీగా చెప్పుకునే ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 12 లక్షలు యూనిట్లుగా ఉంది.

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ ప్లాంటు

హోండా తమ నాలుగవ ప్రొడక్షన్ ప్లాంటును గుజరాత్‌లోని విథలపూర్‌లో కేవలం స్కూటర్ల తయారీ కోసం మాత్రమే ఏర్పాటు చేసింది. ఇండియాలో ఏకైక స్కూటర్ల తయారీ ప్లాంటుగా మరియు ప్రపంచపు అతి పెద్ద స్కూటర్ల తయారీ ప్లాంటుగా నిలిచింది. ఈ తయారీ యూనిట్‌లో ఏడాదికి 12 లక్షల హోండా స్కూటర్లు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ ప్లాంటు

హోండా నర్సాపుర ప్రొడక్షన్ ప్లాంటులో నాలుగవ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద హోండా టూ వీలర్ల ప్రొడక్షన్ ప్లాంటుగా నిలిచింది. ఈ ప్లాంటులో హోండా డ్రీమి యుగా, సిబిషైన్ మరియు ఎస్‌పి షైన్ మోడళ్లు తయారయ్యేవి, నాలుగవ లైన్ ప్రారంభంతో ఇప్పుడు హోండా ఆక్టివా మరియు డియో స్కూటర్లను ఉత్పత్తి చేయవచ్చు.

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ ప్లాంటు

నర్సాపుర తయారీ యూనిట్ విస్తరణకు జపాన్ సంస్థ హోండా టూ వీలర్స్ ఏకంగా 665 కోట్ల పెట్టుబడి పెట్టింది. విస్తరణ చేపట్టడంతో ఏడాదికి ఆరు లక్షల యూనిట్లు ప్రొడక్షన్ పెరిగింది దీంతో రోజు వారీ ప్రొడక్షన్ 2,350 యూనిట్లుగా ఉంది.

ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ ప్లాంటు

ప్లాంటు విస్తరణ అనంతరం జరిగిన కార్యక్రమంలో హోండా మోటార్ కంపెనీ జపాన్ ఆపరేటింగ్ ఆఫీసర్ మరియు డైరక్టర్ షింజి అయోమా మాట్లాడుతూ," హోండా టూ వీలర్స్‌కు ఇండియా అతి ముఖ్యమైన మార్కెట్ మరియు హోండాకు అత్యుత్తమ వృద్దిని సాధించి పెడుతోంది. హోండా గ్లోబల్ సేల్స్‌లో 30 శాతం వాటా ఇండియన్ మార్కెట్‌దే ఉందని తెలిపాడు."

హోండా నర్సాపుర ప్రొడక్షన్ ప్లాంటు పర్యావరణహితమైనది. వర్షపు నీటితో హార్వెస్టింగ్ మరియు ప్లాంటులో వినియోగించే విద్యుత్‌లో 80 శాతం సోలార్ ప్యానెల్స్ నుండి ఉత్పిత్తి అవుతోంది.

Most Read Articles

Read more on: #హోండా #hyundai
English summary
Read In Telugu: Honda’s Narsapura Factory Is Now World’s Largest Honda Two-Wheelers Factory
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X