TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
డార్క్ నైట్ ఎడిషన్ టూ వీలర్లను విడుదల చేసిన యమహా
యమహా మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దేశీయ టూ వీలర్ల మార్కెట్లో ఉన్న తమ మోటార్ సైకిళ్లను మరియు స్కూటర్లను డార్క్ నైట్ ఎడిషన్ వేరియంట్లలో విడుదల చేసింది. వివిధ రకాల డార్క్ నైట్ ఎడిషన్ వేరియంట్లు మరియు వాటి ధరల వివరాలు పూర్తిగా...
యమహా డార్క్ నైట్ ఎడిషన్ వేరియంట్లో లభించే టూ వీలర్లు
- యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ,
- యమహా సెల్యూటో ఆర్ఎర్స్ మరియు
- సిగ్నస్ రే జడ్ఆర్ డిస్క్ బ్రేక్ మోడల్.
- యమహా డార్క్ నైట్ వేరియంట్ ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ ధర రూ. 84,012 లు.
- సెల్యూటో ఆర్ఎక్స్ డార్క్ నైట్ వేరియంట్ ధర రూ. 48,721 లు
- సిగ్నస్ రే జడ్ఆర్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 56,898 లు.
- అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.
డార్క్ నైట్ ఎడిషన్ వేరియంట్లలో లభించే మోడళ్ల మీద మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ మరియు క్రోమ్ ఫినిషింగ్ ఎక్ట్సీరియర్‌ను అందివ్వడం జరిగింది. ఆకర్షణీయమైన ఎక్ట్సీరియర్ ఫినిషింగ్‍తో పండుగ సీజన్‌లో నూతన కస్టమర్లను చేరుకునేందుకు యమహా ఓ చిరు ప్రయత్నం చేస్తూ వీటిని విడుదల చేసింది.
యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్‌ఐ నైట్ ఎడిషన్ మోటార్ సైకిల్‌లో 149సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టడ్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 13బిహెచ్‌పి పవర్ మరియు 12.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
యమహా సెల్యూటో ఆర్ఎక్స్ డార్క్ నైట్ ఎడిషన్‌లో 110సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సిగంల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న ఈ ఇంజన్ గరిష్టంగా 7.37బిహెచ్‌పి పవర్ మరియు 8.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
యమహా సిగ్నస్ రే జడ్ఆర్ స్కూటర్(డిస్క్ బ్రేక్)లో మాత్రమే డార్క్ నైట్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఈ స్కూటర్‌లోని 113సీసీ సామర్థ్యపు వి-బెల్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల, గాలితో చల్లబడే ఇంజన్ 7.10బిహెచ్‌పి పవర్ మరియు 8.1ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
యమాహా ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రాయ్ కురియన్ మాట్లాడుతూ, "స్పోర్టివ్ మరియు స్టైలిష్ లక్షణాలున్న తమ టూ వీలర్లను సరికొత్త బ్లాక్ మ్యాట్ కలర్ ఫినిషింగ్‌లో ప్రత్యేకంగా డార్క్ నైట్ ఎడిషన్ పేరుతో విభిన్న కస్టమర్ల కోసం ప్రవేశపెట్టినట్లు తెలిపాడు. ఈ పండుగ సీజన్‌లో డార్క్ నైట్ ఎడిషన్ బెస్ట్ ఎంపిక అని చెప్పుకొచ్చారు."
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
డార్క్ నైట్ ఎడిషన్ వేరియంట్లో పరిచయమైన మోటార్ సైకిళ్లలో ఎక్ట్సీరియర్ బాడీ పెయింట్ మరియు క్రోమ్ సొబగుల జోడింపును మినహాయిస్తే, సాంకేతికంగా వీటిలో ఎలాంటి మార్పులు జరగలేదు. అరుదైన బైకులను ఎంచుకోవాలనుకునే వారికి ఈ పండుగ సీజన్‌లో ఇవి బెస్ట్ ఛాయిస్‌గా నిలవనున్నాయి.