ఫేజర్ 250 బైకును పరీక్షిస్తున్న యమహా: ఫోటోలు లీక్...

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ యమహా, ఇండియన్ రోడ్ల మీద ఫేజర్ 250 మోటార్ సైకిల్‌ను పరీక్షిస్తోంది. మరో రహదారి పరీక్షలకొచ్చిన ఫేజర్ 250 బైకు ఫోటోలు మరియు ఇంటర్నెట్ మరియు వాట్సాప్‌లో స్వైరవిహారం చేస్తున్నాయి.

యమహా ఫేజర్ 250

సరికొత్త ఫోటోల ద్వారా యమహా ఫేజర్ 250 ప్రొడక్షన్ దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సరికొత్త డిజైన్ గల ఫేజర్ 250ను ప్రపంచ విపణిలో ఉన్న ఫేజర్ 650 మరియు ఫేజర్ 1000 ఆధారంగా అభివృద్ది చేశారు.

Recommended Video - Watch Now!
2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
యమహా ఫేజర్ 250

ఫేజర్ 250 ఓవరాల్ డిజైన్‌లో హెడ్‌ ల్యాంప్‌కు ఇరువైపులా కండలు తిరిగిన శరీరాన్ని అందించారు. రెండుగా ఉన్న సీట్లు, ఎల్ఇడి టెయిల్ లైట్లు మరియు వెడల్పాటి ట్యూబ్ లెస్ టైర్లు ఇందులో ఉన్నాయి.

యమహా ఫేజర్ 250

సాంకేతికంగా యమహా ఫేజర్ 250 మోటార్ సైకిల్‌లో 249సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే ఫ్యూయల్ ఇంజెక్టడ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానున్న ఇది 20.9బిహెచ్‌పి పవర్ మరియు 20ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫేజర్ 250 బరువు 10 నుండి 15 కిలోల వరకు పెరగనుంది.

యమహా ఫేజర్ 250

ఎఫ్‌జడ్ 25లో గుర్తించిన అదే డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో రానుంది. అంతే కాకుండా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ ఇందులో వచ్చే అవకాశం ఉంది. ఫేజర్ 250 ఓవరాల్ డిజైన్ అత్యంత అగ్రెసివ్‌గా ఉంది.

యమహా ఫేజర్ 250

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యమహా ఫేజర్ 250 విపణిలోకి విడుదలైతే హోండా సిబిఆర్ 250ఆర్, కెటిఎమ్ ఆర్‌సి 200, బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 మరియు అప్‌కమింగ్ టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్ లకు పోటీగా నిలవనుంది. మరికొన్ని నెలల్లో విపణిలోకి విడుదల కానున్న ఫేజర్ 250 రూ. 1.4 లక్షలు లేదా 1.5 లక్షల అంచనా ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

Read more on: #యమహా #yamaha
English summary
Read In Telugu: Spy Pics: Yamaha Fazer 250 Spotted Testing

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark