యమహా ఫేజర్25 విడుదల: ధర, ఇంజన్, ఫీచర్ల కోసం....

Written By:

యమహా ఫేజర్ 25 బైకు నేడు(21 ఆగష్ట్ 2017) విపణిలోకి విడుదలయ్యింది. ఈ ఏడాది ఎఫ్‌జడ్25 తరువాత యమహా విడుదల చేసిన రెండవ బైకు ఫేజర్25. యమహా ఫేజర్ 25 ప్రారంభ ధర రూ. 1,28,33 5 లు ఎక్స్-షోరూమ్(ముంబాయ్) మరియు రూ. 1,29,335 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

యమహా ఫేజర్25 విడుదల

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఎఫ్‌జడ్25 యొక్క ఫెయిర్ వెర్షన్(బైకు ప్రక్కవైపుల డీకాల్స్ ఉండటం) ఫేజర్25గా విడుదలయ్యింది. రెండు బైకుల్లో ఉన్న ఇంజన్, ఛాసిస్ మరియు దాదాపు అన్ని విడి భాగాలు సమానంగా ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
యమహా ఫేజర్25 విడుదల

ఫేజర్ లైనప్‌లో ఉన్న చిన్న బైకు ఫేజర్ 150 రూపంలోనే ఈ ఫేజర్ 25 ఉంటుంది. స్పోర్టివ్ డిజైన్, అగ్రెసివ్ ఫ్రంట్ లుక్, మరియు ప్రాక్టికల్ ఫెయిరింగ్ దీని సొంతం. ఫ్రంట్ డిజైన్‌లో హెడ్ ల్యాంప్‌కు క్రిందుగా ఇరువైపులా డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

యమహా ఫేజర్25 విడుదల

యమహా ఎంట్రీ లెవల్ టూరర్ మోటార్ సైకిల్‌గా పిలువడే ఫేజర్ 25లో సాంకేతికంగా 249సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఎఫ్‌జడ్25 బైకులో కూడా ఇదే ఇంజన్ కలదు.

యమహా ఫేజర్25 విడుదల

యమహా ఫేజర్25 లోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 20బిహెచ్‌పి పవర్ మరియు 20ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న ఇది గరిష్టంగా లీటర్‌కు 43కిలోమీర్ల మైలేజ్ ఇవ్వగలదని యమహా పేర్కొంది.

యమహా ఫేజర్25 విడుదల

యమహా ఎఫ్‌జడ్ 25(148కిలోలు) తో పోల్చుకుంటే యమహా ఫేజర్ 25(154 కిలోలు) బరువు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎఫ్‌జడ్25 తరహా రైడింగ్ కంఫర్ట్ మరియు హ్యాండ్లింగ్‌ను ఫేజర్ 25 కలిగి ఉండే అవకాశం ఉంది. ఒక్క డిజైన్ మినహాయిస్తే రెండు బైకులు దాదాపు ఒక్కటే.

యమహా ఫేజర్25 విడుదల

యమహా ఫేజర్ 25 బైకులో

  • ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్
  • వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్
  • రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు
  • 17-అంగుళాల అల్లాయ్ వీల్స్
  • 14-లీటర్ల స్టోరేజ్ కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్
  • ఎల్ఇడి పొజిషన్ హెడ్ ల్యాంప్
  • మల్టీ ఫంక్షన్ ఎల్ఇడి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అయితే కనీసం ఆప్షనల్‌గా కూడా యాంటిలాక్ బ్రేకింగ్ ఫీచర్ అందివ్వలేదు.
యమహా ఫేజర్25 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యమహా ఫేజర్25 బైకు ఇండియా లైనప్‌లో అతి ముఖ్యమైన ప్రొడక్ట్. టూరర్ సెగ్మెంట్లో, ఎంట్రీ లెవల్ రేంజ్‌లో విడుదలైన దీని సంస్థకు భారీ అంచనాలే ఉన్నాయి. 250సీసీ సెగ్మెంట్లో విభిన్నమైన ఫ్రెష్ లుక్‌తో లభించే నూతన మోడళ్లను కోరుకునే కస్టమర్లకు ఇది ప్రధాన ఎంపికగా మారనుంది.

English summary
Read In Telugu: Yamaha Fazer 25 Launched In India: Priced At Rs 1.28 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark