యమహా ఎఫ్‌జడ్ 25 ఇండియా విడుదల: ధర, మైలేజ్ మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు

యమహా ఇండియా దేశీయంగా ఉన్న 200-250సీసీ సెగ్మెంట్లోకి తమ ఎఫ్‌జడ్ 25 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. ధర, మైలేజ్ మరియు ఇంజన్ వివరాల గురించి పూర్తిగా...

By Anil

జపాన్‌కు చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ యమహా ఇండియా విభాగం దేశీయంగా ఎఫ్‌జడ్ 25 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. 200-250సీసీ సెగ్మెంట్లోకి విడుదలైన ఎఫ్‌జడ్ 25 ప్రారంభ ధర రూ. 1,19,500 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.

సాంకేతిక వివరాలు

సాంకేతిక వివరాలు

యమహా ఎఫ్‌జడ్ 25 లో 249సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌ను అందించింది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

పవర్ మరియు టార్క్

పవర్ మరియు టార్క్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 8,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 20.6బిహెచ్‌పి పవర్ మరియు 6,200ఆర్‌పిఎమ్ వేగం వద్ద 20ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

యమహా ఎఫ్‌జడ్ 25

  • డిస్క్ బ్రేకులు ముందు - 282ఎమ్ఎమ్/ వెనుక వైపున 220ఎమ్ఎమ్
  • మైలేజ్ - 43 కిమీ/లీ
  • ఇంధన ట్యాంకు సామర్థ్యం - 14 లీటర్లు
  • బైకు మొత్తం బరువు - 148 కిలోలు
  • గ్రౌండ్ క్లియరెన్స్ - 160ఎమ్ఎమ్
  • యమహా ఎఫ్‌జడ్ 25

    యమహా ఈ ఎఫ్‌జడ్ 25 మోటార్ సైకిల్‌లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ను అందివ్వలేదు. అయితే వచ్చే ఏడాది నాటికి ఏబిఎస్ ఫీచర్ అప్‌డేట్‌తో ఈ ఎఫ్‌జడ్ 25 మోటార్ సైకిల్‌ను విడుదల చేయనుంది.

    లభించు రంగులు

    లభించు రంగులు

    సరికొత్త యమహా ఎఫ్‌జడ్ 25 మోటార్ సైకిల్ మూడు విభిన్న రంగుల్లో లభించును. అవి,

    • నైట్ బ్లాక్,
    • వారియర్ లైట్
    • బాలిస్టిక్ బ్లూ.
    • డిజైన్

      డిజైన్

      ఎఫ్‌జడ్ 25 మోటార్ సైకిల్ చూడటానికి అచ్చం ఎఫ్‌జడ్ 16 ను పోలి ఉండి, స్ట్రీట్ ఫైటర్ తరహాలో ఉంది. ఎఫ్‌జడ్ శ్రేణిలో నూతన వేరియంట్‌గా విడుదలైన ఇందులో చెక్కబడిన ఆకారంలో ఉన్న ఇంధన ట్యాంకు మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ కలదు.

      యమహా ఎఫ్‌జడ్ 25

      యమహా ఎఫ్‌జడ్ 25 లో, ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, స్పీడ్ వివరాలను డిజటల్ రూపంలో తెలిపే ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఓడోమీటర్, రెండు ట్రిప్ మీటర్లు, ఇంధన వివరాలను తెలిపే ఇండికేటర్లు ఉన్నాయి.

       యమహా ఎఫ్‌జడ్ 25 పోటీదారులు

      యమహా ఎఫ్‌జడ్ 25 పోటీదారులు

      ప్రస్తుతం విపణిలో ఉన్న టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200, కెటిఎమ్ డ్యూక్ 200 మరియు పల్సర్ 200 శ్రేణిలోని మోటార్ సైకిళ్లకు ఇది గట్టి పోటీనివ్వనుంది.

      యమహా ఎఫ్‌జడ్ 25

      దేశీయ పరిజ్ఞానంతో బలమైన ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా అవతరణకు శ్రీకారం

      టాటా మోటార్స్‌ భవిష్యత్తును మలుపు తిప్పే మూడవ ఉత్పత్తి నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యువి ని దేశీయ కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి ధరకు తగ్గ విలువలు, నూతన ఫీచర్లు, ఫ్రెష్ డిజైన్ భాషలో విడుదలకానుంది.

2017 కు చెందిన యమహా వైజడ్‌ఎఫ్-ఆర్6 ఫోటోలు.....

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha FZ25 Launched In India Price Mileage Specifications
Story first published: Tuesday, January 24, 2017, 15:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X