యమహా చెన్నై ప్లాంటులో అరుదైన మైలురాయి

Written By:

చెన్నైలోని యమహా ప్రొడక్షన్ ప్లాంటు పది లక్షల యూనిట్ల ఉత్పత్తితో అరుదైన మైలురాయిని సాధించింది. ఫ్యాసినో స్కూటర్‌ను చెన్నై ప్రొడక్షన్ ప్లాంటు నుండి రోల్ అవుట్ చేసింది.

మొత్తం పది లక్షల యూనిట్లలో స్కూటర్లు మరియు బైకులు ఉన్నట్లు యమహా తెలిపింది. ఇందులో, రేజడ్, రేజడ్ఆర్, ఆల్ఫా, సెల్యూటో మరియు సెల్యూటో ఆర్ఎక్స్ ఉత్పత్తులు ఇందులో ఉన్నాయి.

యమహా చెన్నై ప్లాంటు

యమహా ఇండియా 2015లో అధికారికంగా చెన్నైలో ప్రొడక్షన్ ప్లాంటు నుండి కార్యకలాపాలు ప్రారంభించింది. తొలుత ఏడాదికి 4.5 లక్షల యూనిట్ల తయారీతో ప్రారంభమైన ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 6 లక్షల యూనిట్లుగా ఉంది. 2019 నాటికి ఇది 9 లక్షలుగా పెరిగే అవకాశం ఉంది.

యమహా చెన్నై ప్లాంటు

పది లక్షల యూనిట్లలో 8.5 లక్షల టూ వీలర్లను దేశీయంగా విక్రయించిన యమహా, 1.5-లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది. చెన్నై మరియు సూరజ్ ప్రొడక్షన్ ప్లాంట్ల నుండి 2019 నాటికి వార్షిక ఉత్పత్తి 16 లక్షల యూనిట్లను ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు యమహా తెలిపింది.

Recommended Video - Watch Now!
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
యమహా చెన్నై ప్లాంటు

ప్రొడక్ట్ లైనప్‌ నుండి అత్యధికంగా 3.7 లక్షల యూనిట్లతో ఫ్యాసినో స్కూటర్లు అమ్ముడవ్వగా, మిగతా వాటిలో, ఎఫ్‌జడ్ సిరీస్ బైకులతో పాటు, రేజడ్ఆర్ స్కూటర్లు అధికంగా అమ్ముడయ్యాయి. చెన్నై ప్రొడక్షన్ ప్లాంటు మీద యమహా 1300 కోట్ల రుపాయలు పెట్టుబడి పెట్టింది. 2018 నాటికి మరో 200 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

Read more on: #యమహా #yamaha
English summary
Read In Telugu: Yamaha's Chennai Factory Reaches A Significant Milestone
Story first published: Monday, September 25, 2017, 15:21 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark