EICMA 2017: మిలాన్ మోటార్ సైకిల్ షో వేదిక మీద మెరిసిన యమహా ఎమ్‌టి-07
జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా 2017 మిలాన్ మోటార్ సైకిల్ షో వేదిక మీద ఎమ్‌టి-07 బైకును ఆవిష్కరించింది. దీనిని 2014లో ప్రపంచ విపణిలోకి పూర్తి స్థాయిలో విడుదల చేసింది.
జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం యమహా 2017 మిలాన్ మోటార్ సైకిల్ షో వేదిక మీద ఎమ్‌టి-07 బైకును ఆవిష్కరించింది. దీనిని 2014లో ప్రపంచ విపణిలోకి పూర్తి స్థాయిలో విడుదల చేసింది. అప్పటి నుండి సుమారుగా 92,000 యూనిట్లకు పైగా ఎమ్‌టి-07 మోటార్ సైకిళ్లను విక్రయించింది.

యమహా లైనప్‌లోని ఎమ్‌టి-09 మోటార్ సైకిల్ డిజైన్ లక్షణాలతో సరికొత్త ఎమ్‌టి-07 బైకును యమహా అభివృద్ది చేసింది. ఇది వరకే అమ్మకాల్లో ఉన్న వేరియంట్‌తో పోల్చుకుంటే ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. బోల్డ్ హెడ్ ల్యాంప్, కొత్తగా డిజైన్ చేయబడిన ఫ్యూయల్ ట్యాంక్, పదునైన సైడ్ డీకాల్స్, అధునాతన సీట్ మరియు బ్లాక్ సైడ్ ప్యానల్స్ ఉన్నాయి.
Recommended Video


పొడవుగా, సౌకర్యవంతమైన సీటు మాత్రమే కాదు, ఫ్రంట్ డిజైన్, ఇంజన్ మరియు దాని చుట్టు ప్రక్కల గల నిర్మాణంతో పాటు ఫ్యూయల్ ట్యాంక్ ఆకృతి వంటివి మునుపటి ఎమ్‌టి-07 కంటే మరింత మెరుగైన, సమర్థవంతమైన హ్యాండ్లింగ్ కల్పించడంలో తోడ్పడతాయి.

2018 యమహా ఎమ్‌టి-07 మోటార్ సైకిల్‌లో బాగా అభివృద్ది చేయబడిన సస్పెన్షన్ సిస్టమ్ అందించింది. ముందు వైపు అత్యుత్తమ సస్పెన్షన్ కోసం మెరుగుపరిచిన ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యాంపింగ్ మరియు స్ప్రింగ్ నిష్పత్తి ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల షాక్ అబ్జార్వర్ అందించింది.

ఇంజన్ విషయానికి వస్తే, యమహా ఎమ్‌టి-07 మోటార్ సైకిల్‌లో 698సీసీ కెపాసిటి గల ట్విన్ ప్యార్లల్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ రెండు సిలిండర్ల ఇంజన్ గరిష్టంగా 74బిహెచ్‌పి పవర్ మరియు డిమాండుకు తగ్గ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2018 యమహా ఎమ్‌టి-07 బరువు 182కిలోలుగా ఉంది.

2018 యమహా ఎమ్‌టి-07 మోటార్ సైకిల్‌లో బ్రేకింగ్ కార్యకలాపాల కోసం ముందు వైపు 282ఎమ్ఎమ్ డిస్క్ మరియు వెనుక వైపున 245ఎమ్ఎమ్ చుట్టు కొలత గల డిస్క్ బ్రేకులు ఉన్నాయి. యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో స్టాండర్డ్‌గా వచ్చింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
యమహా టూ వీలర్ల శ్రేణి ఎమ్‌టి-07 మోటార్ సైకిల్ ఇది వరకే ఉంది. అయితే, 2018 ఎడిషన్‌గా అత్యాధునిక ఫీచర్లు, డిజైన్ మార్పులు మరియు సాంకేతిక అప్‌డేట్స్‌తో 2017 మిలాన్ మోటార్ సైకిల్ షో వేదిక మీద ప్రపంచ ఆవిష్కరణ చేసింది. వచ్చే ఏడాది దీనిని ప్రపంచ ప్రధాన టూ వీలర్ల మార్కెట్లలో విడుదల చేయనుంది.


Click it and Unblock the Notifications








