యమహా ఆర్15 వి3 ఆన్‍‌లైన్ ఫ్లాష్ సేల్: 20 నిమిషాల్లోనే అమ్మేశారు

Written By:

ఆన్ లైన్ ఫ్లాష్ సేల్ అనాగానే.... ఏ సెల్ ఫోన్ అంటారు. కానీ ఫోన్ కాదండోయ్! యమహా తమ థర్డ్ వెర్షన్ ఆర్15 బైకు మీద ప్లాష్ సేల్ నిర్వహించింది. అయితే సెల్ ఫోన్ల తరహాలో కేవలం 20 నిమిషాల్లోనే సేల్ కోసం ఉంచిన అన్ని బైకులు విక్రయించేశారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
యమహా ఆర్15 వి3 ఆన్‍‌లైన్ ఫ్లాష్ సేల్

జపాన్‌కు చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ యమహాకు చెందిన ఆర్15 వెర్షన్ 3 మోటార్ సైకిల్‌కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్స్ ఉన్నారు. కార్లను ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరేషన్ అంటూ విడుదల చేస్తున్నట్లు యమహా తమ ఆర్15 ను ఇప్పుడు వెర్షన్‌ 3 తో అందుబాటులోకి తీసుకొచ్చింది.

యమహా ఆర్15 వి3 ఆన్‍‌లైన్ ఫ్లాష్ సేల్

యమహా టూ వీలర్స్ తమ థర్డ్ జనరేషన్ ఆర్15 ను ఇండోనేషియా మార్కెట్లోని ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు థాయిలాండ్‌లో కూడా దీని విడుదలకు సన్నాహాలు చేస్తోంది.

యమహా ఆర్15 వి3 ఆన్‍‌లైన్ ఫ్లాష్ సేల్

ఈ విడుదల విషయాలు ప్రక్కనపెట్టి ఫ్లాష్ సేల్ గురించి చూస్తే, యమహా ఇండోనేషియా మార్కెట్ కోసం ఏప్రిల్ 1, 2017 న ఆన్‌లైన్‌లో 155 యూనిట్లకు ఫ్లాష్ సేల్ నిర్వహించింది.

యమహా ఆర్15 వి3 ఆన్‍‌లైన్ ఫ్లాష్ సేల్

అయితే ఇండోనేషియా ఔత్సాహికులు కేవలం 20 నిమిషాల్లోనే 155 బైకులను కొనుగోలు చేసినట్లు యమహా తమ ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించింది.

యమహా ఆర్15 వి3 ఆన్‍‌లైన్ ఫ్లాష్ సేల్

అయితే 20 నిమిషాల్లో 155 బైకులను విక్రయించడంలో వింత ఏముంది అనుకునేరు. ధర పరంగా ఖరీదైన ఈ బైకులను సాధారణంగా 20 నిమిషాలలో విక్రయించడం కాస్త కష్టమే. ఆటోమొబైల్ మార్కెట్లో ఇలా విక్రయించడం ఇంకా అసాధ్యం.

యమహా ఆర్15 వి3 ఆన్‍‌లైన్ ఫ్లాష్ సేల్

మార్కెట్లోకి విడుదల చేసిన అనంతరం తొలి 155 బైకులను కొనుగోలు చేయడానికి ఎగబడిన కొనుగోలుదారులకు విఆర్46 టీ షర్టులను కాంప్లిమెంటరీ గిప్ట్‌గా ఇవ్వనున్నారు. ఈ ఎంట్రీ లెవల్ ఫర్ఫామెన్స్ మోటార్ సైకిల్‌లో భారీ ఫీచర్లను అప్‌డేట్ చేసింది.

యమహా ఆర్15 వి3 ఆన్‍‌లైన్ ఫ్లాష్ సేల్

సాంకేతికంగా యమహా ఆర్15 వెర్షన్3 లో 155.1సీసీ సామర్థ్యం గల ఎస్ఒహెచ్‌సి వేరిబుల్ వాల్వ్ అక్టువేషన్(VVA) ఇంజన్ కలదు. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ గల ఇది గరిష్టంగా 19బిహెచ్‌పి పవర్ మరియు 14.7ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

యమహా ఆర్15 వి3 ఆన్‍‌లైన్ ఫ్లాష్ సేల్

యమహా ఈ థర్డ్ వెర్షన ఆర్15లో స్లిప్పర్ క్లచ్ అందించింది. అయితే ఇందులో అతి ముఖ్యమైన యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మిస్ అయ్యింది. ఆర్15 వి3.0 ను మట్టీ బ్లాక్, రేసింగ్ బ్లూ మరియు మట్టీ రెడ్ రంగుల్లో ఎంచుకోవచ్చు.

యమహా ఆర్15 వి3 ఆన్‍‌లైన్ ఫ్లాష్ సేల్

ఇండోనేషియా మార్కెట్లో బుక్ చేసుకున్న కస్టమర్లకు ఈ ఆర్15 వి3 మోటార్ సైకిళ్లను ఏప్రిల్ నుండి డెలివరీ ఇవ్వనుంది. అయితే ఇండియా విడుదల గురించి యమహా ఇంకా ఎలాంటి ప్రకటించింది.

 
Read more on: #యమహా #yamaha
English summary
Read In Telugu to Know about Yamaha R15 Version 3.0 Sells Out In Just 20 Minutes
Story first published: Saturday, April 8, 2017, 17:27 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark