ఎక్స్ఎస్ఆర్300 పేరుతో మళ్లీ విడుదలకు సిద్దమవుతున్న ఆర్‌డి350

Written By:

జపాన్ టూ వీలర్ల తయారీ సంస్థ యమహా యొక్క ఆర్‌డి350 మార్కెట్ నుండి వైదొలగిన అనంతరం మళ్లీ విడుదలయ్యేందుకు సిద్దమవుతోందని వార్తలు వస్తున్నాయి. యమహాకు ఇండియన్ విపణిలో దీర్ఘకాలం విక్రయాలు సాధించిన ఆర్‌డి350 ఇప్పటికీ భారతదేశంలో వేగవంతమైన యాక్సిలరేటర్ గల బైకుగా ప్రసిద్ది చెందింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
యమహా ఆర్‌డి350

ఆర్‌డి350 సక్సెస్ లోని మజాను మళ్లీ పొందేందుకు అత్యంత అనువైన దేశీయ మార్కెట్లోకి ఆర్‌డి350 ఆధారిత మోటార్ సైకిల్‌ను ఎక్స్ఎస్ఆర్300 అనే విభిన్నమైన పేరుతో మార్కెట్లోకి విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

యమహా ఆర్‌డి350

భారీ సంఖ్యలో విక్రయాలు నమోదు చేయగల సామర్థ్యం ఉన్న ఎక్స్ఎస్ఆర్ 300 మోటార్ సైకిల్‌ను 350 నుండి 400 సీసీ మధ్య సామర్థ్యమున్న ఇంజన్‌ అందించేందుకు ఎక్కువ అవకాశం కలదు.

యమహా ఆర్‌డి350

యమహా ప్రస్థానం 1970 ల కాలంలో రాజ్‌దూత్ విడుదల ద్వారా ఆరంభమైంది. ఆ తరువాత కాలంలో అత్యంత వేగంగా విభిన్న కొత్త మోడళ్లను అందిస్తూ వచ్చింది. ఒకానొక కాలంలో యమహా తొలిసారిగా విడుదల చేసిన ఆర్‌డి350 మోడల్ ఇండియాసలో అత్యంత వేగవంతమైన బైకుగా నిలిచింది.

యమహా ఆర్‌డి350

మరే ఇండియన్ మోటార్ సైకిల్‌కు సాధ్యం కాని విధంగా గరిష్టంగా 40హార్స్ పవర్ ఉత్పత్తి చేయగలిగింది. అయితే తరువాత కాలంలో ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ తగ్గించడానికి మలినాలతో నిండినది కాకుండా శుద్దమైన ఇంధనాన్ని ఇంజన్‌లోకి పంపి, ఇంజన్‌ను రీడిజైన్ చేసి ఆర్‌డి350 ని మళ్లీ విడుదల చేసింది.

యమహా ఆర్‌డి350

ఆ నూతన యమహా ఆర్‌డి350 శక్తివంతమైన ఇంజన్, వేగవంతమైన యాక్సిలరేటర్ వంటి కారణాలతో భారీ విజయాన్ని అందుకుంది. మరే సంస్థకు సాధ్యపడని విక్రయాలను జరిపింది. ఇండియాతో పాటు, అమెరికా, యూరోప్ మరియు జపాన్ లో కూడా దీనికి మంచి ఆదరణ లభించింది.

యమహా ఆర్‌డి350

అయితే అదే స్థాయి ఫలితాలను ఆశిస్తూ సరికొత్త ఎక్స్ఎస్ఆర్350 మోటార్ సైకిల్ ను యమహా అభివృద్ది చేస్తోందని ఆధారం లేని వార్తలు వెలువడుతున్నాయి.

యమహా ఆర్‌డి350

ప్రస్తుతం యమహా విడుదల వద్ద ఉన్న 321సీసీ సామర్థ్యం గల లిక్విడ్‌తో చల్లబడే ఫూయల్ ఇంజెక్టెడ్ ట్విన్ సిలిండర్ ఇంజన్ అందించే అవకాశం ఉంది.

యమహా ఆర్‌డి350

ఈ ఇంజన్ గరిష్టంగా 41బిహెచ్‌పి పవర్ మరియు 29.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాల కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు....

  
Read more on: #యమహా #yamaha
English summary
Rumour: Yamaha RD350 To Make A Comeback As Yamaha XSR300
Story first published: Thursday, February 2, 2017, 13:39 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark