టి7 అడ్వెంచర్ మోటార్ సైకిల్ టీజర్ విడుదల చేసిన యమహా

యమహా ఎమ్‌టి-07 మోటార్ సైకిల్ ఆధారిత అప్ కమింగ్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ టి7 టీజర్‌ను విడుదల చేసింది.

By Anil

జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా ఎమ్‌టి-07 మోటార్ సైకిల్ ఆధారిత అప్ కమింగ్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ టి7 టీజర్‌ను విడుదల చేసింది. టీజర్ ప్రకారం, యమహా టి7 అడ్వెంచర్ బైకు సాంకేతిక మరియు విడుదల వివరాలను సెప్టెంబర్ 6, 2017 న వెల్లడించనుంది.

యమహా టి7 అడ్వెంచర్ మోటార్ సైకిల్

యమహా టి7 అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను ఇటలీలో జరిగిన 2016 ఐక్మా ఆటో షో వేదిక మీద ప్రొడక్షన్ రూపంలో ప్రదర్శించింది. కాన్సెప్ట్ దశ నుండి ప్రొడక్షన్ దశకు చేరుకున్న యమహా టి7 విడుదల ఈ ఏడాదిలోనే ఉండనుంది.

Recommended Video

2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
యమహా టి7 అడ్వెంచర్ మోటార్ సైకిల్

యమహా మోటార్‌స్పోర్ట్స్ విభాగం, ఫ్రాన్స్‌లోని యమహా అఫీషియల్ ర్యాలీ టీమ్, ఇటలీలో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ మరియు నెదర్లాండ్స్‌లోని జికె డిజైన్ సంయుక్తంగా యమహా ఈ టి7 కాన్సెప్ట్‌ను అభివృద్ది చేశాయి.

యమహా టి7 అడ్వెంచర్ మోటార్ సైకిల్

అత్యుత్తమ ఆఫ్ రోడింగ్ లక్షణాలతో, బేసిక్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌గా ప్రొడక్షన్ వెర్షన్ టి7 మోటార్ సైకిల్ విపణిలోకి విడుదల కానుంది. యమహా రహస్యంగా టి7 బైకును పలుమార్లు పరీక్షించింది.

యమహా టి7 అడ్వెంచర్ మోటార్ సైకిల్

యమహా టి7 అడ్వెంచర్ మోటార్ సైకిల్ సాంకేతికంగా 689సీసీ సామర్థ్యం గల ట్విన్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 75బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ సిస్టమ్ మరియు తేలికపాటి బరువున్న ఛాసిస్ దీని ప్రత్యేకత.

యమహా టి7 అడ్వెంచర్ మోటార్ సైకిల్

యమహా టి7 కాన్సెప్ట్ తొలుత అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్, కెవైబి ఫ్రంట్ సస్పెన్షన్, కార్భన్ ఫైబర్ డీకాల్ మరియు స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయి. అయితే ప్రొడక్షన్‌కు సిద్దమైన టి7 బైకులో ఇవన్నీ వస్తున్నప్పటికీ ప్రధానమైన ఫీచర్ల రాకపై ఇంకా స్పష్టత లభించలేదు.

యమహా టి7 అడ్వెంచర్ మోటార్ సైకిల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యమహా అంతర్జాతీయ విపణిలో టి7 బైకును 2018 మోడల్‌గా అందుబాటులోకి తీసుకురానుంది. యమహా దీనిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే, ప్రొడక్షన్ ఖర్చును తగ్గించుకునేందుకు దేశీయంగానే ఉత్పత్తి చేయనుంది. టి7 అడ్వెంచర్ మోటార్ సైకిల్ గురించి సెప్టెంబర్ 6, 2017 న యమహా వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

More from DriveSpark

Article Published On: Monday, August 21, 2017, 11:11 [IST]
English summary
Read In Telugu: Yamaha Teases T7 Adventure Motorcycle
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+